ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ 



హన్మకొండ ;

మహిళలతోనే మార్పు సాధ్యమని జిల్లా సంక్షేమ అధికారి కే మధురిమ అన్నారు. అంతర్జాతీయ మాదకద్రవ్యాల దుర్వినియోగం, మరియు అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా సోమవారం రోజున జిల్లా కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో మాట్లాడుతూ

సమాజం ప్రగతి బాటన పరుగులు తీయాలంటే మహిళలు పూనుకోవాలని, కుటుంబ వ్యవస్థలో తల్లితండ్రుల పాత్ర ప్రధానమని వారి పిల్లలకు నైతిక విలువలను చిన్ననాటి నుండే అలవర్చాలని అన్నారు. యాంత్రిక జీవితంతో తలమునుకలై పిల్లలు ఏం చేస్తున్నారో తెలుసుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు స్నేహితుల ప్రభావం, సోషల్ మీడియా ప్రభావంతో యువత మత్తు పదార్థాలకు బానిసలై భవిష్యత్తు జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారని, కుటుంబ వ్యవస్థలో నైతికత దిగజారకుండా చూసుకున్నప్పుడు ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కావని అన్నారు.

జిల్లా వైద్యాధికారి డాక్టర్ బి సాంబశివరావు మాట్లాడుతూ యువత సత్తువనంత కబళించి వేస్తున్న ప్రధాన సమస్యల్లో గంజాయి, కొకైన్, హెరాయిన్ లాంటి పదార్థాలు తీసుకోవడం ద్వారా మల్టిపుల్ సైకాలజికల్ డిజార్డర్స్ గా మారుతున్నారని అన్నారు. యువత తలుచుకుంటే సాధించేది లేదని యువత సన్మార్గంలో నడిచి దేశానికి ఆయువుపట్టుల నిలవాలని ఆకాంక్షించారు.

చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు కజాంపురం దామోదర్ మాట్లాడుతూ సినిమాల ప్రభావం, సోషల్ మీడియా ప్రభావం నేడు గ్రామీణ ప్రాంతాలకు వ్యాపించిందని తద్వారా యువత పెడదారి లో నడిచి భవిష్యత్ జీవితాన్ని నిర్వీర్యం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు, ముఖ్యంగా మధ్యతరగతి ఎగువన ఉన్నవారు వారి వారి జీవన పోరాటంలో తలమునుకలై వారి పిల్లల విషయంలో దృష్టి సారించకపోవడంతో ఈ అమానవీయ సంఘటనలు చోటు చేసుకుంటున్నాయని అన్నారు.

ఇన్స్పెక్టర్ సుజాత మాట్లాడుతూ గంజాయి మాదకద్రవ్యాల వినియోగం విషయంలో టార్గెట్ గ్రూపు, టార్గెట్ ఏరియాల పై దృష్టి సారించి సంబంధిత వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

సైకియాట్రిస్ట్ డాక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ అన్ని రకాల వ్యాధులకు ప్రధాన కారణం పొగాకు అని, పొగాకు, గంజాయి, మరియు రక రకాల మత్తు పదార్థాల వినియోగించుకొని తద్వారా భవిష్యత్ జీవితం నాశనం చేసుకుంటున్నారని అన్నారు.

కార్యక్రమంలో జిల్లా విద్యా శాఖ అధికారి అబ్దుల్ హై, 

డీసీపీవో పి సంతోష్ కుమార్, ఎఫ్ ఆర్ వో రవి కృష్ణ, సీనియర్ సహాయకులు వి వెంకట్ రామ్, హెల్పింగ్ హ్యాండ్ డైరెక్టర్ రాము తదితరులు పాల్గొన్నారు.

తొలుత ఉదయం అదాలత్ సర్కిల్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించి అవగాహన కల్పించారు సెంట్రల్ జోన్ డీసీపీ ఎంఎ బారి, స్థానిక కార్పొరేటర్ వసంత, హనుమకొండ కాజీపేట 

ఏసీపి లు కిరణ్ కుమార్, శ్రీనివాస్ లు మరియు అదనపు డిప్యూటీ 

డీఎంహెచ్వో లు డాక్టర్ మదన్ మోహన్ రావు, యాకూబ్ పాషా, డెమో వి అశోక్ రెడ్డి, సీడీపీవో భాగ్యలక్ష్మి , ఐసిడిఎస్ సూపర్వైజర్లు, అంగన్వాడి టీచర్లు, అషా వర్కర్లు, మెప్మా ఆర్పీలు ర్యాలీ లో పాల్గొని మాదక ద్రవ్యాల దుర్వినియోగంపై ప్ల కార్డులు చేతబూని నినాదాలు చేశారు.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: