ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;రానున్న పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డులోని ఈవీఎంల గోదాంల వద్ద ఈవీఎంల మొదటి దశ తనిఖీ ప్రక్రియ సోమవారం కొనసాగింది.
ఈవీఎంల గోదాంల వద్ద కొనసాగుతున్న ఈవీఎంల మొదటి దశ తనిఖీ ప్రక్రియను హనుమకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ పరిశీలించారు.
మొదటి దశ తనిఖీ ప్రక్రియలో భాగంగా గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈవీఎంలు, బ్యాలెట్ యూనిట్లు, కంట్రోల్ యూనిట్లు, వివి ప్యాట్లను ఈసీఐఎల్ ఇంజనీర్ల బృందం ఆధ్వర్యంలో తనిఖీ ప్రక్రియ కొనసాగుతుండగా జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ పరిశీలించి అదనపు కలెక్టర్ మహేందర్ జీ , హనుమకొండ ఆర్థివో ఎల్. రమేష్ లను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఈవీఎంల మొదటి దశ తనిఖీ ప్రక్రియను పూర్తి చేయగా, మంగళవారం ఉదయం వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఈసీఐఎల్ ఇంజనీర్ల సమక్షంలో మాక్ పోల్ ను నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కాజీపేట, నడికుడ, దామెర తహశీల్దార్లు ఇస్లావత్ బావ్ సింగ్, గుండాల నాగరాజు, జ్యోతి వరలక్ష్మి దేవి, కలెక్టరేట్ ఏవో సత్యనారాయణ, నాయబ్ తహశీల్దారులు సంతోష్, రామకృష్ణ, తదితరులతోపాటు వివి రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఈసీఐఎల్ ఇంజనీర్ల బృందం, ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు.
Post A Comment: