ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ 





హన్మకొండ ;

రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకల్లో భాగంగా బుధ‌వారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆలయాల్లో ఆధ్యాత్మిక దినోత్స‌వాన్ని ఘనంగా నిర్వహించారు. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆధ్యాత్మిక దినోత్స‌వ వేడుకల్లో మండలి  డిప్యూటీ చైర్మన్  బండ  ప్రకాష్ ,రాష్ట్ర ప్రభుత్వ చీఫ్  వినయ్ భాస్కర్ పాల్గొన్నారు. వేయి స్తంబాల దేవాలయం లో వారికి తోలుత ఆలయ అర్చకులు  పూర్ణ కుంభం తో స్వాగతం పలికారు. ఆలయం లో ప్రత్యేకంగా పూజలు  చేశారు.24 మంది అర్చకులకు ధూప దీపనైవేద్య నియామక పత్రాలను అందజేశారు.

ఈ  సందర్బంగా మండలి  డిప్యూటీ చైర్మన్ మాట్లాడుతూ తెలంగాణ రాకముందు తెలంగాణ వచ్చిన తర్వాత పరిస్థితులు ఎలా ఉన్నాయో మనమందరం చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి తొమ్మిది సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా దశాబ్ది ఉత్సవాలను నిర్వహిస్తుంది.

ఆధ్యాత్మిక చింతన క‌లిగిన‌  ముఖ్య‌మంత్రి కే.చంద్ర‌శేఖ‌ర్ రావు గారి నాయ‌క‌త్వంలో తెలంగాణ ప్ర‌భుత్వం ఈ ప్రాంత సాంప్ర‌దాయ‌ల‌కు ఆల‌యాల‌కు , పండుగ‌ల‌కు, వేడుక‌ల‌కు అత్యంత ప్రాధ‌న్య‌త క‌ల్పించ‌డంతో ఆధ్మాత్మిక వైభ‌వం ఉట్టిప‌డుతుంది. స్వ‌రాష్ట్రం ఏర్ప‌డిన త‌ర్వాత మ‌న పండుగ‌ల‌కు, వేడుక‌ల‌కు ప్ర‌పంచ ఖ్యాతి ల‌భించింది. స్వ‌పరిపాల‌న‌లో తెలంగాణ స్వంత‌ ఆస్థిత్వంతో కూడిన ఆధ్యాత్మిక శోభ‌ను సంత‌రించుకుంది.




రాష్ట్ర ప్రభుత్వ చీఫ్  విప్ వినయ్ భాస్కర్ మాట్లాడుతూఆధ్యాత్మిక భావాలను పెంపొందించడంతో సమాజంలో  శాంతి సామరస్యాలు నెలకొంటాయి. ఈ  క్రమంలో ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు అభివృద్ధి సంక్షేమ పథకాలతో పాటు ఆధ్యాత్మిక అభివృద్ధికి అధిక ప్రాధాన్యతనిస్తున్నారు. అన్ని మతాలను సమానంగా గౌరవిస్తున్నారు.ధూప దీప నైవేద్య పథకం ద్వారా అర్చకుల వేతనాలను రూ.6,000 నుంచి రూ.10,000 లకు పెంచుతామ‌ని సీయం కేసీఆర్ నిర్ణయించారు అని తెలిపారు .  ఇలా ఆధ్యాత్మికంగా  ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నాము.

ప్రభుత్వ సంగీత ఉపాధ్యాయురాలు వద్ది రాజ్ నివేదిత  పర్యవేక్షణ లో స్పెషల్ టీటీసీ  విద్యార్థులు గర్భ  గుడి లో నిర్వహించిన హిందూస్తాని, కర్ణాటక సంగీత  గాత్ర కచేరి  విశేషంగా ఆకర్శించింది.

ఈ  కార్యక్రమం లు అసిస్టెంట్ కమిషనర్ సునీత , ఈఓ వెంకటయ్య, ప్రధాన అర్చకులు  గంగు  ఉపేంద్ర శర్మ  తదితరులు పాల్గొన్నారు

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: