ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ 

హన్మకొండ ;

అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు సంసిద్ధం గా ఉండాలి అని సీపీ ఎవి రంగనాధ్ ఆదేశించారు .

మంగళవారం నాడు కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్ నందు సీపీ ఎ వి రంగనాధ్, హనుమకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, వరంగల్ కలెక్టర్ ప్రవీణ్యా మున్సిపల్ కమిషనర్ రిజ్వాన్ బాషా తో కలిసి ఎన్నికల నిర్వహణ పై సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ రాష్ట్రంలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు సన్నద్ధ కార్యక్రమాలను పర్యవేక్షించేందుకు భారత ఎన్నికల కమిషన్ జూన్ 23న ప్రత్యేక సమావేశం నిర్వహిస్తుందని, నియోజకవర్గాలకు సంబంధించిన పూర్తి సంపూర్ణ సమాచారంతో సిద్ధం కావాలని అన్నారు. అక్టోబర్ 1 నాటికి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించేలా పకడ్బందీగా రెండో విడత ఓటర్ జాబితా రూపకల్పన కార్యక్రమాన్ని నిర్వహించాలని, ఇప్పటివరకు వచ్చిన దరఖాస్తుల ప్రస్తుత స్థితిగతులపై నివేదిక తయారు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఇప్పటివరకు ఓటర్ల జాబితా నుండి తొలగించిన ఓటర్ల వివరాలను సమగ్ర సమాచారంతో పునః పరిశీలించి పూర్తి నివేదికలను వెంటనే సమర్పించాలని ఆదేశించారు. అధికారులు సమిష్టిగా కృషి చేసి వరంగల్, హనుమకొండ జిల్లా లలో 100% ఓటింగ్ జరిగేలా కృషి చేయాలని సూచించారు. అసెంబ్లీ ఎన్నికలు స్వేచ్ఛగా, నిస్పక్షపాతంగా, శాంతియుతంగా నిర్వహించేందుకు జిల్లా అధికారుల ది కీలక పాత్ర అని అన్నారు. ఎన్నికల సందర్భంగా చెక్ పోస్టుల ఏర్పాటుతోపాటు ఎన్నికల సిబ్బందిని సమాయత్తం చేయలని తెలిపారు. సమస్యత్మకా ప్రాంతాలలో ఎన్నికలు సమర్ధవంతంగా నిర్వహించడానికి ప్రణాళిక రూపొందిచాలని అన్నారు. ఎన్నికల సమయంలో ఎన్నికల వ్యవస్థ పై అనుమానాలు సృష్టించే విధంగా సోషల్ మీడియా లో వచ్చే తప్పుడు ప్రచారాలు సకాలంలో తిప్పికోట్టె విధంగా సోషల్ మీడియా బృందాలను నియమించాలని అన్నారు. ఎన్నికల నిర్వహణ లో ప్రజల కు ఖచ్చితమైన, ప్రామాణికమైన సమాచారం ఇవ్వడం అధికారుల భాద్యత అని అన్నారు ఎన్నికల నిర్వహణ లో ఏమైనా ఇబ్బందులు ఏర్పడితే నియోజకవర్గల ను ఆధారంగా లిస్ట్ లను రూపొందించాలని సూచించారు. అక్రమ మధ్యం పై ప్రత్యేకంగా ద్రుష్టి సారించాలని, ఈ మేరకు మద్యం వ్యాపారులతో అవగాహన కార్యక్రమలను ఏర్పాటు చేయాలి అని ఎక్సయిజ్ అధికారులకి సూచించారు. ఎన్నికల పారదర్శకంగా నిర్వహించడానికి ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ని ఏర్పాటు చేయాలి అని అన్నారు. ఓటర్లను ఎన్నికల ప్రక్రియలో పాల్గొనేలా ప్రోత్సహించేందుకు జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక డ్రైవ్‌లు, అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని అధికారులకు సూచించారు. ఎన్నికలలో పోలింగ్ శాతాన్ని పెంచడానికి ఇప్పటినుంచే ప్రజలలో అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని పేర్కొన్నారు.ఎన్నికల ప్రవర్తన నియమావళి, విధులపై అధికారులు సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలి అని అన్నారు.

ఈ కార్యక్రమం లో హనుమకొండ వరంగల్ అదనపు కలెక్టర్లు సంధ్య రాణి, అశ్వని తానాజీ, పరకాల ఆర్డీఓ రాము, ఎన్నికల సూపర్ డెంట్ జ్యోతి వర లక్ష్మి .తహసీల్దార్లు రాజకుమార్, కిరణ్ కుమార్, ఎన్నికల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: