సికింద్రాబాద్ కంటోన్మెంట్ భారాస ఎమ్మెల్యే లాస్య నందిత (Lasya Nanditha) శుక్రవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే.హైదరాబాద్: సికింద్రాబాద్ కంటోన్మెంట్ భారాస ఎమ్మెల్యే లాస్య నందిత (Lasya Nanditha) రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. ప్రమాద ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నందిత మృతిపై వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. శుక్రవారం తెల్లవారుజామునే ప్రమాదం జరిగిందని.. డ్రైవర్ నిద్రమత్తు, వేగమే ప్రమాదానికి కారణమై ఉంచొచ్చని పోలీసులు ప్రాథమికంగా అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. రెయిలింగ్ను ఢీకొట్టడంతో ఆమె ప్రయాణించిన కారు ముందు భాగం పూర్తిగా దెబ్బతింది. ప్రమాద తీరును పోలీసు బృందాలు పరిశీలిస్తున్నాయి.
Post A Comment: