మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
ఎన్టిపిసి అన్నపూర్ణ కాలనీ దుర్గయ్య పల్లి స్కూల్ వినాయక మెడికల్ షాపు వద్ద మంచి కట్ల ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. త్రిశూల్ యూత్ వారి సహకారంతో ఏర్పాటు చేసిన వైద్య శిబిరం ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంచి కట్ల దయాకర్ 26వ డివిజన్ కార్పొరేటర్ పాల్గొని వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరీంనగర్ వన్ హాస్పిటల్ ఆధ్వర్యంలో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు ఈ వైద్య శిబిరంలో 500 మంది పేదలకు ఉచితంగా బిపి షుగర్ ఈసీజీ వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు, సర్టిఫికెట్లను పంపిణీ చేశారు. ఇలాగే భవిష్యత్తులో కూడా పేదలకు ఉచితంగా వైద్య శిబిరం ద్వారా వైద్య పరీక్షలు మరియు మందులు పంపిణీ చేయడం జరుగుతుందని ఈ అవకాశాల్ని ప్రజలందరూ సద్వినిగం చేసుకోగలరని కోరారు. ఈ కార్యక్రమంలో త్రిశూల్ యూత్ ప్రెసిడెంట్ పల్లికొండ నాగరాజు వైస్ ప్రెసిడెంట్ మేడి మహేష్ నవీన్ కుమార్ నాగరాజు సందీప్ దుర్గాప్రసాద్, వినాయక మెడికల్ షాపు డాక్టర్ రమేష్, బిక్షపతి తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: