మహాదేవపూర్ మండల ప్రతినిధి/దూది శ్రీనివాస్
మహాదేవపూర్ మండలం:- మండల కేంద్రంలో తెలంగాణ దశాబ్ది ఉత్సవాల పేరుతో బిఆర్ఎస్ పార్టీ, ప్రభుత్వ నిధులు వెచ్చిస్తూ, పార్టీ ప్రచార కార్యక్రమాలు చేపడుతున్నందున, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పిలుపుమేరకు, బిఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను ఖండిస్తూ, ఏఐసీసీ కార్యదర్శి, మంథని ఎమ్మెల్యే దుద్దిల్ల శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు, దశాబ్ది దగా పేరుతో, మండల పార్టీ అధ్యక్షులు అక్బర్ ఖాన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టి కెసిఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. దశాబ్ది ఉత్సవాల పేరుతో బిఆర్ఎస్ ప్రభుత్వం నిధుల దుర్వినియోగం చేస్తూ ఏం సాధించారని ఉత్సవాలు జరుపుతున్నారు, నీళ్లు నిధులు నియామకాల నినాదంతో ఏర్పడిన ఈ తెలంగాణ రాష్ట్రంలో, ఇప్పటివరకు ఏ పనులు కూడా అమలుకు నోచుకోలేదని, ఏ రంగాల్లో కూడా ఇంతవరకు ఏమాత్రం అభివృద్ధి చెందకుండా
ప్రజలందరిని మోసం చేస్తూ, మరోసారి గద్దెనెక్కెందుకు దశాబ్ది ఉత్సవాల పేరుతో హంగామా ఆర్భాటాలు చేస్తున్నారని, మీరు ఎన్ని చేసినా తెలంగాణ ప్రజలు ఇక మిమ్మల్ని నమ్మే పరిస్థితిలో లేరని... 2014, 2018 మేనిఫెస్టోలో ప్రవేశపెట్టిన హామీలు ఏ ఒక్కటి కూడా అమలుకు నోచుకోలేదని,
కేజీ నుంచి పీజీ ఉచిత నిర్బంధ విద్య, ఫీజ్ రీయంబర్స్ మెంట్,
ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి, పేదలకు డబుల్ బెడ్రుం ఇళ్లు,
దళిత కుటుంబాలకు మూడు ఎకరాల భూమి, పోడు భూములకు పట్టాలు,
రైతులకు రుణ మాఫీ,
12 శాతం ముస్లిం రిజర్వేషన్లు,12 శాతం గిరిజన రిజర్వేషన్లు కల్పించాలనీ కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రేస్ నాయకులు, సీనీయర్ కాంగ్రేస్ నాయకులు, యూత్ కాంగ్రేస్ నాయకులు, మహిళ కాంగ్రేస్ నాయకురాళ్లు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కాంగ్రేస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Post A Comment: