ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
పట్టు పరిశ్రమ రంగంలో రైతులు గణనీయమైన ప్రగతిని సాధించాలని
హనుమకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్
అన్నారు.
హనుమకొండలోని అంబేద్కర్ భవన్ లో ప్రాంతీయ పట్టు పరిశోధన కేంద్రం, కేంద్రీయ పట్టు మండలి, ములుగు, సిద్దిపేట జిల్లాలు, తెలంగాణ రాష్ట్ర పట్టు పరిశ్రమ శాఖ ఆధ్వర్యంలో పట్టు రైతులు, రీలర్లు, వీవర్ల సమ్మేళనం 'పట్టు కృషి మేళా' ను సోమవారం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి హనుమకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ముఖ్యఅతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వివిధ స్టాళ్లను కలెక్టర్ సందర్శించగా వాటిని గురించి అధికారులు వివరించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ మాట్లాడుతూ పట్టు పరిశ్రమలో గణనీయమైన ప్రగతిని సాధించి ఆదర్శంగా నిలవాలన్నారు. పట్టు పరిశ్రమ రంగంలో సాంకేతికతను వినియోగించుకుంటూ రైతులు అభివృద్ధి చెందాలన్నారు. పట్టు పరిశ్రమలను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తామన్నారు. పట్టు పరిశ్రమ రంగానికి సహకారం అందిస్తామన్నారు. సమావేశానికి రావడం సంతోషకరంగా ఉందన్నారు.
ఈ సందర్భంగా పట్టు పరిశ్రమ శాఖ జెడి లత మాట్లాడుతూ పట్టు పరిశ్రమల రంగంలో రైతులు లాభాలను గడిస్తున్నారని అన్నారు. నూతన సాంకేతిక పద్ధతులను తెలుసుకొని పట్టు రైతులు గణనీయమైన ప్రగతిని సాధిస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని పట్టు పరిశ్రమకు దేశంలోనే మంచి పేరు ఉందని అన్నారు. తెలంగాణలోని పది జిల్లాల్లో పట్టు పరిశ్రమ రంగం బాగుందని, మిగతా జిల్లాల్లో విస్తరించాల్సి ఉందన్నారు. మార్కెటింగ్ లో పట్టు రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపడతామన్నారు.
ఈ సందర్భంగా పట్టు పరిశ్రమ రంగంలో మంచి ప్రగతిని సాధించడానికి చేపట్టాల్సిన చర్యలపై శాస్త్రవేత్తలు, ఆదర్శ రైతులు, పట్టు పరిశ్రమ శాఖ అధికారులు పలు సలహాలు సూచనలు చేశారు.
ఈ కార్యక్రమంలో మైసూర్ లోని సిఎస్ఆర్టిఐ డైరెక్టర్ డాక్టర్ గాంధీదాస్, వరంగల్ జెడిఎస్ అనసూయ, డాక్టర్ వినోద్ కుమార్ యాదవ్, అధికారులు, పట్టు రైతులు, రీలర్లు, వీవర్లు పాల్గొన్నారు.
Post A Comment: