మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం అకేనపల్లి గ్రామానికి చెందిన గుడికందుల కొమురయ్య అనే వ్యవసాయ కూలి.పొలం పనిలో నిమిత్తం ఎడ్ల కచ్చురం తో పొలం పనులకు వెళ్తుండగా ప్రమాదంశాత్తు కచ్చురం బోల్తాపడడంతో.గుడికందుల కొమురయ్య కు త్రీవ గాయాలు కాగా వెంటనే వరంగల్ లోని ఎంజీఎం హాస్పిటల్ కు తరలించడం జరిగిందని ఎంజీఎం లో చికిత్స పొందుతూ ఐదు రోజుల క్రితం మరణించడం జరిగిందని కుటుంబీకులు. తెలిపారు ఆకేనపల్లి మాజీ ఎంపీటీసీ గంగాధరి శ్రీనివాస్ గౌడ్ సేవా స్ఫూర్తి ఫౌండేషన్ మడిపెల్లి మల్లేష్ కు ఫోన్ ద్వారా మృతుని కుటుంబ పరిస్థితిని తెలుపగా బాధిత కుటుంబానికి ఇటీవల పుట్టినరోజు జరుపుకున్న సేవా స్పూర్తి ఫౌండేషన్ సభ్యులు తలకోటి రఘు కుమార్తె తలకోటి నాగ సింధూర జన్మదిన సందర్భంగా మరణించిన కొమరయ్య కుటుంబానికి శుక్రవారం రోజున మాజీ ఎంపిటిసి గంగాధరి శ్రీనివాస్ గౌడ్ ద్వారా 25 కిలోల బియ్యం.మరియు 5 కిలోల వంట నూనె పంపించడం జరిగిందని పౌండేషన్ అధ్యక్షులు మడిపెల్లి మల్లేష్ తెలిపారు. బియ్యం అందజేసిన అనంతరం శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ మరణించిన కొమరయ్య పొలాలకు కైకిల్ వెళ్తూ ఎవరు పిలిచినా కైకిల్ పనులకు వెళ్లేవాడని ఆకేనపల్లి గ్రామంలో అందరితో కలు గోల్పుగా ఉండేవాడని శ్రీనివాస్ గౌడ్ గుర్తు చేశారు కొమురయ్య యొక్క కుటుంబం చాలా పేద కుటుంబమని ఉండటానికి ఇల్లు కూడా లేదని చాలా దీన స్థితిలో ఉన్న కుటుంబానికి ప్రభుత్వ పరంగా కూడా సహాయం అందించాలని మరియు దాతలు కూడా ముందుకు వచ్చి సహాయం చేసి ఈ యొక్క కుటుంబాన్ని ఆదుకోవాల్సిందిగా శ్రీనివాస్ గౌడ్ కోరారు అడగగానే సహాయం అందజేసిన తలకోటి నాగ సింధురా కు అధ్యక్షులు మడిపెల్లి మల్లేష్ కు మరియు సేవా స్ఫూర్తి ఫౌండేషన్ సభ్యులందరికీ అకేనపల్లి గ్రామ ప్రజల తరఫున మరియు మృతుడు కొమురయ్య కుటుంబం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామని గంగాధరి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు ఈ కార్యక్రమంలో.ఫౌండేషన్ ప్రతినిధులు.సామల కుమార్. సామల శ్రీనివాస్; కనుగాంటి బాలరాజు; ఐలావెని రవి. గెళ్ళూ కుమార్.తదితరులు పాల్గొన్నారు..
Post A Comment: