మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
బీఎస్పీ పార్టీ రామగుండం నియోజకవర్గ కమిటీ ఏకగ్రీవ నియామకం.
స్థానిక గోదావరిఖని " బీఎస్పీ పార్టీ కార్యాలయంలో బీఎస్పీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ ఆదేశాల మేరకు పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు గొట్టె రాజు ఆధ్వర్యంలో బీఎస్పీ పార్టీ రామగుండం నియోజకవర్గ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. బీఎస్పీ పార్టీ రామగుండం నియోజకవర్గ ఇంచార్జ్ గా గోలివాడ ప్రసన్న కుమార్ బెస్త, మరొక ఇంచార్జ్ గా జినుక ఉదయ్, నియోజకవర్గ అధ్యక్షునిగా సీనియర్ నాయకులు కాసిపేట స్వామి, ఉపాధ్యక్షులుగా కుర్మ శ్రీధర్, ప్రధాన కార్యదర్శిగా మారపెల్లి రవికుమార్, జిల్లా ఈసీ మెంబర్ గా ఈదునూరి ధర్మరాజు, కార్యదర్శిగా మున్నా భాయ్, లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఇరికిల్లా రాజనర్సయ్య, నాయకులు జనగామ మల్లేష్, సిరికొండ రవి, గడ్డం శంకర్, శ్రావణ్, రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: