మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
బహుజన సమాజ్ పార్టీ నాయకులు వేమునూరులో గ్రామంలో గ్రామ పెద్దలు సీనియర్ నాయకులతో గ్రామ సభ నిర్వహించడం జరిగినది,
ఈ సభ ముఖ్య ఉద్దేశ్యం నేటి అధికార పార్టీలు రైతుల పట్లా నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు లేక సామాన్య ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు నేటి అధికార ప్రతినిధులు వారి వారి స్వంత ప్రలోభాలతో రాజకీయాల్లోకి వచ్చి ప్రజల ఆర్థిక పరిస్థితిని ఆసరాగా చేసుకుని డబ్బు ఆశ కల్పించి ఓట్లను కొని గద్దె పైన కూర్చోని 5 సంవత్సరాల కాలంలో ఏనాడూ రైతులను, నిరుద్యోగులను పట్టించుకోకుండా ఇంతవరకు కాలయాపన చేస్తూ రామగుండం నియోజకవర్గంలో అన్ని రకాల సమస్యల వలయంగా సృష్టించి అధికార పార్టీలు లీడర్స్ ఎవరికి వారే లాభ పడినారు, ఇదేవిధంగా నేడు తెలంగాణ రాష్ట్రం మొత్తం ఇలాంటి పరిస్థితుల్లోనే ఉంది? కావున తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ రానున్న ఎన్నికల్లో అనుక్షణం పేద ప్రజలకు రైతులకు, విద్యార్థులకు, నిరుద్యోగుల కోసం పాటు పడుతూ.. తన ఐ పి ఎస్ ఉద్యోగాన్ని త్రునప్రాయంగా వదులుకుని బహుజన రాజ్యాధికారం కోసం పాటు పడుతున్నా డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
బహుజన సమాజ్ పార్టీని బలోపేతం చేయాలి ఏనుగు గుర్తుకు ఓటు వేయాలని గ్రామ పెద్దలకు తెలియ పరుస్తూ అవగాహన కల్పించారు
ఈ కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా జనరల్ సెక్రెటరీ ఇరికిల్ల రాజనర్సయ్య ఈదునూరి ధర్మరాజు పెద్దపెల్లి జిల్లా ఈసీ మెంబర్ మరియు రామగుండం అసెంబ్లీ ఇంచార్జ్ జింక ఉదయ్ పాలకుర్తి మండల్ అధ్యక్షులు ఈదునూరి శ్యామ్ మాజీ ఉపసర్పంచ్ ముల్కల లక్ష్మణ్ ముల్కల నారాయణ చిలుక శ్రీను గుల్కాల సతీష్ తదితరులు పాల్గొన్నారు
Post A Comment: