మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
ప్రగతిశీల మహిళా సంఘం జాతీయ కన్వీనర్ కామ్రేడ్ వి.సంధ్య తదితర 146మందిపై ఉపాచట్టం కింద ములుగు జిల్లా తాడ్వాయి పోలీసులు గత సంవత్సరం ఆగస్టు 19న కేసు నమోదుచేసి అత్యంత రహస్యంగా ఉంచారని ఇటీవల అది బయటికి రావడంతో రాష్ట్రంలో దేశంలో ఉన్న ప్రజలు తాడ్వాయి కేసును ఉపసంహరించుకోవాలని ఆందోళన చేయడంతో ప్రొఫెసర్ హరగోపాల్ తో పాటు ఆరుగురు మేధావులపై తొలగించారని కా.సంధ్యపైనఇతరమేధావులు,హక్కుల కార్యకర్తలు 146 మందిపై అలాగే ఉంచడం అత్యంత దుర్మార్గమైనదని అందరిపై కేసును ఎత్తివేయాలని జిఎల్బికేస్ రీజియన్ కార్యదర్శి ఎల్ విశ్వనాథం డిమాండ్ చేశారు.*జిఎల్ బికేఎస్ కొత్తగూడెం బ్రాంచ్ కమిటీ సమావేశం రైటర్ బస్తీ ఐఎఫ్టియు కార్యాలయంలో ఉపాధ్యక్షులు ఎండి అలీముద్దీన్ అధ్యక్షతన జరిగింది.*తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్రను*పోషించి అనేక సభల్లో ఉద్యమాలలోనేటిముఖ్యమంత్రితో కలిసి వేదికలపై పాల్గొన్న పిఓడబ్ల్యు జాతీయ కన్వీనర్ వీ.సంధ్యను అజ్ఞాతవాసిగా పేర్కొంటూ కేసీఆర్ ప్రభుత్వం కుట్రకేసులు పెట్టడం అత్యంత మోసపూరితమైనదని అన్నారు.*ములుగు పోలీసుల కేసులో *ఆధారాలు లేవని ఆరుగురిపై కేసుఎత్తివేసిన రాష్ట్ర ప్రభుత్వం సంధ్య తదితరులపై ఆధారం లేనప్పటికీ కేసును ఎత్తివేయకుండా ఎందుకుకొనసాగిస్తున్నారని ఆయన ప్రశ్నించారు?*ఈ సమావేశంలో ఎండి. అలీముద్దీన్,కాపు కృష్ణ, సంజీవరావు,నరసింహారాములు, చంద్రయ్య,సురేష్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: