ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
విద్యార్థినీలకు బస్సు పాస్ ల పంపిణీ కార్యక్రమం మంగళవారం రోజున సుబేదారిలోని ప్రభుత్వ బాలికాసదనంలో జరిగింది.
హనుమకొండ టీఎస్ఆర్టీసీ డిపో మేనేజర్ సంబంధిత అధికారులు స్వయంగా బాలికా సదనాన్ని సందర్శించి విద్యార్థినీలతో మాట్లాడిన అనంతరం ఆర్టీసీ హనుమకొండ డిపో మేనేజర్ కే బాబు నాయక్ మాట్లాడుతూ ప్రభుత్వ బాలికా సదనంలో రక్షణ సంరక్షణ పొంది, లష్కర్ బజార్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యనభ్యసించే విద్యార్థినిలకు అనుకూలంగా రవాణా సౌకర్యం కల్పించుటకు చర్యలు తీసుకొని బస్ పాస్ లను అందించడం జరిగిందని రక్షణ సంరక్షణ అవసరం ఉన్న ఇలాంటి పిల్లలకు ఈ రకమైన సేవ చేయడం సంతోషకరమని అన్నారు.
బాలికా సదనం సూపరింటెండెంట్
ఎం కళ్యాణి మాట్లాడుతూ ప్రస్తుతానికి ప్రాథమిక విద్య నభ్యసించే 23 మంది విద్యార్థినిలకు బస్ పాస్ సౌకర్యం కల్పించడం జరిగిందని, ఉన్నత పాఠశాల విద్యనభ్యసించే వారికి కూడా బస్ పాస్ లు త్వరలో అందచేస్తామని అన్నారు.
అనంతరం బస్సును మామిడి తోరణాలతో బస్సును అలంకరించగా పిల్లలందరూ సంతోషంతో బస్సులో పాఠశాలకు వెళ్లారు.
కార్యక్రమంలో చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు కజాంపురం దామోదర్, ప్రొటెక్షన్ ఆఫీసర్ ఎస్ ప్రవీణ్ కుమార్, ఆర్టీసీ హనుమకొండ సూపర్వైజర్
గౌస్ మొయినుద్దీన్, బస్ పాస్ ఇంచార్జి గిరి రాజయ్య బాలికా సదనం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: