మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
ఏ ఒక్కరూ అధైర్య పడొద్దు గాయపడ్డ వారి కుటుంబ సభ్యులకు ధైర్యం కల్పించిన రాజ్ ఠాగూర్*క్షతగాత్రులకు నా సొంత డబ్బులతో నాణ్యమైన వైద్యం చేపిస్తానని హామీ, మక్కన్ సింగ్ రాజ్ ఠాగూర్
*క్షతగాత్రులకు నాణ్యమైన వైద్యం అందించాలని ప్రధాన వైద్యులతో మాట్లాడిన రాజ్ ఠాగూర్ ప్రైవేటు బస్సు బోల్తా పడి పెద్ద సంఖ్యలో ప్రయాణికులు గాయపడిన ఘటన పెద్దపెల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి వద్ద చోటుచేసుకుంది...
పెద్దపల్లి జిల్లా రామగుండంకు చెందిన ముస్లిం కుటుంబం బంధువులతో కలిసి హైదరాబాద్ లో పెళ్ళికి వెళ్లి రామగుండం తిరిగి వచ్చే క్రమంలో కాట్నపల్లి వద్ద అదుపుతప్పి డివైడర్ను ఢీ కొట్టి బోల్తా పడింది....
ఈ ప్రమాదంలో 40 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు. పలువురి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది....
ఈ విషయం తెలుసుకున్న వెంటనే హుటాహుటిన *డిసిసి అధ్యక్షులు మక్కన సింగ్ రాజ్ ఠాగూర్ సంఘటన స్థలానికి చేరుకొని అక్కడినుంచి క్షతగాత్రులను గాయాలపాలైన వారిని కరీంనగర్ లోని గవర్నమెంట్ సివిల్ హాస్పిటల్ కు మరియు సీరియస్ గా ఉన్న వారిని గుడ్ లైఫ్ ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించి వారికి నాణ్యమైన వైద్యం అందించాలని ఇటు ప్రభుత్వ ప్రధాన వైద్య అధికారులతో మాట్లాడి అలాగే సీరియస్ గా ఉన్న వారిని గుడ్ లైఫ్ ప్రైవేటు హాస్పటల్లో చేర్పించిన అనంతరం హాస్పిటల్ వైద్యులతో నాణ్యమైన వైద్యం అందించాలని అవసరమైతే వైద్యానికి అయ్యే ఖర్చు నేను భరిస్తానని ఇంకా ఎవరైనా సీరియస్ గా ఉంటే అవసరమైతే హైదరాబాద్ కు తరలించి ఉన్నత వైద్య సదుపాయం అందిస్తానని గాయపడ్డ వారి బంధువులు సన్నిహితులు ఎవరు బాధపడవద్దని పూర్తిస్థాయిలో వారికి నా వంతు బాధ్యతగా సహాయ సహకారాలు అందిస్తానని వారికి పూర్తి అండగా ఉంటానని ఎవరు అధైర్యపడవద్దని వారికి ధైర్యం చెప్పి భరోసా కల్పించడం జరిగినది.వారి వెంట కరీంనగర్ నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నరేందర్ రెడ్డి , కాంగ్రెస్ పార్టీ 41డివిజన్ ప్రెసిడెంట్ ఫజల్ ,యూత్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ నజీమ్ , రామగుండం మైనారిటీ ప్రెసిడెంట్ గౌస్ బాబా శంకర్ తదితరులు పాల్గొన్నారు
Post A Comment: