తిమ్మాపూర్ మండల పరిధిలోని లోయర్ మానేరు డ్యాం జలాశయంలో గుర్తుతెలియని మహిళ మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. మృతదేహం పూర్తిగా ఉబ్బి గుర్తుపట్టలేని స్థితిలో ఉందని స్థానికులు పేర్కొన్నారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో, ఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Post A Comment: