మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
అంతర్గాం మండల పరిధిలోని పెద్దంపేట్ గ్రామంలో పేదలు, రైతులు సాగు చేసుకుంటున్న ఖుర్షికమ్ భూములకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ అనేక సంవత్సరాలుగా సీపీఐ (ఎం ఎల్) న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో పోరాటాలు చేసి ప్రభుత్వా అదికార్లను,ప్రజా ప్రతినిధులను కల్సి అనేక సందర్భాలలో వినతిపత్రాలు ఇవ్వడం జరిగింది.పెద్దంపేట్ గ్రామంలో గత 70 ఏళ్ళనుండి అక్కడి పేద రైతులు సాగు చేసుకుంటున్న ఖుర్షికమ్మి భూములకు తక్షణమే పట్టాలు ఇచ్చి రైతులను ఆదుకోవాలని చేసిన విజ్ఞప్తుల ఫలితంగా స్థానిక రామగుండం నియోజకవర్గ *ఎమ్మెల్యే కోరుకంటి చందర్ మరియు సిపిఐ (ఎం ఎల్) న్యూడెమోక్రసీ ఉమ్మడి కరీంనగర్ జిల్లా కార్యదర్శి కే రాజన్న,పెద్దంపేట్ వార్డు మెంబర్ కుమార్ సిరికొండ కృష్ణ*లు *రాష్ట్ర ప్రభుత్వ రెవిన్యూ ప్రిన్సిపుల్ సెక్రటరీ శ్రీ నవీన్ మిట్టల్ ను ఈ రోజు కలవడం జరిగింది. త్వరలోనే ఖుర్షికమ్ భూములకు పట్టాలు ఇస్తానని *రాష్ట్ర ప్రభుత్వ రెవిన్యూ ప్రిన్సిపుల్ సెక్రటరీ నవీన్ మిట్టల్ హామీ ఇచ్చారని తెలిపారు
ఎన్నో సంవత్సరాల గా ఎన్నో ఆశలతో ఎదిరి చూస్తున్న పెద్దంపేట్ గ్రామ పేద ప్రజల ఆశలు నెరవేరుతాయని *సీపీఐ (ఎం ఎల్) న్యూడెమోక్రసీ ఉమ్మడి కరీంనగర్ జిల్లా*కార్యదర్శి కే రాజన్న*తెలిపారు.

Post A Comment: