ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు ఈవీఎంల ఫస్ట్ లెవల్ చెకప్ సక్ర మంగా జరగాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులకు సూచించారు. ఆదివారం
ఏనుమాముల మార్కెట్ ఈవీఎం గోడౌ న్లో ఫస్ట్ లెవల్ చెకప్ కార్యక్రమం నిర్వహిం చారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, వివిధ రాజకీయ పార్టీల నాయకుల సమక్షంలో గోడౌన్ తెరిచి, ఎఫ్ఎల్సీ చేపట్టినట్లు వెల్లడిం చారు. జిల్లాలో జరుగుతున్న మొదటి స్థాయి తనిఖీని పరిశీలించేందుకు ఇంజినీర్ల బృందం జిల్లాకు వచ్చి నట్లు తెలిపారు. వీరి సమక్షంలో ప్రతి ఈవీ ఎం మాక్ పోలింగ్ నిర్వహిస్తార న్నారు. మాక్ పోలింగ్ సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా వెంటనే సమాచారమి వ్వాలని అధికారులను ఆదేశించారు. వారం రోజుల పాటు తనిఖీప్రక్రియనిర్వహించనున్నాయని తెలిపారు.
ఈ కార్యక్రమం లో అదనపు కలెక్టర్ సంధ్య రాణి, రాజకీయ పార్టీ ప్రతినిధులు, ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు.
రాజకీయ పార్టీ ప్రతినిధులు
ఈవి శ్రీనివాసరావు ఐఎన్సి
డాక్టర్ ఇండ్ల నాగేశ్వర్ రావు బిఆరెస్ బిల్లా రమణ రెడ్డి
కుసుమ శ్యామ్ సుందర్ టీడీపీ N. రజనీకాంత్, వైఎస్సార్ సిపి సయ్యద్ షబ్బీర్ ఎంఐఎం బంకా సంపత్
మొహమ్మద్ నెహాల్ తదితరులు పాల్గొన్నారు .
Post A Comment: