మహాదేవపూర్ మండల ప్రతినిధి/దూది శ్రీనివాస్
మహాదేవపూర్: మండల కేంద్రంలో ఈరోజు ప్రియతమ నాయకులు ఏఐసీసీ కార్యదర్శి, మంథని శాసనసభ్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు, మాజీ ప్రధాని,మాజీ ఏఐసీసీ అధ్యక్షులు స్వర్గీయ పీవీ నరసింహారావు జయంతిని పురస్కరించుకొని, మహాదేవపూర్ మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పీవీ నరసింహారావు చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బ్లాక్ కాంగ్రేస్ అధ్యక్షులు కోట రాజబాపు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అక్బర్ ఖాన్ మాట్లాడుతూ, మంథని నియోజకవర్గానికి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా, దేశ ప్రధాన మంత్రిగా పదవులు చేపట్టారు. ఈ ప్రాంతానికి ఎనలేని సేవలు అందించడం జరిగిందని, దేశ ప్రధానిగా వారు తీసుకొచ్చినటువంటి ఆర్థిక సంస్కరణలు ఈ దేశాన్ని ప్రగతి పథంలో నడిపించాయని, ప్రపంచ దేశాలు ఆర్థిక మాధ్యంలో కొట్టుమిట్టాడుతుంటే, భారతదేశం బలంగా నిలబడడానికి కారణం ఆయన తీసుకున్నటువంటి సంస్కరణలని వారు కొనియాడారు, 13 భాషలు మాట్లాడగల బహుభాషా కోవిదులని తెలిపారు. ఎమ్మెల్యే శ్రీధర్ బాబు నాయకత్వంలో వారి ఆశయ సాధనకు కృషి చేస్తామని అన్నారు.
ఈ కార్యక్రమంలో జెడ్పిటీసీ గుడాల అరుణ శ్రీనివాస్, మైనారిటీ సెల్ అధ్యక్షులు అస్రార్ ఖురేషి, కాంగ్రేస్ సీనీయర్ నాయకులు కోట సమ్మయ్య, రాంమోహన్, ఎన్ ఎస్ యు ఐ అధ్యక్షులు రంజిత్, మహిళ కాంగ్రేస్ నాయకురాలు జనని, యూత్ కాంగ్రేస్ నాయకులు క్రిష్ణ మోహన్, ముఖీధ్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: