ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
సైన్స్, టెక్నాలజీ అనేది దేశ పురోగతికి ఎంతగానో దోహదపడుతుందని రాష్ట్ర పర్యావరణ, అటవీ, టెక్నాలజీ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎ. వాణిప్రసాద్ అన్నారు.
బుధవారం హనుమకొండ వడ్డేపల్లి లోని ప్రభుత్వ పింగిళి డిగ్రీ కళాశాలలో తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో జాతీయ సైన్స్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర పర్యావరణ, అటవీ, టెక్నాలజీ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎ. వాణిప్రసాద్, జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, తదితరులు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.
ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర పర్యావరణ,అటవీ,టెక్నాలజీ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ ఎ. వాణి ప్రసాద్ మాట్లాడుతూ జీవన విధానంలో సైన్స్ ఒక భాగమని అన్నారు. ఏదైనా ఒక విషయాన్ని లోతుగా తెలుసుకునేందుకు సైన్స్ అనేది తోడ్పడుతుందన్నారు. సైన్స్, టెక్నాలజీలో దేశం మరింత ముందుకెళ్తుందన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సైన్స్, టెక్నాలజీకి అధిక ప్రాధాన్యత నిస్తుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో సైన్స్, టెక్నాలజీని అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. పర్యావరణం పట్ల విద్యార్థులు ఆలోచింపజేసే విధంగా బాధ్యతలను గుర్తు చేశారని నాటిక, పాటలు పాడిన విద్యార్థులను ఉద్దేశించి అన్నారు. రాష్ట్ర స్థాయి పోటీలో వివిధ అంశాల్లో ప్రతిభ చూపిన విద్యార్థులకు అభినందనలు తెలిపారు.
ఆలోచింపజేసి... ఆకట్టుకున్న విద్యార్థులు
ఈ సందర్భంగా కళాశాల విద్యార్థిని శ్రీగౌరీ స్వాగత నృత్యం చేసి ఆకట్టుకున్నారు. గీసుకొండ కేజీబీవి విద్యార్ధినులు ప్లాస్టిక్ వినియోగంతో పర్యావరణంతో పాటు మానవాళి, జంతుజాలానికి కలుగుతున్న ముప్పును తెలియజేస్తూ ప్రదర్శించిన నాటిక అందరిని ఆలోచింపజేసేలా ఎంతగానో ఆకట్టుకుంది. ప్రభుత్వ ప్రాక్టీసింగ్ హై స్కూల్ విద్యార్ధినులు కాలుష్యంతో కలుగుతున్న దుష్పరిణామాలు తెలియజేస్తూ పాట పాడి అలరించారు. దేవురుప్పుల జడ్పీ పాఠశాల విద్యార్థులు మేడారం జాతర నిర్వహణపై వివిధ శాఖలతో నమూనా సమీక్షా సమావేశం నిర్వహించి ఆకట్టుకున్నారు. నారాయణపేట జిల్లా కు చెందిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని బుజ్జమ్మ ప్లాస్టిక్ ను వాడొద్దు అంటూ పాడిన గీతం ఆకట్టుకుంది.
ఈ సందర్భంగా సైన్స్ కు సంబంధించిన పలు ప్రాజెక్ట్ లను విద్యార్ధినులు ప్రదర్శించారు. ప్రాజెక్టుల ప్రయోజనాలను విద్యార్ధినులను ప్రిన్సిపల్ సెక్రెటరీ వాణి ప్రసాద్, కలెక్టర్ సిక్తా పట్నాయక్ అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా రాష్ట్రస్థాయిలో నిర్వహించిన చిత్రలేఖనం, వ్యాసరచన, ఉపన్యాస, తదితర అంశాల్లో పోటీలను నిర్వహించగా వరంగల్, పెద్దపల్లి, ఆదిలాబాద్, నిజామాబాదు, వికారాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, నారాయణపేట, నాగర్ కర్నూల్, కరీంనగర్, ఆసిఫాబాద్, రాజన్న సిరిసిల్ల, సంగారెడ్డి, సిద్దిపేట, తదితర జిల్లా లకి చెందిన విద్యార్థులకు ప్రిన్సిపల్ సెక్రటరీ వాణిప్రసాద్, కలెక్టర్ సిక్తా పట్నాయక్ అందజేశారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మెంబర్ సెక్రటరీ మారుపాక నగేష్, ప్రభుత్వ పింగిళి డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ బి. చంద్రమౌళి, కళాశాల అధ్యాపకులు, విద్యార్థులతో పాటు వివిధ కళాశాలలు, పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు, పాల్గొన్నారు.
*రీజినల్ సైన్స్ సెంటర్ ను సందర్శించిన రాష్ట్ర పర్యావరణ అటవీ టెక్నాలజీ ప్రిన్సిపల్ సెక్రెటరీ వాణి ప్రసాద్*
హనుమకొండ హంటర్ రోడ్డు జూ పార్క్ సమీపంలోని రీజనల్ సైన్స్ సెంటర్ ను రాష్ట్ర పర్యావరణ, అటవీ, టెక్నాలజీ ప్రిన్సిపల్ సెక్రెటరీ వాణి ప్రసాద్, జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ సందర్శించారు.
రీజినల్ సైన్స్ సెంటర్ లోని ఇన్నోవేషన్ ల్యాబ్ , రీసెర్చ్ సెంటర్, సైన్స్ గ్యాలరీని పరిశీలించగా వాటి వివరాలను సైన్స్ సెంటర్ ప్రాజెక్ట్ ఆఫీసర్ నితీష్ రెడ్డి, తదితరులు వివరించారు.
ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;ఎన్నికల్లో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు క్యాంపస్ అంబాసిడర్లు కృషి చేయాలని ట్రైనీ కలెక్టర్ శ్రద్ధ శుక్లా అన్నారు.
మంగళవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్ లో ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు లోక్ సభ ఎన్నికలు 2024పై క్యాంపస్ అంబాసిడర్లకు కొత్తగా ఓటర్ల నమోదు, ఓటింగ్ శాతాన్ని పెంచే వివిధ అంశాలపై శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సమావేశంలో ట్రైనీ కలెక్టర్ శ్రద్ధ శుక్లా మాట్లాడుతూ గత పార్లమెంట్ ఎన్నికల్లో వరంగల్ పశ్చిమ, పరకాల పరిధిలోని పలు పోలింగ్ కేంద్రాలలో ఓటింగ్ శాతం తక్కువగా నమోదయిందని, రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఆ పోలింగ్ కేంద్రాలలో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు ఓటర్లలో చైతన్యం తీసుకురావాలని క్యాంపస్ అంబాసిడర్లకు సూచించారు. అర్హులైన యువతను ఓటర్లుగా నమోదు చేయడంలో కీలకపాత్రను పోషించాలన్నారు.
ఈ సందర్భంగా కొత్తగా ఓటర్ల నమోదు, ఓటింగ్ శాతాన్ని పెంచే వివిధ అంశాలపై మాస్టర్ ట్రైనర్లు భాస్కర్ రెడ్డి , సుధాకర్ రెడ్డి క్యాంపస్ అంబాసిడర్లకు శిక్షణ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో ట్రైనీ ఐపీఎస్ శుభం నాగరాలే, డిపిఓ, స్వీప్ నోడల్ ఆఫీసర్ లక్ష్మీ రమాకాంత్, జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ ఎం. హరి ప్రసాద్, జిల్లాలోని వివిధ కళాశాలల విద్యార్థులు( క్యాంపస్ అంబాసిడర్లు)పాల్గొన్నారు.
ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;హనుమకొండ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో 25 అదనపు ఈవీఎంలు (కంట్రోల్ యూనిట్లు)మొదటి దశ తనిఖీ ప్రక్రియను రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో మంగళవారం నిర్వహించారు.
ఈ తనిఖీ ప్రక్రియను జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, అదనపు కలెక్టర్ మహేందర్ జీ పరిశీలించారు.
ఈ సందర్భంగా ఈసీఐఎల్ ఇంజనీర్ల ఆధ్వర్యంలో అదనపు ఈవీఎంల తనిఖీ ప్రక్రియ కొనసాగగా వాటి వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. తనిఖీ ప్రక్రియను పరిశీలించారు. తనిఖీ ప్రక్రియకు సంబంధించిన పలు రికార్డులను కలెక్టర్ పరిశీలించారు.
అదనపు ఈవీఎంల మొదటి దశ తనిఖీ ప్రక్రియ అనంతరం మాక్ పోలింగ్ ను అధికారులు నిర్వహించారు. ఈ ప్రక్రియ అనంతరం అదనపు ఈవీఎంలను పోలీస్ భద్రత మధ్య వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డులోని స్ట్రాంగ్ రూములకు తరలించారు.
ఈ సందర్భంగా కలెక్టరేట్ ఏవో కుసుమ సత్యనారాయణ, ఎన్నికల విభాగం సుపరింటెండెంట్ ఏవిఎన్వి ప్రసాదరావు, నాయబ్ తహసిల్దార్లు కొండూరి సంతోష్, జన్ను శ్యామ్, దేవులపల్లి రామకృష్ణ, ఎన్నికల సిబ్బంది అన్వేష్, రవి, తదితరులతోపాటు వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు నేహాల్, రజినీకాంత్, మణి, లక్ష్మణ్, సునీల్, జైపాల్ రెడ్డి, వెంకట్, సయ్యద్ ఫైజుల్లా పాల్గొన్నారు.
గోదావరిఖని ప్రగతినగర్కు చెందిన పస్తం అశోక్ (27) మద్యానికి బానిసై, జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య కు పాల్పడినట్లు NTPC- SI ఉదయ్ కిరణ్ తెలిపారు. మద్యం మత్తులో ఉన్న అశోక్ చైతన్యపురి కాలనీ శివారు రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడినట్లు పేర్కొన్నారు. మృతునికి భార్య, కుమార్తె ఉన్నారు. మృతుని సోదరుడు సారయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు SI తెలిపారు.
పెద్దపల్లి,ఫిబ్రవరి,24,మేడిగడ్డటీవీన్యూస్ఛానల్ మార్చి3నుంచి మార్చి5వరకు ఇంటింటికివెళ్లి పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహణ,అధికారులు సమన్వయంతో పని చేసి,0-5సంవత్సరాల లోపు పిల్లలకు పోలియో చుక్కలు వేయించాలి.పిల్లల నిండు జీవితానికి తప్పనిసరిగా రెండు పోలియో చుక్కలు వేయించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే.అరుణశ్రీ తెలిపారు.శనివారం స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే.అరుణ శ్రీ సమీకృత పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ లోని తన చాంబర్ లో ఐదేళ్లలోపు చిన్నారులకు పల్స్ పోలియో చుక్కలు వేయు కార్యక్రమంపై సంబంధిత అధికారులతో సమీక్షించారు.ఈ సందర్భంగా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే.అరుణశ్రీ మాట్లాడరు,అప్పుడే పుట్టిన శిశువు నుండి ఐదేళ్లలోపు చిన్నారులకు మార్చి3న ఏర్పాటు చేసే పోలియో బూత్ లలో పోలియో చుక్కల మందు వేయడం జరుగుతుందని,తదుపరి రెండు రోజుల పాటు సిబ్బంది ఇంటింటికి తిరిగి పోలియో చుక్కలు వేసుకోని వారిని గుర్తించి వేయాలని,జిల్లాలో వంద శాతం o-5 చిన్నారులందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయాలని తెలిపారు.జిల్లాలో మార్చి3నుంచి మార్చి 5వ తేదీ వరకు పల్స్ పోలియో కార్యక్రమం ఉంటుందని,జిల్లాలో 62 వేల 700 మంది0-5 వయసు గల పిల్లలు ఉన్నారని వీరందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని అధికారులకు ఆదేశించారు.పెద్దపల్లి జిల్లాలో400పోలియో బూతులు ఏర్పాటు చేస్తున్నట్లు,పోలియో చుక్కలు కార్యక్రమంలో పాల్గొనే వైద్య సిబ్బంది,ఆశా కార్యకర్తలు,అంగన్వాడి టీచర్లకు త్రాగునీరు,భోజన సదుపాయం మున్సిపల్ కమిషనర్లు,మండలాల్లో తహసీల్దార్లు కల్పించాలని అదనపు కలెక్టర్ ఆదేశించారు.దూరప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల సౌకర్యార్థం పల్స్ పోలియో చుక్కలు వేయుటకు బస్టాండ్లు,రైల్వే స్టేషను,ముఖ్యమైన కూడలి ప్రాంతాలలో ఏర్పాట్లు చేయాలని సూచించారు.లైన్ డిపార్ట్మెంట్ అధికారులు సమన్వయంతో పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు.పోలియోపై ప్రజలకు అవగాహన కల్పించాలని,గ్రామాల్లో టాం-టాం ద్వారా పోలియో కార్యక్రమం నిర్వహించే తేదీలు,బూత్ వివరాలు ప్రజలకు తెలియ జేయాలని,మైక్ ల ద్వారా గ్రామాల్లో ప్రతి ఒక్కరికి పల్స్ పోలియో కార్యక్రమం గురించి తెలిసేలా విస్త్రుత ప్రచారం చేయాలనీ తెలిపారు.పల్స్ పోలియో కార్యక్రమం మార్చి3న ఆదివారం ఉన్నందున పోలియో బూత్ లను ముందుగానే సిద్ధం చేసి బూత్ లలో నీటి వసతి,కుర్చీలు,ఇతర అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలనీ,గ్రామాల్లో,మున్సిపాలిటీ లలో ఎక్కడేక్కడ బూత్ లు ఏర్పాటు చేశారనే సమాచారాన్ని ప్రజలకు ముందుగానే తెలియజేయాలని,బస్టాండ్,రైల్వే స్టేషన్ ఇతర రద్ది ప్రాంతాలలో పల్స్ పోలియో కార్యక్రమానికి సంబంధించిన బ్యానర్ లను ఏర్పాటుచేసి బూత్ వివరాలు,తేది,సమయం అన్ని వివరాలను తెలియపరచాలని అన్నారు.ఎస్.ఎచ్.జి గ్రూప్ ల ద్వారా అంగన్వాడి కేంద్రాలలో,ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ఉన్న ఐదేలల్లోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయించేలా అవగాహన కల్పించాలని,పిల్లల తల్లితండ్రులకు పోలియోపై అవగాహన కల్పించి పోలియో చుక్కలు వేయించాలని అన్నారు.జిల్లాలో అర్హత గల చిన్నారులందరికీ పోలియో చుక్కలు వేయించి,పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అధికారులను కోరారు.ఈ సమావేశంలో పెద్దపల్లి రెవెన్యూ డివిజన్ అధికారి సి.హెచ్.మధు మోహన్,పెద్దపల్లి మున్సిపల్ కమిషనర్ ఏ.వెంకటేశ్,సుల్తానాబాద్ మున్సిపల్ కమిషనర్ వేణు మాధవ్,జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ ప్రమోద్ కుమార్,జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రమాకాంత్,జిల్లా సంక్షేమ అధికారి రౌఫ్ ఖాన్,జిల్లా పంచాయతీ అధికారి ఆశాలత,డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ కృపాబాయ్,టిఎస్ ఆర్టిసి అధికారులు కె.ఆర్ రెడ్డి,లయన్స్ క్లబ్ సభ్యులు రాజగోపాల్,సంబంధిత అధికారులు,తదితరులు పాల్గొన్నారు.
బిగ్ బాస్ ఫేం యూట్యూబర్ షణ్ముక్ జశ్వంత్ ను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు బిగ్ బాస్ ఫేమ్ షణ్ముక్ సోదరులను అరెస్టు చేశారు. ఓ కేసులో విచారణ కోసం వెళితే గంజాయితో యూట్యూబర్ షణ్ముక్ పట్టుబడ్డాడు. అసలు విషయం ఏంటంటే.. తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి.. మరో యువతిని చేసుకున్నాడని సంపత్ వినయ్ పై ఫిర్యాదు చేసింది మోనిక. సంపత్ వినయ్ ఎవరో కాదు బిగ్ బాస్ ఫేం షణ్ముక్ అన్న. సంపత్ వినయ్ కోసం ఫ్లాట్ కి వెళ్ళిన పోలీసులు... ఇంట్లో తనిఖీ చేయగా.. గంజాయితో షణ్ముక్ పట్టుబడ్డాడు. అన్నా, తమ్ముడు ఇద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
మేడారం మహా జాతరకు పర్యాటక శాఖ తరపున సకల ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే కుంభమేళా వంటి మేడారం మహా జాతర లో పర్యాటక శాఖ తరఫున అనేక ఏర్పాట్లు చేయనైనది.
మేడారం మహా జాతర సందర్భంగా హైదరాబాద్ నుంచి మేడారం వరకు విఐపి దర్శనం చేయించి, మళ్ళీ హైదరాబాద్ లో దించే హెలికాప్టర్ సర్వీసులను భక్తుల సౌకర్యార్థం పర్యాటకశాఖ ఏర్పాటు చేయడం జరిగింది. దేశంలో ఈ స్థాయిలో జరిగే మరే జాతరలో కూడా ఇలాంటి హెలికాప్టర్ సర్వీసులు లేవని, మేడారం జాతరలో మాత్రం ఐదవ సారి సైతం హెలికాప్టర్ సేవలను ఏర్పాటు చేశారు.
మేడారం మహా జాతరకు వచ్చే వివిఐపీ, విఐపీల వసతి, భోజన ఏర్పాట్లను హరిత మేడారం వద్ద ఏర్పాటు చేశారు. పర్యాటకశాఖ ఆధ్వర్యంలో ఉన్న హరిత రామప్ప , హరిత గట్టమ్మ , హరిత లక్నవరం హరిత తాడ్వాయి, హరిత భవత హోటల్ లో ఏర్పాట్లు చేయడం జరిగింది.
హరిత హోటల్ మేడారం వద్ద గల ఆదివాసి మ్యూజియం ప్రాంగణంలో పర్యాటకశాఖ ఆధ్వర్యంలో ఛాయాచిత్ర ప్రదర్శన, పర్యాటక సమాచార కేంద్రం ఏర్పాటు చేశారు. హరిత గ్రాండ్ హోటల్ ప్రాంగణం లో ఆదివాసుల జీవన విధానం తెలిసే విధంగా ట్రైబల్ హట్స్ ఏర్పాటు చేశారు.
అదేవిధంగా మేడారం హరిత హోటల్ గ్రాండ్ సమావేశం మందిరంలో కేంద్ర ప్రభుత్వ టెక్స్ టైల్ మరియు హ్యాండ్లూమ్ మంత్రిత్వ శాఖ ద్వారా చేనేత వస్త్ర ప్రదర్శన ఏర్పాటు చేశారు.
ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
రేపటి నుండి నాలుగు రోజుల పాటు ఆత్మకూరు మండలంలోని అగ్రంపహాడ్ సమ్మక్క సారలమ్మ జాతరకు చేసిన ఏర్పాట్లను హనుమకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ గారు శాఖల వారిగా అధికారులతో సమీక్షించారు.
హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలంలోని అగ్రంపహాడ్ జాతర పనులను జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ మంగళవారం పరిశీలించారు.
జాతర కు వచ్చే భక్తుల కోసం ఏర్పాటు చేసిన స్నాన ఘట్టాలను, పబ్లిక్ టాయిలెట్స్ పనులను కలెక్టర్ పరిశీలించారు. అదేవిధంగా వెహికల్ పార్కింగ్ ప్రదేశాలను పరిశీలించి పోలీస్ శాఖ వారికి తగు ఏర్పాట్లు చేయవలసిందిగా ఆదేశించారు. జాతరలో పూర్తి కాబడిన పనులను వివిధ శాఖలతో సమీక్షించినారు. రెడ్ క్రాస్ హనుమకొండ వారు జాతర లో ఏర్పాటు చేసిన వైద్య శిభిరమును శ్రీ రేవూరి ప్రకాశ్ రెడ్డి శాసనసభ్యులు పరకాల గారితో కలిసి ప్రారంభ చేసినారు. వివిధ మండలము నుండి వచ్చిన అధికారులకు వారు చేయవలసిన డ్యూటీ పనులను నిర్వర్తించడం లో తగు సూచనలు చేసినారు, రాబోవు నాలుగు రోజులు చాలా జాగ్రత గా విధులు నిర్వర్తించాలని కోరినారు.భక్తులకు ఎలాంటి అసౌకార్యం కలుగ కూడదని అధికారులకు తగు అదేశములు జారీ చేశారు.
ఈ కార్యక్రమంలో పరకాల ఆర్డీవో శ్రీనివాస్, ఏసీపీ కిషోర్ కుమార్, ఎంపీడీవో శ్రీనివాస్ రెడ్డి తహసిల్దార్ జగన్మోహన్ రెడ్డి, ఆత్మకూరు సిఐ సంతోష్, ఈవో శేషగిరి, పంచాయతీరాజ్ డిఇ లింగారెడ్డి, ఎస్ఆర్ఎస్పి డిఈ వేణుగోపాల్, ఎలక్ట్రిసిటీ ఏఈ రవికుమార్, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ సతీష్, ఏపీవో రాజిరెడ్డి, పంచాయతీ కార్యదర్శి బుచ్చిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ లో రానున్న పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలోని వివిధ శాఖల అధికారులతో నోడల్ కమిటీని ఏర్పాటు చేయగా మంగళవారం సాయంత్రం సన్నాహక సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ జిల్లాలో ఎన్నికలలో పాల్గొనే సిబ్బంది వివరాల ఆన్లైన్లో నమోదు, ఎన్నికల సిబ్బందికి ట్రైనింగ్, ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు స్విప్ ఆధ్వర్యంలో చేపట్టే కార్యక్రమాలు, ఎన్నికలకు సంబంధించిన ఫిర్యాదుల కోసం సెంటర్ ఏర్పాటు, ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు , ఎన్నికల పరిశీలకులు, ఎన్నికలకు సంబంధించిన తదితర అంశాలపై ఈ సందర్భంగా అధికారులతో చర్చించారు.
ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మహేందర్ జీ మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లపై జిల్లాలో పదహారు మంది నోడల్ అధికారులను నియమించినట్లు తెలిపారు.
ఈ సమావేశంలో డీఆర్వో వై. వి. గణేష్, వరంగల్ సెంట్రల్ జోన్ డీసీపీ ఎం.ఎ. భారీ, జడ్పీ సిఈఓ విద్యా లత, డిప్యూటీ సీఈవో రవి, డీటీసీ శ్రీనివాస్, ఆర్ అండ్ బి డీఈఈ సురేష్ బాబు, సిపివో సత్యనారాయణ రెడ్డి, అగ్రికల్చర్ జెడి రవీందర్ సింగ్, మైనింగ్ ఎడీ నర్సిరెడ్డి, స్వీప్ నోడల్ ఆఫీసర్ హరిప్రసాద్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
మేడారం మహాజాతర సందర్భంగా మహదేవపూర్ మండలం కాళేశ్వరం పరిధిలోని ఇసుక క్వారీల్లో నేటి నుంచి 24 వరకు లోడింగ్ నిలిపివేస్తున్నట్లు టీఎస్ఎండీసీ పీఓ తారక్నాథ్రెడ్డి సోమవారం ప్రకటనలో పేర్కొన్నారు. రహదారిపై ఇసుక లారీలతో మేడారం జాతరకు వెళ్లే వాహనాలకు ట్రాఫిక్ అంతరాయం కలగకుండా నియంత్రణలో భాగంగా బంద్ చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
ములుగు జిల్లామేడారంలో ఆర్టీసీ తాత్కాలిక బస్టాండ్ ను మంత్రి సీతక్క ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మేడారం జాతరకు వచ్చే భక్తులకు బస్సు ల వేళలు తెలియజేస్తూ
నీడ కల్పించేందుకు ఉపయోగ పడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పీ శబరిష్, పాల్గొన్న ఆర్టీసీ వరంగల్ ఆర్ ఎం శ్రీలత, స్పెషల్ ఆఫీసర్ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.
ప్రత్యేక పూజలు నిర్వహించిన సీతక్క అనంతరం
బస్ టికెట్ కౌంటర్స్, క్యూ లైన్స్ ను రిబ్బన్ కట్ చేసి మంత్రి సీతక్క ప్రారంభించారు.
ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
చైతన్య డీమ్డ్ యూనివర్సిటీ 12వ స్నాతకోత్సవాన్ని హన్మకొండలోని నయీమ్ నగర్ లో గల చైతన్య డిగ్రీ, యూనివర్సిటీ కళాశాలల ఆవరణలో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ భారత ప్రభుత్వం మాజీ సెక్రెటరీ ఎస్. చంద్రశేఖర్ హాజరై ప్రసంగించారు. గత మూడు దశాబ్దాలుగా చైతన్య విద్యాసంస్థలు, ప్రస్తుత సిడియు అనేక అవార్డులు, నాణ్యమైన విద్యను అందించడంలో పురోగతిని సాధించాయని ఆయన ప్రశంసించారు. గ్రాడ్యుయేట్లను ఉద్దేశించి మాట్లాడుతూ నిర్దేశిత విషయాలను క్రోడి కరించుకొని నాయకత్వ పటిమని కనబరచాలని సూచించారు. విజయాన్ని సాధించడానికి నిరంతర అంకితభావం అవసరమన్నారు. భారత ప్రభుత్వ సలహా మేరకు చైతన్య డీమ్డ్ యూనివర్సిటీని హైదరాబాద్కు మార్చవలసి వచ్చిందని అన్నారు. ప్రస్తుతం సిడియు 24 సంస్థలతో ఒప్పందం కుదుర్చుకొని ఉద్యోగాలు ఇచ్చేటందుకు రిజిస్టర్ చేసుకోవడం జరిగిందన్నారు. ఈ స్నాతకోత్సవంలో 45 మంది పరిశోధనాత్మక పట్టాలు సమర్పించగా వారిలో 12 మంది పీహెచ్డీ డిగ్రీలకు ఎంపిక కావడం జరిగిందని, ప్రస్తుతం ఆరుగురు వారి పీహెచ్డీ పట్టాలని పొందినట్లుగా తెలిపారు. ప్రతిభగల పరిశోధనలు చేసిన అధ్యాపకులకు బంగారు పతకాలతో పాటు లక్ష రూపాయల నగదును కూడా ఇచ్చినట్లుగా పేర్కొన్నారు. ప్రస్తుతం 15 దేశాల నుండి వివిధ కోర్సులలో 415 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నట్లుగా చెప్పారు. డిగ్రీలో 6 గురికి, పీజీలో 7 గురికి ర్యాంకులు పొందిన వారికి బంగారు పతకాలను అందజేశారు. ఈ స్నాత కోత్సవంలో మొత్తం 756 మంది విద్యార్థులు డిగ్రీలను పొందారు. స్నాతకోత్సవంలో డిగ్రీలు పొందిన వారిని, బంగారు పతకాలను సాధించిన వారిని అతిధులు అభినందించారు. కార్యక్రమంలో గౌరవ అతిధులు, కళాశాల యూనివర్సిటీల బాధ్యులు ఇనుగాల పెద్దిరెడ్డి, కళ్యాణ్ చక్రవర్తి, చైర్మన్ వి పురుషోత్తం రెడ్డి, దామోదర్, విక్రం రెడ్డి, సాత్విక, వీర వెంకటయ్య, రవీందర్, అధ్యాపకులు, గాదె రాంబాబు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ :
ఈనెల 20వ తేదీన జరగనున్న జాతీయ నులి పురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా అధికారులు సమన్వయంతో విజయవంతం చేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు.
హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ లో ఈనెల 20వ తేదీన జరగనున్న జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం, అదేవిధంగా మార్చి 3వ తేదీన నిర్వహించే పల్స్ పోలియో కార్యక్రమం పై జిల్లా వైద్య ఆరోగ్యశాఖ, విద్యాశాఖ, ఐసిడిఎస్, పంచాయతీరాజ్, విద్యుత్ శాఖ, ఆర్డబ్ల్యూఎస్ శాఖల అధికారులతో సమన్వయ కమిటీ సమావేశాన్ని శుక్రవారం సాయంత్రం నిర్వహించారు.
ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ మాట్లాడుతూ ఫిబ్రవరి 20వ తేదీన జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవాన్ని, అదేవిధంగా మార్చి మూడవ తేదీన నిర్వహించే పల్స్ పోలియో కార్యక్రమాన్ని జిల్లాలో విజయవంతం చేసేందుకు అధికారులు కృషి చేయాలన్నారు. అందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను సిద్ధం చేయాలని సూచించారు.
ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి. సాంబశివరావు మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని ఈనెల 20వ తేదీన జిల్లాలోని అన్ని అంగన్వాడి కేంద్రాలు , పాఠశాలలు, కళాశాలల్లో నిర్వహించనున్నట్లు తెలిపారు. ఒక సంవత్సరం నుండి 19 సంవత్సరాల వరకు వయసున్న పిల్లలకు ఆల్బెండజోల్ మాత్రలను వేయడం జరుగుతుందన్నారు. జిల్లాలోని 2లక్షల 33 వేల 500 మంది పిల్లలకు ఈ మాత్రలను వేయడానికి ఏర్పాట్లను సిద్ధం చేసినట్లు పేర్కొన్నారు. ఈ మాత్రను ఫిబ్రవరి 20వ తేదీన వేయించకుంటే 27వ తేదీన వేసే విధంగా ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు. మార్చి మూడవ తేదీన జిల్లావ్యాప్తంగా 79 వేల 227 మంది చిన్నారులకు పల్స్ పోలియో చుక్కలను వేయనున్నట్లు తెలిపారు.
ఈ సమావేశంలో డిఆర్వో వై.వి. గణేష్, డీఈవో డాక్టర్ అబ్దుల్ హై, అడిషనల్ డీఎంహెచ్వో డాక్టర్ మదన్ మోహన్ రావు, డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ యాకుబ్ పాషా, డిఐఓ డాక్టర్ వాణిశ్రీ, ఎన్సిడి ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ ఉమాశ్రీ, డిటిసిఓ డాక్టర్ హిమబిందు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని కలెక్టర్ చాంబర్ లో రాష్ట్ర డిప్యూటీ కలెక్టర్స్ అసోసియేషన్ డైరీ ని హనుమకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ చేతుల మీదుగా శుక్రవారం సాయంత్రం ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా డైరీ ని తీసుకురావడం పట్ల డిప్యూటీ కలెక్టర్స్ కు కలెక్టర్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ మహేందర్ జి, డిప్యూటీ కలెక్టర్లు వై.వి. గణేష్, ఎల్ రమేష్, శ్రీనివాస్, ఉమారాణి, తదితరులు పాల్గొన్నారు.
ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
ప్రజలకు రుణాలను అందించి ఆర్థిక అభివృద్ధి చెందే విధంగా బ్యాంకర్లు తోడ్పాటు అందించాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు.
హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్ లో బ్యాంకర్లు, వివిధ సంక్షేమ శాఖల అధికారులతో జిల్లా సంప్రదింపుల కమిటీ సమావేశము శుక్రవారం జరిగినది.
ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ మాట్లాడుతూ పశుసంవర్ధక శాఖ, మత్స్యశాఖ అధికారులు కిసాన్ క్రెడిట్ కార్డ్ ఇచ్చేందుకు క్యాంపులను నిర్వహించి రుణాలను ఇప్పించాలని బ్యాంకర్లను, అధికారులను కలెక్టర్ ఆదేశించారు. గత సమావేశాల్లో చర్చకు వచ్చిన సమస్యలను పరిష్కరించాలన్నారు. సమావేశానికి పూర్తి వివరాలతో రావాలన్నారు.
ఈ సందర్భంగా పొటెన్షియల్ లింక్డ్ క్రెడిట్ ప్లాన్ 2024-25ను జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ చేతుల మీదుగా ఆవిష్కరించారు.
ఈ సమావేశంలో లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ శ్రీనివాస్ మాట్లాడుతూ 28 బ్యాంకులు 163 శాఖల ద్వారా 2023 - 24 సంవత్సరానికి నిర్దేశించుకున్న వార్షిక రుణ ప్రణాళిక రూ.4826 .41 కోట్లకు గానూ మూడవ త్రైమాసికానికి రూ.8078 .11 కోట్లు రుణ మంజూరు జరిగిందన్నారు. ప్రాధాన్యతా రంగములో వ్యవసాయ రంగానికి రూ.2624 .35 కోట్లు, పరిశ్రమల రంగానికి రూ.1470 .21 కోట్లు, విద్యా రుణాలు రూ.31 .26 కోట్లు, గృహ నిర్మాణ రంగానికి రూ.34 .89 కోట్లు , ఇతర ప్రాధాన్యతా రంగాలకు రూ. 66 .85 కోట్లు రుణ మంజూరీ జరిగిందని తెలిపారు. ఇతర రంగములకు రూ.3850 .55 కోట్లు రుణాలు ఇచ్చినట్లు పేర్కొన్నారు.
ఖాతాదారులకు చేరువ, వికసిత భారత్ సంకల్ప్ యాత్ర వంటి కార్యక్రమాల ద్వారా ఆర్ధిక కార్యకలాపాలపై ప్రజలకు అవగాహన కల్పించినట్లు తెలిపారు. జీవన జ్యోతి బీమా యోజన కింద 67862 , సురక్ష బీమా యోజన ద్వారా 241756 ఖాతాదారులకు బీమా సౌకర్యము కల్పించటం జరిగిందన్నారు. అటల్ పెన్షన్ యోజన ద్వారా సుమారు 49890 మంది ఖాతాదారులకు పెన్షన్ సౌకర్యము కల్పించటం జరిగిందన్నారు. ముద్ర యోజన ద్వారా 15756 మంది చిన్న వ్యాపారులకు రుణ మంజూరి చేసినట్లు తెలిపారు . ప్రధాన మంత్రి ఎంప్లాయిమెంట్ జనరేషన్ ప్రోగ్రాం ద్వారా 135 యూనిట్స్ మంజూరు చేసినట్లు పేర్కొన్నారు.
ఈ సమావేశంలో జిల్లా పరిశ్రమల శాఖ మేనేజర్ ఎం. హరి ప్రసాద్ ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకం గురించిన వివరాలను తెలియజేశారు.
ఈ సందర్భంగా ఆయా బ్యాంకుల అధికారులను రుణాల మంజూరు, తదితర అంశాల గురించి కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు.
ఈ సమావేశములో నాబార్డ్ ఏజిఎం రవి, ఆర్.బి.ఐ అధికారి రెహమాన్, డీఆర్డీఓ నాగ పద్మజ , ఎస్సీ కార్పొరేషన్ ఈడి మాధవీ లత, బీసీ వెల్ఫేర్ డిడి రామ్ రెడ్డి, జిల్లా పశుసంవర్ధక శాఖ జెడి డాక్టర్ వెంకటనారాయణ, మెప్మా పీడీ బద్రు నాయక్, అగ్రికల్చర్ ఏడి దామోదర్ రెడ్డి, డీపీఎంలు దాసు, శ్రీకాంత్, ఎస్బిఐ ఆర్సెటి డైరెక్టర్ రవి, వివిధ బ్యాంకుల అధికారులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లో కలెక్టర్ సిక్తా పట్నాయక్ ను పలువురు ఎంపీడీవోలు మర్యాదపూర్వకంగా గురువారం సాయంత్రం కలిసి పుష్పగుచ్చాలని అందజేశారు.
బుధవారం ఆయా మండలాలకు ఎంపీడీవోలుగా బాధ్యతలు స్వీకరించగా కలెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు.
కలెక్టర్ ను మర్యాద పూర్వకంగా కలిసిన వారిలో పరకాల ఎంపీడీవో పెద్ది ఆంజనేయులు, హసన్ పర్తి ఎంపీడీవో ఐ. ప్రవీణ్, ఐనవోలు ఎంపీడీవో పి. వెంకటేశ్వర్లు, ధర్మసాగర్ ఎంపీడీవో కె. అనిల్ కుమార్, ఎల్కతుర్తి ఎంపీడీవో ఎన్. విజయ్ కుమార్, శాయంపేట ఎంపీడీవో ఎ. ఫణి చంద్ర, నడికుడ ఎంపీడీవో సిహెచ్. శ్రీనివాస్, దామెర ఎంపీడీవో జి. కల్పన ఉన్నారు.
ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
ఈ నెల 21నుండి నాలుగు రోజుల పాటు ఆత్మకూరు మండలంలోని అగ్రంపహాడ్ సమ్మక్క సారలమ్మ జాతరకు అన్ని ఏర్పాట్లను శనివారం నాటికి పూర్తి చేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు.
హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలంలోని అగ్రంపహాడ్ జాతర పనులను జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ శుక్రవారం పరిశీలించారు.
జాతర కు వచ్చే భక్తుల కోసం జరుగుతున్న స్నాన ఘట్టాలను, పబ్లిక్ టాయిలెట్స్ పనులను కలెక్టర్ పరిశీలించారు. అదేవిధంగా వెహికల్ పార్కింగ్ ప్రదేశాలను పరిశీలించి పోలీస్ శాఖ వారికి తగు ఏర్పాట్లు చేయవలసిందిగా ఆదేశించారు. జాతర సమీపిస్తున్న నేపథ్యంలో అక్కడి ఏర్పాట్లు, పనులు చేపడుతున్న వివిధ శాఖలతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఏవైనా పనులు అసంపూర్తిగా ఉన్నట్లయితే వాటిని శనివారం నాటికి పూర్తి చేయవలసిందిగా సంబంధిత శాఖల అధికారులను కలెక్టర్ ఆదేశించారు. సమీక్ష సమావేశానికి ముందు అమ్మవార్లను కలెక్టర్ దర్శించుకున్నారు.
గ్రామంలోని నర్సరీని సందర్శించి నర్సరీలో పెంచుతున్న వివిధ రకాల మొక్కలను కలెక్టర్ పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో పరకాల ఆర్డీవో శ్రీనివాస్, ఏసీపీ కిషోర్ కుమార్, ఎంపీడీవో శ్రీనివాస్ రెడ్డి తహసిల్దార్ జగన్మోహన్ రెడ్డి, ఆత్మకూరు సిఐ సంతోష్, ఈవో శేషగిరి, పంచాయతీరాజ్ డిఇ లింగారెడ్డి, ఎస్ఆర్ఎస్పి డిఈ వేణుగోపాల్, ఎలక్ట్రిసిటీ ఏఈ రవికుమార్, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ సతీష్, ఏపీవో రాజిరెడ్డి, పంచాయతీ కార్యదర్శి బుచ్చిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
మేడిగడ్డ ప్రాజెక్ట్ పరిశీలన కై కాళేశ్వరం కు బయలుదేరిన రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు రేవంత్ రెడ్డిని మార్గమధ్యంలోని ఎన్. ఎస్. ఆర్ హోటల్ కు చేరుకున్న సందర్భంగా ముఖ్యమంత్రి ని వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్, కలెక్టర్ సిక్త పట్నాయక్ లు మర్యాదపూర్వకంగా కలుసుకొని పూల మొక్క ను అందజేశారు.
ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;రానున్న పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డులోని ఈవీఎంల గోదాంల వద్ద ఈవీఎంల మొదటి దశ తనిఖీ ప్రక్రియ సోమవారం కొనసాగింది.
ఈవీఎంల గోదాంల వద్ద కొనసాగుతున్న ఈవీఎంల మొదటి దశ తనిఖీ ప్రక్రియను హనుమకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ పరిశీలించారు.
మొదటి దశ తనిఖీ ప్రక్రియలో భాగంగా గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈవీఎంలు, బ్యాలెట్ యూనిట్లు, కంట్రోల్ యూనిట్లు, వివి ప్యాట్లను ఈసీఐఎల్ ఇంజనీర్ల బృందం ఆధ్వర్యంలో తనిఖీ ప్రక్రియ కొనసాగుతుండగా జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ పరిశీలించి అదనపు కలెక్టర్ మహేందర్ జీ , హనుమకొండ ఆర్థివో ఎల్. రమేష్ లను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఈవీఎంల మొదటి దశ తనిఖీ ప్రక్రియను పూర్తి చేయగా, మంగళవారం ఉదయం వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఈసీఐఎల్ ఇంజనీర్ల సమక్షంలో మాక్ పోల్ ను నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కాజీపేట, నడికుడ, దామెర తహశీల్దార్లు ఇస్లావత్ బావ్ సింగ్, గుండాల నాగరాజు, జ్యోతి వరలక్ష్మి దేవి, కలెక్టరేట్ ఏవో సత్యనారాయణ, నాయబ్ తహశీల్దారులు సంతోష్, రామకృష్ణ, తదితరులతోపాటు వివి రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఈసీఐఎల్ ఇంజనీర్ల బృందం, ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు.
ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
పట్టు పరిశ్రమ రంగంలో రైతులు గణనీయమైన ప్రగతిని సాధించాలని
హనుమకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్
అన్నారు.
హనుమకొండలోని అంబేద్కర్ భవన్ లో ప్రాంతీయ పట్టు పరిశోధన కేంద్రం, కేంద్రీయ పట్టు మండలి, ములుగు, సిద్దిపేట జిల్లాలు, తెలంగాణ రాష్ట్ర పట్టు పరిశ్రమ శాఖ ఆధ్వర్యంలో పట్టు రైతులు, రీలర్లు, వీవర్ల సమ్మేళనం 'పట్టు కృషి మేళా' ను సోమవారం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి హనుమకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ముఖ్యఅతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వివిధ స్టాళ్లను కలెక్టర్ సందర్శించగా వాటిని గురించి అధికారులు వివరించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ మాట్లాడుతూ పట్టు పరిశ్రమలో గణనీయమైన ప్రగతిని సాధించి ఆదర్శంగా నిలవాలన్నారు. పట్టు పరిశ్రమ రంగంలో సాంకేతికతను వినియోగించుకుంటూ రైతులు అభివృద్ధి చెందాలన్నారు. పట్టు పరిశ్రమలను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తామన్నారు. పట్టు పరిశ్రమ రంగానికి సహకారం అందిస్తామన్నారు. సమావేశానికి రావడం సంతోషకరంగా ఉందన్నారు.
ఈ సందర్భంగా పట్టు పరిశ్రమ శాఖ జెడి లత మాట్లాడుతూ పట్టు పరిశ్రమల రంగంలో రైతులు లాభాలను గడిస్తున్నారని అన్నారు. నూతన సాంకేతిక పద్ధతులను తెలుసుకొని పట్టు రైతులు గణనీయమైన ప్రగతిని సాధిస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని పట్టు పరిశ్రమకు దేశంలోనే మంచి పేరు ఉందని అన్నారు. తెలంగాణలోని పది జిల్లాల్లో పట్టు పరిశ్రమ రంగం బాగుందని, మిగతా జిల్లాల్లో విస్తరించాల్సి ఉందన్నారు. మార్కెటింగ్ లో పట్టు రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపడతామన్నారు.
ఈ సందర్భంగా పట్టు పరిశ్రమ రంగంలో మంచి ప్రగతిని సాధించడానికి చేపట్టాల్సిన చర్యలపై శాస్త్రవేత్తలు, ఆదర్శ రైతులు, పట్టు పరిశ్రమ శాఖ అధికారులు పలు సలహాలు సూచనలు చేశారు.
ఈ కార్యక్రమంలో మైసూర్ లోని సిఎస్ఆర్టిఐ డైరెక్టర్ డాక్టర్ గాంధీదాస్, వరంగల్ జెడిఎస్ అనసూయ, డాక్టర్ వినోద్ కుమార్ యాదవ్, అధికారులు, పట్టు రైతులు, రీలర్లు, వీవర్లు పాల్గొన్నారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలో విషాదం చోటు చేసుకుంది. నస్తూరిపల్లి అటవీ ప్రాంతంలో విద్యుత్ షాక్తో గ్రేహౌండ్స్ కమాండో (కానిస్టేబుల్) ప్రవీణ్ మరణించారు. అడవి జంతువుల కోసం పెట్టిన విద్యుత్ తీగలు తగిలి మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై విచారం వ్యక్తం చేసిన సీఎం రేవంత్ రెడ్డి.. కరెంట్ తీగలు పెట్టిన వారిని పట్టుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
గిరిజన సాంప్రదాయాల ప్రకారం మేడారం మహా జాతరను అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు.
గురువారం మేడారంలోని హరిత హోటల్ సమావేశ మందిరం లో మీడియా ప్రతినిధులతో " మీడియా ఇంటరాక్షన్ " కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ నిర్వహించారు.
ఈ సందర్భగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జాతర లో గిరిజన సాంప్రదాయాలు ఉట్టిపడేలా రద్దీ ప్రాంతాలలో గిరిజన ప్రత్యేక పెయింటింగ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. జాతరలో నిరంతరం పారిశుధ్య పనులు జరిగిన నాలుగువేల మంది పారిశుధ్య కార్మికులను అందుబాటులో ఉంచామని వీరితోపాటు ఐటిసి, సింగరేణి, సంస్థల ద్వారా ఏర్పాటుచేసిన ప్రత్యేక యంత్రాల ద్వారా కూడా పారిశుధ్య పనులు చేయడం జరుగుతుందని తెలిపారు. యానిమల్ కంపోజ్ , టాయిలెట్ వేస్టేజ్ ప్రాసెసింగ్ చేయడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని జాతరలో వేస్టేజ్ గల్ఫర్స్ సంఖ్య పెంచామని అన్నారు.
ఆర్డబ్ల్యూఎస్ ఆధ్వర్యంలో 14 క్లస్టర్, 279 యూనిట్స్ ద్వారా 5,532 టాయిలెట్స్ ఏర్పాటు చేయడం జరిగిందని నూతనంగా 230 కొత్త బోర్ వెల్స్ ను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఇరిగేషన్ శాఖ ఆధ్వర్యంలో జంపన్న వాగు లోతట్టు ప్రాంతాలలో మరియు రద్దీ ప్రదేశాలలో గజ ఈతగాలను ఏర్పాటు చేశామని, జాతర సమయంలో 14 - 16 తేదీన లక్నవరం సరస్సు నుంచి నీటిని విడుదల చేయడం జరుగుతుందని అన్నారు.
జాతరకు వచ్చే భక్తులకు వైద్యశాఖ నుంచి 30 ప్రత్యేక హెల్త్ క్యాంప్స్ అంబులెన్స్ ను ఏర్పాటు చేశామని , ఆర్టీసీ మహిళ సిబ్బందికి టికెట్ కౌంటర్స్ వద్ద ప్రత్యేక వసతి సదుపాయాలు ఏర్పాటు చేయడం జరిగిందని జాతరకు వచ్చే భక్తులకు 6000 బస్సులు అందుబాటులో ఉంటాయని తెలిపారు.
అనంతరం జిల్లా ఎస్పీ శబరిష్ మాట్లాడుతూ పోలీస్ ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు జాతరలో 14 వేల మంది పోలీస్ సిబ్బంది ఏర్పాటు చేశామని తెలిపారు. జాతరలో ప్రత్యేక ప్రణాళికల ద్వారా ట్రాఫిక్ , క్రైమ్ , భక్తుల రద్దీ కంట్రోల్ చేయడం జరిగింది అన్నారు. వనదేవతలను తీసుకొచ్చే సమయంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని రోప్ పార్టీ ద్వారా దేవతల ప్రతిష్టకు భంగం కలగకుండా క్రౌడ్ కంట్రోల్ చేయడానికి ప్రత్యేక టెక్నాలజీ ఉపయోగిస్తున్నట్లు తెలిపారు.
జాతరలో 500 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా పరిశీలిస్తామని, వీఐపీ , వీవీఐపీ ల దర్శనం వల్ల సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకుండా చూస్తామని జాతరకు తెలంగాణ ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి వచ్చే అవకాశం ఉన్నందున పటిష్ట భద్రత ఏర్పాటు చేస్తున్నాం అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఐటిడిఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ అంకిత్, అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి శ్రీజ, ఏటూరు నాగారం అదనపు ఎస్పీ సిరిషేట్టి సంకీర్త్ , దేవాదాయ శాఖ అధికారి రాజేందర్, తదితరులు పాల్గొన్నారు.
ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
మన దేశ వారసత్వ సాంప్రదాయానికి ప్రతీక కుస్తీ క్రీడని హనుమకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ పేర్కొన్నారు. హనుమకొండ జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో తెలంగాణ అమెచ్యూర్ రెజ్లింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం అండర్ -20 రాష్ట్రస్థాయి బాలబాలికల రెజ్లింగ్ పోటీలను కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ శక్తియుక్తుల మేళవింపుతో కూడిన క్రీడా రెజ్లింగ్ రాణించాలంటే ప్రణాళిక బద్ధంగా శ్రమించాలన్నారు. శారీరక దృఢత్వానికి ప్రతీక ఈ క్రీడ అన్నారు. అంతర్జాతీయ వేదికలపై భారత త్రివర్ణ పతాకాన్ని సగర్వంగా ఎగరవేస్తున్న అంతర్జాతీయ రెజ్లర్ల స్ఫూర్తితో మన జిల్లా రాష్ట్ర క్రీడాకారులు విజయకేతనం ఎగరవేయాలన్నారు. జిల్లాలో ప్రతిభావంతులైన రెజ్లర్లకు కొదవలేదని వారిని అన్ని విధాలుగా ప్రోత్సహించనున్నట్లు చెప్పారు. అనంతరం ప్రస్తుత పోటీలను లాంఛనంగా ప్రారంభించారు. అండర్ 15 లో విజేత లుగా నిలిచిన క్రీడాకారులకు ఆమె సర్టిఫికెట్లను అందజేసి మెడల్స్ ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో హనుమకొండ జిల్లా క్రీడల అధికారి జి .అశోక్, తెలంగాణ అమెచ్యూర్ రెజ్లింగ్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మహ్మద్ కరీం, కోశాధికారి వై.సుధాకర్, వివిధ జిల్లాల రెజ్లింగ్ సంఘాల బాధ్యులు జైపాల్, సాయిలు, శ్రీనివాస్, రాజేందర్, సతీష్, రాజు, వంశీకృష్ణలు పాల్గొన్నారు.
ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
జయశంకర్ భూపాలపల్లి జిల్లా పోలీసు శాఖ నేతృత్వంలో జరిగిన మెగా వైద్య శిబిరం విజయవంతమైంది. జిల్లా పరిధిలోని పలిమెల, మహా ముత్తారం, భూపాలపల్లి, మండలాల్లో వివిధ వ్యాధులతో బాధపడుతున్న 6 గొత్తికోయ గుంపుల నుంచి, మరియు అటవీ ప్రాంత గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ శిబిరానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎస్పి కిరణ్ ఖరే మాట్లాడుతూ అన్నింటి కన్నా ఆరోగ్యమే మహాభాగ్యమన్నారు. హైదరాబద్ మలక్ పేట యశోద ఆస్పత్రి సౌజన్యoతో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ సహకారంతో మెగా వైద్య శిబిరం నిర్వహించినట్లు ఎస్పి తెలిపారు. మారుమూల ప్రజల ఆరోగ్యం పట్ల పోలీసు శాఖ ప్రత్యేక శ్రద్ధ వహిస్తుందన్నారు. గురువారం మహాముత్తారం మండలం పెగడపల్లి గ్రామంలో ఉచిత మెడికల్ క్యాంపు కు దాదాపు 1000 మంది తరలివచ్చి అన్ని రకాల పరీక్షలు చేయించుకున్నారని, మెడిసిన్స్ ఉచితంగా పంపిణీ చేయడంతో పాటు, ఉచిత భోజన వసతి కల్పించామని, అలాగే చలి తీవ్రతను తట్టుకోవడానికి 100 మంది గుత్తి కోయలకు దుప్పట్లు పంపిణీ చేశామని పేర్కొన్నారు. ఇంకా రాబోవు కాలంలో గుత్తి కోయల అభ్యున్నత్తికై అనేక కార్యక్రమాలు పోలీస్ డిపార్ట్మెంట్ తరపున చేపడతామని ఎస్పి కిరణ్ ఖరే తెలిపారు. అటవీ ప్రాంత, గుత్తి కోయల కుటుంబాలకు అవసరమైన సాయం అందించాలని స్థానిక పోలీసులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి అదనపు ఎస్పీ నరేష్ కుమార్, కాటారం డిఎస్పీ జి రామ్మోహన్ రెడ్డి, డిఎంహెచ్వో మధుసూధన్, జిల్లా మెడికల్ అండ్ హెల్త్ సిబ్బంది, హైదరాబాద్ మలక్ పేట యశోద హాస్పిటల్స్ డాక్టర్స్ బృందం, ముత్తారం, ఎంపీడీవో జడ్పిటిసి, ఎంపీటీసీ, కాటారం, భూపాలపల్లి, మహాదేవ్ పూర్ సిఐలు అర్జున్ రావు, నరేష్ కుమార్, రాజేశ్వేర్ రావు , భూపాలపల్లి డాక్టర్ లు కిరణ్, శ్రీనివాస్, కాటారం సబ్ డివిజన్ పరిధిలోని ఎస్ఐలు, పోలిసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని పోలీస్ స్టేషన్ అవరణలో నూతనంగా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ను బుధవారం ఎస్పీ కిరణ్ ఖరే, కలెక్టర్ భవేష్ మిశ్రా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ప్రారంభించారు. ఈ సందర్బంగా ఎస్పి కిరణ్ ఖరే IPS మాట్లాడుతూ భూపాలపల్లి పట్టణం గతంతో పోల్చుకుంటే ట్రాఫిక్ బాగా పెరిగిందని, పెరిగిన రద్దీ దృష్ట్యా, జరుగుతున్న ప్రమాదాలను దృష్టిలో ఉంచుకొని ట్రాఫిక్ పిఎస్ ను ఏర్పాటు చేసినట్లు ఎస్పీ తెలిపారు. జిల్లాలో సింగరేణి జేన్ కో, ఇసుక క్వారీలు ఉన్నాయని, దీంతో కొంత వాహన రద్దీ పెరిగిందని, ప్రమాదాల నివారణ కోసం ట్రాఫిక్ అవగాహనతో పాటు ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంటు నిర్వహిస్తున్నామని, నెంబర్ ప్లేట్ లేకుండా వాహనాలు నడపొద్దని, ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటిస్తూ ప్రమాదాల బారిన పడకుండా జాగ్రత్త వహించాలని అన్నారు. జిల్లాలో నూతనంగా ఏర్పాటు చేసిన ట్రాఫిక్ పిఎస్ లో ఒక ఎస్సై తో పాటు 18 మంది సిబ్బంది పని చేయనున్నారని ఎస్పి తెలిపారు. అలాగే ట్రాఫిక్ నియంత్రణ కోసం కొన్ని యంత్రాలు కొనుగోలు చేశామని రోడ్డు ప్రమాదంలో మరణాలు పెరుగుతున్నాయని ట్రాఫిక్ నియమ నిబంధనలు తప్పక పాటించాలని కోరారు. ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ అనేది జిల్లా ప్రజల కోసం ఏర్పాటు చేశామని ఎస్పీ పేర్కొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా కేంద్రం లో జనాభా గణనీయంగా పెరిగిందని, రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రజలు ట్రాఫిక్ రూల్స్ పాటించాలన్నారు. ట్రాఫిక్ పిఎస్ కోసం తమ వంతు సహకారం అందిస్తామని, పోలిసు శాఖతో సమన్వయంతో పనిచేస్తామని అన్నారు. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఎస్పి చొరవతో ఏర్పాటు చేయడం అభినందనీయమని, త్వరలోనే ప్రభుత్వం నుంచి అన్ని రకాల వనరులు సమకూరుస్తామని అన్నారు. జాతీయ రహదారులపై ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని, ప్రజలు ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పి ఏ. నరేష్ కుమార్, ఏఆర్ అడిషనల్ ఎస్పీ శ్రీనివాస్, భూపాలపల్లి డిఎస్పి రాములు, భూపాలపల్లి సిఐ నరేష్ కుమార్, ట్రాఫిక్ ఎస్ఐ శ్రీనివాస్, ఇతర అధికారులు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
పెద్దపల్లి:గోదావరిఖని:ఫిబ్రవరి:7:మేడిగడ్డటీవీ న్యూస్ ఛానల్:పెద్దపల్లి జిల్లా రామగుండం మున్సిపల్,గోదావరిఖని తిలక్ నగర్ చౌరస్తాలో నిత్యం ఆవులు(గోమాతలు) రోడ్లపైనే తిరుగుతూ పడుకోవడంతో వాహనదారులు.బాటసారులు అనేక ఇబ్బందులు ఏర్పడుతున్నామని వాపోతున్నారు.ఇవి నిత్యం ఇలా ఎందుకు ఉంటున్నాయి ఇవి ఎక్కడివి అని చూడవలసిన బాధ్యత మునిసిపల్ అధికారులపై.కౌన్సిలర్లపై ఉంటుంది.ఎవరికి చెప్పినా పట్టించుకోవడం లేదని ప్రజలు వాపోతున్నారు.గోదావరిఖని చివరస్త నుండి ఏ ప్రాంతంలో చూసినా ఇదే పరిస్థితి.కొన్ని దానము ఇచ్చిన వారిడిచిపెట్టిండ్రు.కొన్ని దేవుని పేరు మీద.ఈనాముగా ఇచ్చినవి.ఇలా విచ్చలవిడిగా విడిచి పెట్టడంతో ద్విచక్ర వాహనదారులు వాటికి తగిలి అనేకమంది గాయాలపాలైన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.ఇవి బజార్లో చెత్తాచెదారం ప్లాస్టిక్ కవర్లుతిని పొట్ట ఉబ్బి చనిపోయిన సందర్భాలుకూడా ఉన్నాయని.అధికారులు వీటి యజమానులపై చర్య తీసుకోవాలని?.లేదా వేములవాడ,గోశాలలా కు తరలించాలని అధికారులకు.ప్రజాప్రతినిధులకు ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు...
ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;ఎన్నికలలో వినియోగించే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ల( ఈవీఎంల) గురించి ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు.
బుధవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లో రాబోయే లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ ( ఈవీఎం )ప్రదర్శన కేంద్రం వద్ద రిబ్బన్ కట్ చేసి జిల్లా కలెక్టర్ ప్రారంభించారు.
ఈవీఎం ప్రదర్శన కేంద్రం వద్ద వినియోగిస్తున్న ఈవీఎం పనితీరు గురించి , బ్యాలెట్ యూనిట్, కంట్రోల్ యూనిట్, వివి ప్యాట్ పనితీరు గురించి ఎన్నికల విభాగం అధికారులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఓటు వేసినప్పుడు ఈవీఎం పనితీరు గురించి ఈవీఎం ప్రదర్శన కేంద్రం వద్ద పలువురికి ఎన్నికల విభాగం అధికారులు, సిబ్బంది అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో డిఆర్ఓ వై. వి.గణేష్, ట్రైనీ కలెక్టర్ శ్రద్దా శుక్లా, సామాజిక వేత్త ఇ. వి. శ్రీనివాస్ రావు, హన్మకొండ తాసిల్దార్ విజయ్ కుమార్, ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ ప్రసాదరావు, అధికారులు సురేష్ కుమార్, సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;నగరాభివృద్ధికి అందరూ సహకరించాలని వరంగల్ పశ్చిమ నియోజకవర్గం శాసనసభ సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు.
హనుమకొండలో నగర మేయర్ గుండు సుధారాణి, మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ, తదితరులతో కలిసి ఏర్పాటుచేసిన సమావేశంలో ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ నగరాభివృద్ధికి
ఇక ముందు ఏ నిర్ణయాలు తీసుకున్న అందరితో కలిసి కొత్త ఆలోచనలతో ముందుకు సాగాలని నిర్ణయాలు తీసుకోవడం జరిగిందని అన్నారు. అభివృద్ధికి అడ్డంకులు సృష్టించడానికి కొందరు ప్రయత్నిస్తున్నారని, వారి పద్ధతిని మార్చుకోవాలన్నారు. ఇప్పటికైనా పద్ధతి మార్చుకొని అభివృద్ధికి సహకరించాలని కోరారు. గోపాల్ పూర్, ఇతర
చెరువులు,కుంటలు, నాలాలు చాలామంది కబ్జా చేసిన విషయం తమ దృష్టికి వచ్చిందని ఎమ్మెల్యే అన్నారు.
కబ్జా చేసిన వారు వాటిని ఏమాత్రం ఆలస్యం చేయకుండా తక్షణమే ప్రభుత్వానికి స్వచ్ఛందంగా అప్పగించాలని పేర్కొన్నారు. కబ్జా చేసిన వాటిని స్వచ్ఛందంగా ప్రభుత్వానికి అప్పగిస్తే గౌరవప్రదంగా ఉంటుందని, లేకుంటే చర్యలు తప్పవని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి హెచ్చరించారు.
ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
భారతదేశ సంస్కృతి, సాంప్రదాయానికి ప్రతీకైనా రెజ్లింగ్ క్రీడలో జాతీయస్థాయిలో తెలంగాణ కీర్తి ప్రతిష్టలు ఇనుమడింపజేయాలని వరంగల్ పశ్చిమ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి తెలిపారు. హనుమకొండ జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో బుధవారం తెలంగాణ అమెచ్యూర్ రెజ్లింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో
రాష్ట్రస్థాయి అండర్ -15, అండర్-20 రెజ్లింగ్ చాంపియన్ షిప్ ప్రారంభ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా విచ్చేసిన ఎమ్మెల్యే మాట్లాడుతూ క్రీడలు సోదర స్నేహ భావానికి చిహ్నం అన్నారు. క్రీడల్లో భాగస్వాములైన యువత అన్ని రంగాల్లో రాణించే అవకాశం ఉందన్నారు. బాల్యం నుండే తమకు ఆసక్తి ఉన్న ఏదైనా ఒక క్రీడారంగంలో చిన్నారులు శిక్షణ పొందాలన్నారు. క్రీడలతో క్రమశిక్షణ అలవర్చుకుంటూ ఉజ్వల భవిష్యత్ పొందవచ్చు అన్నారు.
తెలంగాణ రెజ్లింగ్ అసోసియేషన్ అధ్యక్షులు హఫీజ్ ఖాన్ మాట్లాడుతూ అడ్హక్ కమిటీ, రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా గారి ఆదేశానుసారం ఈ రాష్ట్రస్థాయి పోటీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. క్రీడాకారులకు ఉచితంగా భోజన వసతి సౌకర్యం కల్పించడమే కాకుండా ఏ విధమైన ఎంట్రీ ఫీజు లేకుండా ఈ పోటీలు నిర్వహిస్తున్నామన్నారు.
ఉమ్మడి వరంగల్ జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు మహ్మద్ అజీజ్ ఖాన్ మాట్లాడుతూ భారత త్రివర్ణ పతాకాన్ని సగర్వంగా ఎగరవేస్తున్న క్రీడ రెజ్లింగ్ అన్నారు. గత ఏడాదికాలంగా ఇబ్బందులు ఎదుర్కొన్న రెజ్లింగ్ క్రీడాకారులకు కొత్త రాష్ట్ర కార్యవర్గం ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. రెజ్లింగ్ క్రీడాభివృద్ధికి పూర్తిగా సహకరించనున్నట్లు చెప్పారు. తెలంగాణ రెజ్లింగ్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మహ్మద్ కరీం మాట్లాడుతూ తెలంగాణలోని 33 జిల్లాల నుండి దాదాపు 600 మంది క్రీడాకారులు ఈ ఛాంపియన్షిప్ లో పాల్గొంటున్నట్లు చెప్పారు. ఈ పోటీలో విజేతలుగా నిలిచిన క్రీడాకారులు ఈనెల 11 నుండి మధ్యప్రదేశ్ రాష్ట్రంలో నుండి గ్వాలియర్ లో జరిగే జాతీయస్థాయి పోటీలకు ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. అనంతరం రాష్ట్రస్థాయి పోటీలను అతిథులు లాంఛనంగా ప్రారంభించారు. అతిథులను రాష్ట్ర రెజ్లింగ్ సంఘం ఘనంగా సన్మానించింది. ఈ కార్యక్రమంలో శాట్స్ పరిశీలకులు , డివైఎస్వో జి.అశోక్ కుమార్, తెలంగాణ అథ్లెటిక్స్ అసోసియేషన్ చైర్మన్ వరద రాజేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి సారంగపాణి, వరంగల్ జిల్లా ఒలింపిక్ సంఘం ప్రధాన కార్యదర్శి బి.కైలాసం యాదవ్, వివిధ జిల్లాల రెజ్లింగ్ సంఘాల బాధ్యులు ఎస్.రాజ్ కుమార్, జైపాల్, షేక్ రియాజ్, కాశీ హుస్సేన్, బి.సాయిలు, టి.శ్రీనివాస్, రవిలు పాల్గొన్నారు.
ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ
హాన్మకొండ ;
పింగిలి ఉమెన్స్ డిగ్రీ కాలేజీలో రోడ్ సేఫ్టీ అవేర్నెస్ వీక్ లో భాగంగా నెహ్రూ యువ కేంద్ర జిల్లా జిల్లా యువజన అధికారి చింతల అన్వేష్ నేతృత్వంలో వరంగల్ ఏసిపి ట్రాఫిక్ భోజరాజు కాజీపేట సీఐ సుజాత పింగిలి డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్ ప్రిన్సిపల్ చంద్రమౌళి సంయుక్త ఆధ్వర్యంలో రోడ్ సేఫ్టీ అవేర్నెస్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది పింగిలి డిగ్రీ కాలేజ్ విద్యార్థిని విద్యార్థులు మరియు ఎన్ వై కే మై భారత్ వాలంటీర్స్ కాలేజీ యొక్క యాజమాన్యం మరియు విద్యార్థులతో ర్యాలీ తీయడం స్లోగన్స్ ఇవ్వడం జరిగింది ఈ యొక్క ర్యాలీ ఫాతిమా జంక్షన్ లో విద్యార్థులు వారి యొక్క ఫ్లాష్ మా తో రోడ్ సేఫ్టీని వివరిస్తూ యువత డ్రైవింగ్ లో నియమ నిబంధనలు పాటిస్తూ వారి యొక్క ప్రాణాలు కాపాడుకోవాలని వివరిస్తూ విద్యార్థులు మరియు నెహ్రూ యువ కేంద్ర యాజమాన్యం మరియు పింగిలి డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్ యాజమాన్యం మరియు ట్రాఫిక్ యాజమాన్యం ఇందులో పాల్గొనడం జరిగింది. దీనికి ముఖ్యఅతిథిగా ఏసీపీ వరంగల్ ట్రాఫిక్ భోజరాజ్ జిల్లా యువజన అధికారి చింతల అన్వేష్ ఎఫ్ పిఓ శ్రీధర్ సిఐ ఖాజీపేట్ సుజాత హనుమకొండ ట్రాఫిక్ ఎస్ఐ రామారావు పింగిలి ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ చంద్రమౌళి కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ రామకృష్ణ మరియు ఎన్ఎస్ఎస్ ఆఫీసర్ రాధిక మరియు రాజేశ్వరి మరియు మంగమ్మ నెహ్రూ యువ కేంద్ర వరంగల్ వాలంటరీ గాలి బిక్షపతి నక్క భరత్ మరియు వెల్దండ సురేష్ పాల్గొనడం జరిగింది.
ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డ్ లోని ఈవీఎం గోదాముల వద్ద ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ల మొదటి దశ తనిఖీ(ఎఫ్ఎల్సీ) ప్రక్రియ మంగళవారం రెండో రోజు కొనసాగింది.
రానున్న పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డ్ లోని గోదాముల వద్ద రెండో రోజు కొనసాగుతున్న ఈవీఎంల ఎఫ్.ఎల్.సి ప్రక్రియను హనుమకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, అదనపు కలెక్టర్ మహేందర్ జి, ట్రైనీ కలెక్టర్ శ్రద్ధా శుక్లా తో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ల మొదటి దశ తనిఖీ ప్రక్రియలో ఈవీఎంల బ్యాలెట్ యూనిట్లు, కంట్రోల్ యూనిట్లు, వివి ప్యాట్ల పనితీరును కలెక్టర్ పరిశీలించారు.
ఈ సందర్భంగా హనుమకొండ జిల్లా కలెక్టర్ సిక్తా నాయక్ మాట్లాడుతూ రానున్న పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో భారత ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈవీఎంల ఫస్ట్ లెవెల్ చెకింగ్ ప్రక్రియ ఈనెల 5 నుండి 12వ తేదీ వరకు కొనసాగనుందన్నారు. ఈవీఎంల మొదటి దశ తనిఖీ ప్రక్రియ వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈసీఐఎల్ ఇంజనీర్ల ఆధ్వర్యంలో కొనసాగుతుందన్నారు. ఈవీఎంల మొదటి దశ తనిఖీ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
ఈ సందర్భంగా ఎఫ్ఎల్సిలో పాల్గొంటున్న అధికారులు, సాంకేతిక నిపుణులతో మాట్లాడి ఇప్పటివరకు చేపట్టిన ప్రక్రియను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఈవీఎంల మొదటి దశ తనిఖీ ప్రక్రియ లో 755 బ్యాలెట్ యూనిట్లు, 628 కంట్రోల్ యూనిట్లు, 765 వివి ప్యాట్ల పనితీరును అధికారులు సాంకేతిక నిపుణులు తనిఖీ చేస్తున్నారు.
ఈ సందర్భంగా తహశీల్దార్లు బావ్ సింగ్, నాగరాజు, జ్యోతి వరలక్ష్మి దేవి, కలెక్టరేట్ ఏవో సత్యనారాయణ, నాయబ్ తహశీల్దార్లు సంతోష్, రామకృష్ణ, విఠలేశ్వర్, శ్యామ్, ఎన్నికల విభాగం సిబ్బందితోపాటు ఈసీఐఎల్ ఇంజనీర్లు, రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.
ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
ఈనెల 8 న పెగడపల్లి ప్రభుత్య గిరిజన ఆశ్రమ పాఠశాల లో ఉదయం 9 గంటలనుండి సాయంత్రం వరకు ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహించనున్నారు. ఈ మెగా మెడికల్ క్యాంపులో హైదరాబాద్ యశోద హాస్పిటల్ మలక్ పేట్ కు చెందిన సూపర్ స్పెషాలిటీ డాక్టర్ల వైద్య బృందం. అలాగే మన భూపాలపల్లి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి, డాక్టర్లు, మరియు పారామెడికల్ సిబ్బంది ఈ మెగా మెడికల్ క్యాంపులో పాల్గొని రోగులకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తారు. అవసరమైనవారికి అక్కడికక్కడే వైద్య పరీక్షలు నిర్వహించి ,రోగులకు ఉచితంగా మందుల పంపిణీ జరగనుంది. కావున అడవిముత్తారం, పలిమెల మరియు భూపాలపల్లి మండలాలకు చెందిన మారుమూల అటవీ గ్రామ ప్రజలు ఈ వైద్య శిబిరం సేవలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎస్పి కిరణ్ ఖరే కోరారు.
ముఖ్య సంచాలక్ అనపర్తి సాయి తేజ
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో కుల బాంధవుడు అయినటువంటి స్వాతంత్ర్య సమరయోధుడు తెలంగాణ ముద్దుబిడ్డ ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ విగ్రహం ఆవిష్కరణ కార్యక్రమం కాటారం వ్యాపార కూలీలు విగ్రహావిష్కరణ కార్యక్రమం మంత్రివర్యులు దుద్దిల శ్రీధర్ బాబు చేతుల మీదుగా విగ్రహావిష్కరణ కార్యక్రమం చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి సంఘం అధ్యక్షులు దోమల సమ్మయ్య మాచర్ల రాజేందర్ పులి అశోక్ కొండ వెంకటేశ్వర్లు కుసుమ సమ్మయ్య దాసరి గట్టయ్య పల్నాటి బలరాం గాదె రమే రమేష్ అమృత సంతోష్ మరియు పద్మశాలి కుల బాంధవులు అధిక సంఖ్యలో పాల్గొని ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది.