ఉరేసుకొని ఓ యువకుడు మృతి చెందిన ఘటన వేములవాడ మున్సిపల్ పరిధిలో జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. తిప్పాపూర్ శివారులో గురువారం చెట్టుకు ఉరేసుకొని యువకుడు మృతి చెందాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని వివరాలను సేకరిస్తున్నారు. మృతుడి వివరాలు, మృతి గల కారణాలు తెలియాల్సి ఉంది.
Post A Comment: