పెద్దపల్లి,ఫిబ్రవరి,24,మేడిగడ్డటీవీన్యూస్ఛానల్ మార్చి3నుంచి మార్చి5వరకు ఇంటింటికివెళ్లి పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహణ,అధికారులు సమన్వయంతో పని చేసి,0-5సంవత్సరాల లోపు పిల్లలకు పోలియో చుక్కలు వేయించాలి.పిల్లల నిండు జీవితానికి తప్పనిసరిగా రెండు పోలియో చుక్కలు వేయించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే.అరుణశ్రీ తెలిపారు.శనివారం స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే.అరుణ శ్రీ సమీకృత పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ లోని తన చాంబర్ లో ఐదేళ్లలోపు చిన్నారులకు పల్స్ పోలియో చుక్కలు వేయు కార్యక్రమంపై సంబంధిత అధికారులతో సమీక్షించారు.ఈ సందర్భంగా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే.అరుణశ్రీ మాట్లాడరు,అప్పుడే పుట్టిన శిశువు నుండి ఐదేళ్లలోపు చిన్నారులకు మార్చి3న ఏర్పాటు చేసే పోలియో బూత్ లలో పోలియో చుక్కల మందు వేయడం జరుగుతుందని,తదుపరి రెండు రోజుల పాటు సిబ్బంది ఇంటింటికి తిరిగి పోలియో చుక్కలు వేసుకోని వారిని గుర్తించి వేయాలని,జిల్లాలో వంద శాతం o-5 చిన్నారులందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయాలని  తెలిపారు.జిల్లాలో మార్చి3నుంచి మార్చి 5వ తేదీ వరకు పల్స్ పోలియో కార్యక్రమం ఉంటుందని,జిల్లాలో 62 వేల 700 మంది0-5 వయసు గల పిల్లలు ఉన్నారని వీరందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని అధికారులకు ఆదేశించారు.పెద్దపల్లి జిల్లాలో400పోలియో బూతులు ఏర్పాటు చేస్తున్నట్లు,పోలియో చుక్కలు కార్యక్రమంలో పాల్గొనే వైద్య సిబ్బంది,ఆశా కార్యకర్తలు,అంగన్వాడి టీచర్లకు త్రాగునీరు,భోజన సదుపాయం మున్సిపల్ కమిషనర్లు,మండలాల్లో తహసీల్దార్లు కల్పించాలని అదనపు కలెక్టర్ ఆదేశించారు.దూరప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల సౌకర్యార్థం పల్స్ పోలియో చుక్కలు వేయుటకు బస్టాండ్లు,రైల్వే స్టేషను,ముఖ్యమైన కూడలి ప్రాంతాలలో ఏర్పాట్లు చేయాలని సూచించారు.లైన్ డిపార్ట్మెంట్ అధికారులు సమన్వయంతో పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు.పోలియోపై ప్రజలకు అవగాహన కల్పించాలని,గ్రామాల్లో టాం-టాం ద్వారా పోలియో కార్యక్రమం నిర్వహించే తేదీలు,బూత్ వివరాలు ప్రజలకు తెలియ జేయాలని,మైక్ ల ద్వారా గ్రామాల్లో ప్రతి ఒక్కరికి పల్స్ పోలియో కార్యక్రమం గురించి తెలిసేలా విస్త్రుత ప్రచారం చేయాలనీ తెలిపారు.పల్స్ పోలియో కార్యక్రమం మార్చి3న ఆదివారం ఉన్నందున పోలియో బూత్ లను ముందుగానే సిద్ధం చేసి బూత్ లలో నీటి వసతి,కుర్చీలు,ఇతర అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలనీ,గ్రామాల్లో,మున్సిపాలిటీ లలో ఎక్కడేక్కడ బూత్ లు ఏర్పాటు చేశారనే సమాచారాన్ని ప్రజలకు ముందుగానే తెలియజేయాలని,బస్టాండ్,రైల్వే స్టేషన్ ఇతర రద్ది ప్రాంతాలలో పల్స్ పోలియో కార్యక్రమానికి సంబంధించిన బ్యానర్ లను ఏర్పాటుచేసి బూత్ వివరాలు,తేది,సమయం అన్ని వివరాలను తెలియపరచాలని అన్నారు.ఎస్.ఎచ్.జి గ్రూప్ ల ద్వారా అంగన్వాడి కేంద్రాలలో,ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ఉన్న ఐదేలల్లోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయించేలా అవగాహన కల్పించాలని,పిల్లల తల్లితండ్రులకు పోలియోపై అవగాహన కల్పించి పోలియో చుక్కలు వేయించాలని అన్నారు.జిల్లాలో అర్హత గల చిన్నారులందరికీ పోలియో చుక్కలు వేయించి,పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అధికారులను కోరారు.ఈ సమావేశంలో పెద్దపల్లి రెవెన్యూ డివిజన్ అధికారి సి.హెచ్.మధు మోహన్,పెద్దపల్లి మున్సిపల్ కమిషనర్ ఏ.వెంకటేశ్,సుల్తానాబాద్ మున్సిపల్ కమిషనర్ వేణు మాధవ్,జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ ప్రమోద్ కుమార్,జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రమాకాంత్,జిల్లా సంక్షేమ అధికారి రౌఫ్ ఖాన్,జిల్లా పంచాయతీ అధికారి ఆశాలత,డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ కృపాబాయ్,టిఎస్ ఆర్టిసి అధికారులు కె.ఆర్ రెడ్డి,లయన్స్ క్లబ్ సభ్యులు రాజగోపాల్,సంబంధిత అధికారులు,తదితరులు పాల్గొన్నారు.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: