మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
అంతర్గాం మండలం మురుమూరు గ్రామంలో పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎమ్మెస్ రాజ్ ఠాగూర్ గారి ఆదేశాలతో కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి అధ్యక్షులు హనుమాన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన పాత్రికేయ సమావేశంలో హాజరైన మాజీ ఎంపీపీ ఉరిమెట్ల రాజలింగం మాట్లాడుతూ ఎల్లంపల్లి భూనిర్వాసితులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇవ్వకుండా అన్యాయం చేస్తూ దశాబ్ది ఉత్సవాల పేరుతో మాటలకే పరిమితం అవుతూ చేతల్లో ఏ ఒక్క అభివృద్ధి పని చేయకుండా మురుమూరు గ్రామానికి దశాబ్ది ఉత్సవాల పేరుతో వచ్చిన శాసనసభ్యుల్ని ప్రజలు నిలదీస్తే ప్రశ్నించే గొంతుకులను అణిచివేస్తూ అహంకార పూరిత మాటలు అనడం సబబు కాదని అధికారం శాశ్వతం కాదని రాబోయే రోజుల్లో ప్రజలే బుద్ధి చెప్తారని హెచ్చరించారు*ఈ పాత్రికేయ సమావేశంలో హాజరైన కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు పెండ్యాల మహేష్ మాట్లాడుతూ స్వరాష్ట్రంలో ఏ ఒక్క ఆకాంక్ష నెరవేర్చకుండా మళ్లీ అధికారమే లక్ష్యంగా కల్లబొల్లి మాటలతో దశాబ్ది ఉత్సవాల పేరుతో ప్రజల సొమ్మును దుర్వినియోగం చేస్తూ నిన్న మొరుమూరు గ్రామానికి వచ్చిన స్థానిక శాసనసభ్యులు చందర్ ని ప్రజలు నిలదీస్తే సమాధానం చెప్పకుండా అసహనానికి లోనై బెదిరింపు చర్యలు చేయడం సరికాదని ఆర్ ఎఫ్ సి ఎల్ ఉద్యోగ బాధితులకు న్యాయం చేస్తానని అఖిలపక్షం పేరుతో కాలయాపన చేసి మళ్లీ ఇప్పుడు చేతులెత్తేయడం నీ చిత్తశుద్ధికి నిదర్శనమని ఇప్పటికైనా బాధితులకు బాసటగా నిలవాల్సిన బాధ్యత నీపై ఉందని లేనిపక్షంలో ప్రజాక్షేత్రంలో రాబోయే రోజుల్లో ప్రజలే బుద్ధి చెబుతారని అన్నారు మళ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీసీ బిడ్డలను మోసం చేయడానికి గొర్రెలు బర్రెలు లోన్ లో పేరుతో మరోసారి కొత్త నాటకానికి తెర లేపుతున్న అధికార పార్టీకి ప్రజలే బుద్ధి చెప్పడం ఖాయమని హెచ్చరించారు*ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు పెండ్యాల మహేష్ మాజీ ఎంపీపీ రాజలింగం తో పాటు ఇన్చార్జ్ మండల అధ్యక్షులు హనుమాన్ రెడ్డి మాజీ సర్పంచ్ గుంట బాబు మడ్డి తిరుపతి గౌడ్ బరుపాటి శ్రీనివాస్ ఎనగందుల శ్రీకాంత్ గొర్రె చందు సంఘన వేణు శేఖర్ రమేష్ గౌడ్ ఎలుగంటి లింగన్న సురేష్ రాజనర్సు జూపాక నారాయణ మిడిగొండ లింగన్న పన్నాల తిరుపతి ఊరేటి మహేష్ శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు
Post A Comment: