ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
సైన్స్, టెక్నాలజీ అనేది దేశ పురోగతికి ఎంతగానో దోహదపడుతుందని రాష్ట్ర పర్యావరణ, అటవీ, టెక్నాలజీ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎ. వాణిప్రసాద్ అన్నారు.
బుధవారం హనుమకొండ వడ్డేపల్లి లోని ప్రభుత్వ పింగిళి డిగ్రీ కళాశాలలో తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో జాతీయ సైన్స్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర పర్యావరణ, అటవీ, టెక్నాలజీ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎ. వాణిప్రసాద్, జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, తదితరులు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.
ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర పర్యావరణ,అటవీ,టెక్నాలజీ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ ఎ. వాణి ప్రసాద్ మాట్లాడుతూ జీవన విధానంలో సైన్స్ ఒక భాగమని అన్నారు. ఏదైనా ఒక విషయాన్ని లోతుగా తెలుసుకునేందుకు సైన్స్ అనేది తోడ్పడుతుందన్నారు. సైన్స్, టెక్నాలజీలో దేశం మరింత ముందుకెళ్తుందన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సైన్స్, టెక్నాలజీకి అధిక ప్రాధాన్యత నిస్తుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో సైన్స్, టెక్నాలజీని అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. పర్యావరణం పట్ల విద్యార్థులు ఆలోచింపజేసే విధంగా బాధ్యతలను గుర్తు చేశారని నాటిక, పాటలు పాడిన విద్యార్థులను ఉద్దేశించి అన్నారు. రాష్ట్ర స్థాయి పోటీలో వివిధ అంశాల్లో ప్రతిభ చూపిన విద్యార్థులకు అభినందనలు తెలిపారు.
ఆలోచింపజేసి... ఆకట్టుకున్న విద్యార్థులు
ఈ సందర్భంగా కళాశాల విద్యార్థిని శ్రీగౌరీ స్వాగత నృత్యం చేసి ఆకట్టుకున్నారు. గీసుకొండ కేజీబీవి విద్యార్ధినులు ప్లాస్టిక్ వినియోగంతో పర్యావరణంతో పాటు మానవాళి, జంతుజాలానికి కలుగుతున్న ముప్పును తెలియజేస్తూ ప్రదర్శించిన నాటిక అందరిని ఆలోచింపజేసేలా ఎంతగానో ఆకట్టుకుంది. ప్రభుత్వ ప్రాక్టీసింగ్ హై స్కూల్ విద్యార్ధినులు కాలుష్యంతో కలుగుతున్న దుష్పరిణామాలు తెలియజేస్తూ పాట పాడి అలరించారు. దేవురుప్పుల జడ్పీ పాఠశాల విద్యార్థులు మేడారం జాతర నిర్వహణపై వివిధ శాఖలతో నమూనా సమీక్షా సమావేశం నిర్వహించి ఆకట్టుకున్నారు. నారాయణపేట జిల్లా కు చెందిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని బుజ్జమ్మ ప్లాస్టిక్ ను వాడొద్దు అంటూ పాడిన గీతం ఆకట్టుకుంది.
ఈ సందర్భంగా సైన్స్ కు సంబంధించిన పలు ప్రాజెక్ట్ లను విద్యార్ధినులు ప్రదర్శించారు. ప్రాజెక్టుల ప్రయోజనాలను విద్యార్ధినులను ప్రిన్సిపల్ సెక్రెటరీ వాణి ప్రసాద్, కలెక్టర్ సిక్తా పట్నాయక్ అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా రాష్ట్రస్థాయిలో నిర్వహించిన చిత్రలేఖనం, వ్యాసరచన, ఉపన్యాస, తదితర అంశాల్లో పోటీలను నిర్వహించగా వరంగల్, పెద్దపల్లి, ఆదిలాబాద్, నిజామాబాదు, వికారాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, నారాయణపేట, నాగర్ కర్నూల్, కరీంనగర్, ఆసిఫాబాద్, రాజన్న సిరిసిల్ల, సంగారెడ్డి, సిద్దిపేట, తదితర జిల్లా లకి చెందిన విద్యార్థులకు ప్రిన్సిపల్ సెక్రటరీ వాణిప్రసాద్, కలెక్టర్ సిక్తా పట్నాయక్ అందజేశారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మెంబర్ సెక్రటరీ మారుపాక నగేష్, ప్రభుత్వ పింగిళి డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ బి. చంద్రమౌళి, కళాశాల అధ్యాపకులు, విద్యార్థులతో పాటు వివిధ కళాశాలలు, పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు, పాల్గొన్నారు.
*రీజినల్ సైన్స్ సెంటర్ ను సందర్శించిన రాష్ట్ర పర్యావరణ అటవీ టెక్నాలజీ ప్రిన్సిపల్ సెక్రెటరీ వాణి ప్రసాద్*
హనుమకొండ హంటర్ రోడ్డు జూ పార్క్ సమీపంలోని రీజనల్ సైన్స్ సెంటర్ ను రాష్ట్ర పర్యావరణ, అటవీ, టెక్నాలజీ ప్రిన్సిపల్ సెక్రెటరీ వాణి ప్రసాద్, జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ సందర్శించారు.
రీజినల్ సైన్స్ సెంటర్ లోని ఇన్నోవేషన్ ల్యాబ్ , రీసెర్చ్ సెంటర్, సైన్స్ గ్యాలరీని పరిశీలించగా వాటి వివరాలను సైన్స్ సెంటర్ ప్రాజెక్ట్ ఆఫీసర్ నితీష్ రెడ్డి, తదితరులు వివరించారు.
Post A Comment: