మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
తబిత ఆశ్రమంలో బీఎస్పీ ఉత్తర తెలంగాణ ఇంచార్జ్ జక్కని సంజయ్ జన్మదిన వేడుకలు.
రామగుండం నియోజకవర్గ బీఎస్పీ పార్టీ ఇంచార్జ్ గోలివాడ ప్రసన్న కుమార్ ఆధ్వర్యంలో బీఎస్సీ పార్టీ ఉత్తర తెలంగాణ ఇంచార్జ్, రాష్ట్ర అధికార ప్రతినిధి జక్కని సంజయ్ కుమార్ జన్మదిన వేడుకలను రామగుండం పట్టణంలోని తబిత అనాథ ఆశ్రమంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గోలివాడ ప్రసన్న కుమార్ మాట్లాడుతూ " బీఎస్పీ పార్టీ ఉత్తర తెలంగాణ ఇంచార్జ్, రాష్ట్ర అధికార ప్రతినిధి జక్కని సంజయ్ కుమార్ బీఎస్పీ పార్టీ అభివృద్ది కొరకు చాలా పనిచేస్తున్నారని, జక్కని సంజయ్ కుమార్ ఆధ్వర్యంలో పార్టీ బూత్ స్థాయి వరకు విస్తరిస్తామని, వచ్చే ఎన్నికలలో రామగుండంలో బీఎస్పీ జెండా ఎగుర వేస్తామని అన్నారు. రాబోవు కాలంలో జక్కని సంజయ్ కుమార్ ఉన్నత పదవులు నిర్వహించాలని ఆకాంక్షించారు. అనంతరం జక్కని సంజయ్ కుమార్ జన్మదినం సందర్భంగా రామగుండం పట్టణంలోని తబిత ఆశ్రమంలో పిల్లల సమక్షంలో కేక్ కట్ చేసి, స్వీట్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీఎస్పీ నాయకులు జనగామ మల్లేష్, అంతడుపుల రాజేందర్, రాచర్ల రాజ్ కుమార్, జనగామ సాయి, చిలుక ప్రశంత్ లతో పాటు తబిత ఆశ్రమ నిర్వాహకులు, పిల్లలు పాల్గొన్నారు.
Post A Comment: