మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
సమైక్య పాలనలో తెలంగాణ ప్రాంత క్రీడాకారులకు ఎంతగానో అన్యాయం జరిగిందని, సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ క్రీడలు, క్రీడాకారులకు తగిన ప్రోత్సాహం అందిస్తున్నారని అన్నారు. స్థానిక జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో విజయమ్మ పౌండేషన్ ఆధ్వర్యంలో ఒలంపిక్ డే రన్ ఎమ్మెల్యే ప్రారంభించి మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ క్రీడలను, క్రీడాకారులను ఎంతోగానో ప్రోత్సహిస్తున్నారని ఉన్నారు. భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రంలో ఎంతోమంది మెరుగైన నైపుణ్య క్రీడాకారులు ఉన్నారని అన్నారు. దీంతో యావత్ భారతవని తెలంగాణ వైపు చూస్తుందన్నారు. స్థానిక యువత గొప్ప ఆలోచనలతో క్రీడల్లో ముందుకు రావడం శుభ పరిణామమని అన్నారు. రామగుండం నియోజకవర్గం కళాకారులకు పుట్టినిల్లుగా వర్ధిల్లుతుండడం ఎంతో సంతోషాన్ని ఇచ్చింది అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో రామగుండం నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చేసినట్టు ఆయన తెలిపారు. స్థానిక ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సేవ చేయడం తో ఆనందాన్ని ఇచ్చింది అన్నారు. ఈ కార్యక్రమంలో అర్జీ-వన్ జీఎం చింతల శ్రీనివాస్, ట్రాఫిక్ సి ఐ లు ప్రవీన్ కుమర్ సి ఐ ప్రసాదరావు కార్పొరేటర్లు దొంత శ్రీనివాస్, బాల రాజ్ కుమార్, జనగామ కవిత సరోజిని, కొమ్ము వేణుగోపాల్, ఒలింపిక్ అసోసియేషన్ బాధ్యులు గౌస్ పాషా, నాయకులు జే.వి రాజు విజయలక్ష్మి, దొమ్మేటి వాసు, కళావతి, శారద, రాజయ్య, సత్తయ్య తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: