ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
మన దేశ వారసత్వ సాంప్రదాయానికి ప్రతీక కుస్తీ క్రీడని హనుమకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ పేర్కొన్నారు. హనుమకొండ జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో తెలంగాణ అమెచ్యూర్ రెజ్లింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం అండర్ -20 రాష్ట్రస్థాయి బాలబాలికల రెజ్లింగ్ పోటీలను కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ శక్తియుక్తుల మేళవింపుతో కూడిన క్రీడా రెజ్లింగ్ రాణించాలంటే ప్రణాళిక బద్ధంగా శ్రమించాలన్నారు. శారీరక దృఢత్వానికి ప్రతీక ఈ క్రీడ అన్నారు. అంతర్జాతీయ వేదికలపై భారత త్రివర్ణ పతాకాన్ని సగర్వంగా ఎగరవేస్తున్న అంతర్జాతీయ రెజ్లర్ల స్ఫూర్తితో మన జిల్లా రాష్ట్ర క్రీడాకారులు విజయకేతనం ఎగరవేయాలన్నారు. జిల్లాలో ప్రతిభావంతులైన రెజ్లర్లకు కొదవలేదని వారిని అన్ని విధాలుగా ప్రోత్సహించనున్నట్లు చెప్పారు. అనంతరం ప్రస్తుత పోటీలను లాంఛనంగా ప్రారంభించారు. అండర్ 15 లో విజేత లుగా నిలిచిన క్రీడాకారులకు ఆమె సర్టిఫికెట్లను అందజేసి మెడల్స్ ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో హనుమకొండ జిల్లా క్రీడల అధికారి జి .అశోక్, తెలంగాణ అమెచ్యూర్ రెజ్లింగ్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మహ్మద్ కరీం, కోశాధికారి వై.సుధాకర్, వివిధ జిల్లాల రెజ్లింగ్ సంఘాల బాధ్యులు జైపాల్, సాయిలు, శ్రీనివాస్, రాజేందర్, సతీష్, రాజు, వంశీకృష్ణలు పాల్గొన్నారు.
Post A Comment: