ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ :
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సోమవారం హరితోత్సవం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా ప్రతీ చోట విస్తృత స్థాయిలో మొక్కలు నాటారు. రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్, మేయర్ గుండు సుధారాణి, కుడా చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్ జిల్లా కలెక్టర్ సిక్తా కాకతీయ జూ పార్క్ లో హరితోత్సవం కార్యక్రమంలో పాల్గొనగా, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు భాగస్వాములయ్యారు. ముందుగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన తెలంగాణ దశాబ్ది సంపద వనాలు క్షేత్రంలో ప్రజా ప్రతినిధులతో కలిసి వివిధ రకాల మొక్కలను నాటారు. హరితహారం ద్వారా రాష్ట్రంలో పెంపొందించబడిన అటవీ విస్తీర్ణం, విస్తృత స్థాయిలో పెరిగిన పచ్చదనం గురించి తెలియజేశారు.
ఈ సందర్బంగా చీఫ్ విప్ వినయ్ భాస్కర్ మాట్లాడుతూ సుదీర్ఘ పోరాట ఫలితంగా సాధించిన ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో 9 సంవత్సరాలుగా జరుగుతున్న అభివృద్ధి పనులు
వివరించేందుకు ప్రభుత్వం రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను 21 రోజుల పాటు పండుగ వాతావరణంలో ఘనంగా నిర్వహిస్తుందని , అందులో భాగంగా హరితోత్సవం వేడుకలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా గ్రీన్ కవర్ పెంచేందుకు 2015లో తెలంగాణకు హరితహారం కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించిందని అన్నారు. భూమిపై ఉన్న సమస్త ప్రాణులకు జీవాధారమైన ప్రాణవాయువు ఆక్సిజన్ ను చెట్లు అందిస్తాయని తెలిపారు. కరోనా సమయంలో ఆక్సిజన్ విలువ మనందరికీ తెలిసిందని, మన జీవితాంతం చెట్లు ప్రాణవాయువు ఆక్సిజన్ ను ఉచితంగా అందిస్తాయని అన్నారు.ప్లాస్టిక్ పర్యావరణానికి హానికరం అని ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలి అని కోరారు.
మేయర్ గుండు సుధారాణి మాట్లాడుతూ పచ్చని చెట్లు- ప్రగతికి మెట్లని, అలాంటి జీవకోటికి ప్రాణవాయువు ను అందించే చెట్లను కాపాడుకోవడం మనందరి బాధ్యత అని అన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన తరువాత ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పథకం తెలంగాణకు హరితహారం. అందులో భాగంగా ఈ రోజు దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని హరిత దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నామన్నారు. భవిష్యత్తు తరాలకు నివాస యోగ్యమైన పర్యావరణాన్ని అందించేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని అన్నారు. హరితహారంలో విరివిగా మొక్కలు నాటేందుకు ప్రణాళికలు సిద్ధం చేయడం జరిగిందని, అందుకు అవసరమైన మొక్కలు నర్సరీలలో సిద్ధంగా ఉన్నాయన్నారు. ప్రతి గ్రామంలో, మున్సిపాలిటీలో నర్సరీలను ఏర్పాటు చేశామని, హరితహారం కింద నాటిన మొక్కలను సంరక్షించే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు.
జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు ఆధ్వర్యంలో హరితహారం 8 సార్లు నిర్వహించడం జరిగిందన్నారు. ప్రస్తుతం 9వ విడత హరితహారం కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రజలు అందరూ కలిసి మొక్కలు నాటాలన్నారు. రోడ్లకు ఇరుప్రకాల మొక్కలు నాటడం వాటికి రోజు నీరు పట్టించి సంరక్షించాలన్నారు.
ఈ సమావేశం లో కుడా చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్, కమీషనర్ రిజ్వాన్ బాషా, డిఎఫ్ఓ వసంత, డిఆర్డిఏ పీడీ శ్రీనివాస్ కుమార్, అటవీ శాఖ అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు
Post A Comment: