ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా చివరి రోజు అయిన తెలంగాణ అమరవీరుల సంస్మరణ దినోత్సవం ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఘనంగా నిర్వహించారు. హనుమకొండ లో రాష్ట్ర పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు గారు, రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్, ఎమ్మెల్యేలు ఆరూరి రమేష్, పెద్ది సుదర్శన్ రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి, జిల్లా కలెక్టర్లు సిక్తా పట్నాయక్, ప్రావీణ్య, సిపి రంగనాథ్ తదితరులతో కలిసి అదాలత్ సెంటర్ లో అమరవీరుల స్థూపం కు నివాళులు అర్పించి, తెలంగాణ గర్వించదగ్గ మహనీయులు కాళోజీ నారాయణరావు, ప్రొఫెసర్ జయశంకర్ సార్, కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఆ తరువాత హనుమకొండ కలెక్టరేట్ లో జరిగిన హనుమకొండ, వరంగల్ జిల్లాల అమరవీరుల కుటుంబాలకు సన్మాన కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో ఈ రోజు అమరవీరుల సంస్మరణ దినోత్సవం జరుపుకుంటున్నాం.
ఈ సందర్భంగా అమరులందరికి నా ఘన నివాళులు.
తెలంగాణ రాష్ట్రం ఎంతోమంది అమరవీరుల త్యాగాలతో ఏర్పడింది.
అసువులు బాసిన వీరులను మనం మరచిపోలేం.
ఇప్పటికీ ఉద్యమ రోజులు గుర్తు వస్తె బాధ అన్పిస్తుంది.
తాము నష్టపోయిన తరువాతి తరాలు తెలంగాణ రాష్ట్రంలో బాగుపడాలి అని వీర మరణం పొందారు.
వారికి మనం ఏమి చేసినా తక్కువే. కానీ వారికి అన్ని విధాలా రాష్ట్రం ఏర్పడ్డాక అప్పటి ఉద్యమ సారథి, నేటి సీఎం కేసీఆర్ అండగా నిలబడ్డారు.
అమరవీరులను, అమరవీరుల కుటుంబాలను సీఎం కెసిఆర్ గుర్తించారు.
తెలంగాణ అమరవీరుల పథకం కింద 4 వందల 50 మందికి కుటుంబసభ్యులలో ఒక్కరికీ ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించారు.
తరువాత మరో 126 మందికి అమరవీరుల కుటుంబసభ్యుల్లో ఒక్కరికీ ఉద్యోగం కల్పించారు.
మొత్తం 5 వందల 76 మందికి ఉద్యోగాలు కల్పించారు
వారి కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించారు.
వారికి కష్టం వస్తె ప్రభుత్వం తరుపున సహాయం చేస్తున్నారు.
తెలంగాణ ఉద్యమంలో అసువులు బాసిన అమర వీరుల స్మృతికి ఘనంగా నివాళులు అర్పించేందుకు, అమరుల త్యాగాలను స్మరించేందుకు హైదరాబాద్ లో ఒక మహాస్మృతి కేంద్రాన్ని, స్మృతివనాన్ని ఏర్పాటు చేయాలని సీఎం కెసిఆర్ నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
ఇందుకోసం పలు డిజైన్లను పరిశీలించిన ముఖ్యమంత్రి కేసీఆర్, 24 గంటలపాటు వెలుగుతూ ఉండే మహా దీపకళిక స్థూపం నమూనాను ఖరారు చేశారు.
25 మంది ప్రఖ్యాత డిజైనర్లు, ఆర్టిస్టులు కలిసి ఈ డిజైన్ రూపొందించారు.
ప్రపంచంలో అపూర్వమైన రీతిలో జ్వలించే మహా దీపకళిక రూపంలో ఈ అమరవీరుల స్థూపం ఉండేలా, స్మృతికేంద్రం నిర్మాణం జరిగింది.
హుస్సేన్‌సాగర్ తీరంలో 12 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించే అమరవీరుల స్మృతి కేంద్రాన్ని, ప్రమిద ఆకృతిలో డిజైన్ చేశారు. ఈ అపురూప స్మారకానికి రూ.146 కోట్లకు పైగా ఖర్చయింది.
తెలంగాణ అమరవీరుల స్థూపాన్ని పూర్తిస్థాయిలో దుబాయ్ నుంచి 40 కంటెయినర్లతో తెప్పించిన స్టెయిన్‌లెస్ స్టీల్‌తో నిర్మించారు.
సాధారణంగా ఆరు లేదా ఏడు అంతస్తుల భవనంతో ఇది సమానం.
ఇక్కడికి వచ్చినవారు కొంత సమయం గడిపేలా, తెలంగాణ ప్రాంత చరిత్ర, అమరవీరుల త్యాగాలు తెలుసుకునేలా ఒక మ్యూజియాన్ని కూడా ఏర్పాటు చేశారు.
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల సందర్భంగా మరోసారి వారికి ఘన నివాళి అర్పిస్తున్నాను.
తెలంగాణ రాష్ట్రావతరణ దశాబ్ది ఉత్సవాలు మన రాష్ట్ర ప్రగతికి సోపానాలు
తెలంగాణ రాక ముందు ఎట్లా ఉండే. ఇప్పుడు ఎట్లా ఉన్నది?!
అప్పటి పరిస్థితులు ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి.
సాగు, తాగు నీళ్ళు లేవు. కరెంట్ ఉండేది కాదు. రోడ్లు సరిగా లేవు. సంక్షేమం లేదు. అభివృద్ధి లేదు. కుల వృత్తులు ఆగమైనవి.
తెలంగాణ రాష్ట్రం వచ్చాకే ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు
సీఎం కెసిఆర్ కి అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళు
రాష్ట్రము ఏర్పడి పదేళ్లు అయిన మన పథకాలు, అభివృద్ధి వల్ల దేశానికి ఆదర్శంగా నిలిచాం.
సీఎం కెసిఆర్ ప్రగతి సంక్షేమ కార్యక్రమాల ద్వారా ప్రజా జీవితాల్లో గుణాత్మక మార్పు వచ్చింది.
నేడు తెలంగాణ అభివృద్ధి, సంక్షేమాల్లో ఒక మోడల్ గా దేశం లోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది.
ప్రజా సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా రాజనీతిని కనబరుస్తూ పనిచేస్తే ఎలాంటి ఫలితాలు సాధించవచ్చో తెలిపేందుకు తెలంగాణ ప్రగతి ఒక కొలమానం.
నేడు తెలంగాణలో సబ్బండ వర్గాల జీవితాల్లో వెల్లివిరుస్తున్న సుఖసంతోషాలే అందుకు నిదర్శనం.
3.5 కోట్ల జనాభా ఉన్న రాష్ట్రంలో 44,12,882 మందికి ప్రతి నెల ఆసరా పెన్షన్లు అందిస్తున్నాం.
కళ్యాణ లక్ష్మి (షాదీ ముబారక్):
ఆడపిల్ల పెండ్లి కోసం ఆర్థిక భారంతో కుంగిపోయే నిరుపేద కుటుంబాలను పెండ్లి ఖర్చుల అవస్థలనుంచి గట్టెక్కించడానికి రాష్ట్రంలోని ప్రతీ పేదింటి ఆడబిడ్డ పెళ్లికి ఆర్థిక సాయం చేయాలని సీఎం కెసిఆర్ నిర్ణయించారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ వర్గాలకు ‘కల్యాణలక్ష్మి’ పథకాన్ని, మైనారిటీలకు షాదీముబారక్ పథకాలన్నీ ప్రభుత్వం అమలు చేస్తున్నది.
ఆడబిడ్డ పెండ్లి ఖర్చులకుగాను రూ.1,00,116 ఆర్థికసాయం అందిస్తున్నది.
దివ్యాంగులకు కళ్యాణలక్ష్మి పథకం కింద రూ. 1,25,145 చెల్లిస్తున్నారు.
2014 నుండి 2023 మే మధ్య కాలంలో 12,71,839 నిరుపేద కుటుంబాలకు కళ్యాణ లక్ష్మి పథకం కింద ఇప్పటి వరకు రూ 11,130 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేసింది.
రైతుబంధు, రైతు బీమా:
రైతుల పెట్టుబడి సమస్యను పరిష్కరించేందుకు తెలంగాణ ప్రభుత్వం వినూత్నమైన, ఆదర్శవంతమైన నిర్ణయం తీసుకున్నది.
రైతుకు పంట సమయంలో పెట్టుబడి తెచ్చుకొని అప్పుల పాలయ్యే క్షోభను తప్పించి ప్రభుత్వమే పంటసాయం ఇస్తున్నది.
రాష్ట్ర ప్రభుత్వం 2018 నుంచి మే 2023 నాటికి 10 విడతల్లో 65,00,588 మంది రైతులకు 65,910.32 కోట్ల రూపాయలను పంట పెట్టుబడి సాయంగా అందజేసింది.
రైతు బీమా ప్రారంభమైనప్పటి నుండి 2023 మే వరకు రూ. 5,383.83 కోట్లను ప్రభుత్వం బీమా ప్రీమియంగా చెల్లించింది. ఇప్పటివరకు 99,297 మంది రైతులు మరణించగా వారి కుటుంబాలకు రూ.4,964.85 కోట్ల బీమా అందింది.
వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంటు:
తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు రైతులు దశాబ్దాల తరబడి కరెంటు కష్టాలు అనుభవించారు. రోజుకు కనీసం 3 లేదా 4 గంటల కరెంటు కూడా రాకపోయేది. దీంతో పంటలు ఎండిపోయి రైతులు విపరీతంగా నష్టపోయేవారు.
ఎలాంటి షరతులు లేకుండా దేశంలోనే 24 గంటలపాటు వ్యవసాయానికి ఉచితంగా నాణ్యమైన కరెంటు ఇచ్చే ఏకైక రాష్ట్రం కేవలం తెలంగాణ మాత్రమే.
పుట్టడం నుండి మరణం దాకా సీఎం కెసిఆర్ అనేక సంక్షేమ పథకాల ను అందిస్తున్నారు.
అమ్మఒడి, కేసీఆర్ కిట్, కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ ల పంపిణీ, ఉచిత వైద్యం అందిస్తున్న ఘనత సీఎం కెసిఆర్ గారి ప్రభుత్వానిది.
యాదవులకు బర్రెల పంపిణీ, గొర్రెల పంపిణీ, ముదిరాజ్ లకుచేప పిల్లల పంపిణీ చేపట్టి కుల వృత్తులను ప్రోత్సహిస్తున్నాము.
అన్ని కులాల వారికి ఆత్మగౌరవ భవనాలు, ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు, సెలూన్లకు ఉచిత విద్యుత్ సరఫరా అందించి ప్రతి ఒక్కరు ఆర్థికంగా ఎదిగేలా చేస్తున్నాం.
ఎన్నో ఏళ్ల కలగా మిగిలి పోయిన గిరిజన తండాలను గ్రామ పంచాయతీలు గా చేసుకొని పల్లె ప్రగతి ద్వారా పల్లెలను కడిగిన ముత్యంలా చేస్తున్నాం.
పేద విద్యార్థులకు గురుకులాలు, ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీలు, బ్రాహ్మణులకు ఉన్నత విద్యార్జనకై ఓవర్సీస్ స్కాలర్ షిప్ లు ఇచ్చి విద్యార్థుల భవితకు బంగారు బాట వేస్తున్నాం.
మిషన్ కాకతీయ ద్వారా చెరువుల పూడికతీత తో భూ గర్భ జలాలు పెరిగాయి.
ప్లోరోసిస్ లాంటి వ్యాధులు రాకుండా ఇంటింటికీ మిషన్ భగీరథ నీళ్ళు ఇస్తున్నాం
మహిళ సంఘాలకు వడ్డీలేని రుణాలు ఇచ్చి వారు ఆర్థికంగా ఎదగడానికి కృషి చేస్తున్నాం.
మహిళలు ఎదగడానికి కుట్టు మిషను శిక్షణ ఇప్పించి ఉచితంగా కుట్టు మిషన్లను అందిస్తున్న ఘనత మన ప్రభుత్వానిది.
ప్రతిష్టాత్మక పథకాలతో ప్రజల జీవితాల్లో గుణాత్మక మార్పే లక్ష్యంగా ప్రభుత్వం ఎన్నో పథకాలతో విజయవంతంగా ముందుకు సాగుతున్నది.
తెలంగాణ మోడల్ గా నిలిచిన తెలంగాణ ఆచరిస్తున్న పలు కార్యక్రమాలను, పథకాలను, దేశంలోని అనేక రాష్ట్రాలతో పాటు కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నది.
సీఎం కేసీఆర్ సారథ్యంలో స్వరాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం సాధించిన వ్యవసాయరంగ ప్రగతి నేడు దేశానికే దిక్సూచిగా నిలిచింది.
తెలంగాణ వ్యవసాయరంగం వ్యవసాయాధారిత భారత దేశానికి వొక నమూనా మార్పును తెచ్చింది.
సీఎం కేసీఆర్ రైతుల గుండెల్లో రైతుబాంధవుడిగా కొలువై వుండడం వెనక అరవయేండ్ల తన్లాట కు సమాధానం వున్నది.
నేడు తెలంగాణ రాష్ట్రంలో దళితులు, గిరిజనులు సంక్షేమ శిఖరాన నిలిచి ప్రగతి ఫలాలను అనుభవిస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వ సాకారంతో వెనుకబడిన తరగతులు ఒక్కో అడుగు ముందుకు వేస్తూ ఆర్థిక స్వావలంబన సాధిస్తున్నారు.
గంగాజమునా తెహజీబ్ కు నిలయమైన తెలంగాణలో, మైనార్టీలు దేశంలో మరెక్కడాలేని విధంగా భరోసాతో ప్రగతి పథంలో దూసుకుపోతున్నారు.
తెలంగాణ వస్తే ఏమొచ్చిందని అడిగినోళ్లకు నేడు తెలంగాణ రాష్ట్రం ఆవిష్కరిస్తున్న అద్భుత విజయాలే సాక్ష్యంగా నిలుస్తున్నాయి.
Post A Comment: