మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
లయన్స్ క్లబ్ ఆఫ్ రామగుండం మగువ ఆధ్వర్యంలో మాధక ద్రవ్యల నిర్ములన దినోత్సవం సందర్బంగా స్థానిక గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ లో అవగాహనా సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్య అతిధిగా ఎక్స్చేంజి సీఐ రమేష్ హాజరైనారు ఈసందర్బంగా మగువ ప్రెసిడెంట్ సోమారపు లావణ్య , మగువ సెక్రటరీ డాక్టర్. లక్ష్మి వాణి మాట్లాడుతూ
మాదక ద్రవ్యాల వాడకం ఒక ప్రమాదమైన వ్యసనము (Addiction). ఈనాటి యువతరాన్ని దారి మళ్ళించి చెడు మార్గాల్లో నడిపిస్తున్న దురలవాట్లలో మాదక ద్రవ్యాల వినియోగం తీవ్రమైనది. ధూమపానం, మద్యపానం వంటి వ్యసనాల కన్నా తీవ్రమైన ప్రభావకాలు. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి సంవత్సరం 5.6 శాతం జనాభా అనగా 185 మిలియన్ల మంది ఇలా మాదక ద్రవ్యాలు వినియోగిస్తున్నట్లు అంచనాలు తెలుపుతున్నాయి వీటికి అలవాటు పడిన విద్యార్థులు, యువకులు చదువులు వదిలి సర్వస్వం కోల్పోయి నిర్భాగ్యులౌతున్నారు. ఒకసారి దీనికి బానిసలైన తర్వాత వీనిని సంపాదించడానికి ఎంతటి అకృత్యాలు, నేరాలు చేయడానికి వెనుకాడరు మాదక ద్రవ్యాల నిరోధానికి భారత ప్రభుత్వం నార్కోటిక్స్, డ్రగ్స్ అండ్ సైకోట్రాపిక్ సబ్స్టెన్సస్ చట్టాన్ని చేసింది. ఈ మత్తు మందులు పండించేవారు, వ్యాపారం చేసేవారు, కలిగివున్నవారు చట్టపరంగా కఠినంగా శిక్షార్హులు ఇలాంటి వ్యసనపరుల్ని మళ్ళీ మామూలు మనుషుల్ని చేయడం చాల కష్టమైన పని. వీరిని డ్రగ్ అడిక్షన్ కేంద్రాలు, మానసిక వైద్యుల ద్వారా చికిత్స చేసి కాపాడవచ్చును రామగుండం నియోజకవర్గం లో కూడా డ్రగ్ అడిక్షన్ కేంద్రాలు ఏర్పాటు చేసి వారికి కౌన్సిలింగ్ ఇవ్వాలి అని పేర్కొన్నారు ఈకార్యక్రమంలో డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్, మగువ డైరెక్టర్ సునీత, గాంధీ , కాలేజీ స్థాఫ్,స్టూడెంట్స్ తదితరులు పాల్గొన్నారు..
Post A Comment: