మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
కాంట్రాక్ట్ కార్మికుల న్యాయమైన డిమాండ్లను ఎన్టిపిసి యాజమాన్యం వెంటనే పరిష్కరించాలని యునైటెడ్ ఫోరం నాయకులు డిమాండ్ చేశారు.
ఈరోజు ఎన్టిపిసి ప్రాజెక్టు గేట్ 2 వద్ద యునైటెడ్ ఫోరం ఆధ్వర్యంలో జరిగిన అర్థనగ్న ప్రదర్శన, ర్యాలీ నిర్వహించి వారు మాట్లాడుతూ కాంట్రాక్ట్ కార్మికులు దేశానికి వెలుగులు ఇచ్చే ఎన్టిపిసి మహారత్న కంపెనీలో పనిచేస్తూ, వారి కుటుంబాలు అర్ధాకలితో దుర్భర జీవితాలను గడుపుతున్నారని, దానికి నిరసనగా ఎన్టిపిసి యాజమాన్యానికి తెలియజేయడం కోసం ఈరోజు కార్మికుల అర్థనగ్న ప్రదర్శన నిర్వహించడం జరిగిందని తెలిపారు.
నిరవధిక సమ్మెలోకి వెళ్లే ముందు ఇలాంటి పోరాటాలు నిర్వహిస్తూ, యజమాన్యం స్పందించకుంటే కార్మికులకు, కార్మిక సంఘాలకు గత్యంతర లేని పరిస్థితుల్లో సమ్మె లోకి వెళ్లక తప్పదని, ఈ విషయాన్ని యాజమాన్యం గ్రహించాలని, జూన్ 30 తర్వాత ఏ క్షణమైనా సమ్మెలోకి వెళ్లడం జరుగుతుందని, దానికి కార్మికులంతా సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.
అర్థనగ్న ప్రదర్శనలో ఫోరం నాయకులు సిఐటియు నాంసాని శంకర్, గిట్ల లక్ష్మారెడ్డి,దండ రాఘవరెడ్డి, ఐఎఫ్టియు చిలుక శంకర్, బుచ్చన్న, గోదావరి యూనియన్ రాజ మల్లయ్య,సత్యనారాయణ, టిఆర్ఎస్ ఈ భూమయ్య, చింతల సత్యం, బిఎంఎస్ హెచ్ రాజిరెడ్డి, ఏఐటియుసి ఆర్ లక్ష్మణ్, ఎం శంకర్, టిఎన్టియుసి కంది చంద్రయ్య, ఏ శ్రీనివాస్, కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Post A Comment: