మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
దేశంలో ఏ రాష్ట్రంలో అమలు చేయని సంక్షేమ పథకాలు ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో అమలు చేస్తూ.. దేశ ప్రజల అభిమానాన్ని సంపాదించుకొని.. ఆయన పాలనను స్వాగతిస్తున్నారని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. రామగుండం కార్పొరేషన్ పరిధిలోని రామగుండ పట్టణంలో ఏర్పాటుచేసిన ఆత్మీయ సమ్మేళనానికి ఎమ్మెల్యే చందర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కు పట్టణ ప్రజలు కోలాట బృందంతో ర్యాలీతో ఘనంగా స్వాగతం పలికారు. స్థానిక మజీద్ కార్నర్ లోని అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే చందర్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే చందర్ మాట్లాడారు. సమాఖ్య పాలనలో కాంగ్రెస్ 70 ఏళ్లుగా పాలించిందని, తెలంగాణను అభివృద్ధికి సంక్షేమానికి దూరం పెట్టిందన్నారు. గతంలో పెన్షన్ రూ.200లు కంటితుడుపు చర్యగా అందించారని అన్నారు. గత ప్రభుత్వంలో నిరుపేద వర్గాల ప్రజలు ఎలాంటి సంక్షేమం లేకుండా అభివృద్ధి లేకుండా జీవనం సాగించారని ఆవేదన వ్యక్తం చేశారు. బిపిఎల్ పవర్ ప్లాంట్ ప్రాజెక్టును కూలదోసి ప్రజలను రోడ్డు మీద పడేసిన ఘన చరిత్ర కాంగ్రెస్ కాదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ శాప్ చైర్మన్గా కొనసాగిన మక్కాన్సింగ్ రామగుండం నియోజకవర్గం ఏం ఒరగబెట్టారని ప్రశ్నించారు. అభివృద్ధి నోచుకోలేక తెలంగాణ ప్రజలు తల్లడిల్లుతున్న క్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ బిఆర్ఎస్ పార్టీ స్థాపించి.. అన్ని వర్గాల పోరాటాలతో ఉద్యమంతో తెలంగాణను సాధించుకున్నామని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ సారధ్యంలో భారతదేశంలో ఏ రాష్ట్రంలో అమలు చేయని సంక్షేమ పథకాలు తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్నాయని అన్నారు. వృద్ధులకు వితంతువులకు రూ.2,016లు, వికలాంగులకు రూ.3016లు అందిస్తూ ఆర్థిక భరోసాగా నిలిచారని అన్నారు. నిరుపేద యువతుల పెళ్లిళ్లు ఆర్థిక భారం కాకూడదనే ఉద్దేశంతో కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ పేరిట రూ 100116లు అందిస్తూ ఇంటి పెద్దన్నగా కెసిఆర్ నిలిచారని అన్నారు. అంతేకాకుండా రైతే రాజుగా భావిస్తున్న భారతదేశంలో రైతుకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా రైతుబంధు, రైతుబీమా లాంటి పథకాలను అమలు చేస్తూ, కాలేశ్వరం ప్రాజెక్టుతో తెలంగాణ బీడు భూములన్ని పంటపొలాలుగా సస్యశ్యామలంగా వర్ధిల్లుతున్నాయని సంతోషం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో ఇల్లు కట్టుకోవడానికి రూ.50 వేల ఆర్థిక సాయం అందించే వారని, సీఎం కేసీఆర్ మహిళల పేరిట గృహలక్ష్మి పథకం కింద రూ.3 లక్షల అందించడం జరుగుతుందని అన్నారు. సీఎం కేసీఆర్ పేద ప్రజల శ్రేయోభిలాషి అన్నారు. గత ఎన్నికల్లో నాపై నమ్మకం ఉంది నన్ను గెలిపించిన ప్రజానీక సంక్షేమం కోసం తరతరాలుగా గుర్తిండిపోయే విధంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్టు ఎమ్మెల్యే తెలిపారు. ఈ క్రమంలోనే నిరుపేద ప్రజల ఆరోగ్యం కోసం మెడికల్ కళాశాలను ముఖ్యమంత్రి కేసీఆర్ ను మెప్పించి ఒప్పించి తీసుకువచ్చానని, ఈ కళాశాలలో ఉచితంగా కార్పొరేట్ వైద్యంతోపాటు వైద్య పరీక్షలు, మందులను పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. అంతేకాకుండా స్థానిక యువత ఉపాధి కోసం ఐటీ పార్క్ ఇండస్ట్రియల్ పార్కులని సైతం ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. వాహన దారుల కోసం సౌకర్యవంతమైన రోడ్లను ఏర్పాటు చేశామన్నారు. అంతేకాకుండా రిజిస్ట్రేషన్ ల కోసం జిల్లాకు ప్రజలు తరలి వెళ్లకుండా.. రామగుండం లోనే సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. గత పాలకులు చేయలేని అభివృద్ధిని నాలుగున్నర ఏండ్ల కాలంలో చేసి చూపించానని అన్నారు. అంతేకాకుండా ప్రభుత్వ ఆక్రమిత భూముల్లో ఉన్నటువంటి నిరుపేదలకు పట్టాలిప్పించడానికి చర్యలు తీసుకుంటున్నట్టు ఎమ్మెల్యేతెలిపారు. వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాల కోసం ప్రజల్లోకి వచ్చి ప్రచారాలు చేయబడుతున్న నాయకులను తిప్పి కొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. ఎన్నికలు వస్తేనే తప్ప ప్రజల సమస్యలు పట్టించుకోని, ప్రజల్లో తిరగని నాయకులు రాజకీయాలకు పనికిరారని ఆయన అన్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం తప్పని విధంగా కార్యక్రమాలు రూపొందించుకొని ముందుకు సాగుతానని ఎమ్మెల్యే అన్నారు. గొప్ప ఆలోచనలతో గొప్ప పథకాలతో ఉన్నతమైన మార్గదర్శకం తో తెలంగాణ ప్రభుత్వం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో భారతదేశంలోని అగ్రగామిగా నిలిచిన ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఓటేసి ఆయన రుణం తీర్చుకోవాలని, హ్యాట్రిక్ సీఎంగా గెలిపించుకోవాలని ఎమ్మెల్యే చందర్ పిలుపునిచ్చారు. రామగుండం పట్టణ ఇన్చార్జి బొడ్డుపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ నడిపెల్లి అభిషేక్ రావు, కార్పొరేటర్లు కన్నూరి సతీష్ కుమార్, అమ్రిన్ ఫాతిమా - సలీం బేగ్, దొంత శ్రీనివాస్, కొమ్ము వేణుగోపాల్, దాతు శ్రీనివాస్, బాల రాజ్ కుమార్, జనగామ కవితా సరోజిని, కల్వచర్ల కృష్ణవేణి, నాయకులుశివరాత్రి గంగాధర్, కలవల శీను, నిమ్మని సంతోష్, పల్లికొండ నరేష్, దాముఖ వంశీ, బద్రి రజిత రాజేందర్, ఆశాది వేణుగోపాల్, డాక్టర్ ముస్తఫా, డాక్టర్ దుర్గం రాజ్, పెరిక శంకర్, దండుగుల శ్రీను, మంథని శ్రీను, గోమ్మురాజుల శీను, ఎగ్గే నరేష్, మాచర్ల నరేష్, వడ్డేపల్లి రమేష్, కలువల భాను, ఆరుముల్లా కనకపాల్, కలవల మహేందర్, దాముఖ సదన్, దాముఖ అనిల్, వినయ్, మెండే వంశీ, వేల్పుల అంజి, చిలుముల అన్వేష్, అటహారుద్దీన్, తోడేటి శంకర్ గౌడ్, పర్లపల్లి రవి, మెతుకు దేవరాజ్, అడ్డాల రామస్వామి, కల్వల సంజీవ్, కాల్వ శ్రీనివాస్, వేగొలపు శ్రీనివాస్, బొడ్డు రవీందర్, రాకం వేణు, జేవి రాజు, తిరుపతి నాయక్, దీటి బాలరాజు, మాదాసు రామ్మూర్తి, అల్లి గణేష్, దాసరి ఆనంద్, గోవర్ధన్, మేకల అబ్బాస్, ఇరుగురాల శ్రావణ్, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: