ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;ఎన్నికల్లో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు క్యాంపస్ అంబాసిడర్లు కృషి చేయాలని ట్రైనీ కలెక్టర్ శ్రద్ధ శుక్లా అన్నారు.
మంగళవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్ లో ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు లోక్ సభ ఎన్నికలు 2024పై క్యాంపస్ అంబాసిడర్లకు కొత్తగా ఓటర్ల నమోదు, ఓటింగ్ శాతాన్ని పెంచే వివిధ అంశాలపై శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సమావేశంలో ట్రైనీ కలెక్టర్ శ్రద్ధ శుక్లా మాట్లాడుతూ గత పార్లమెంట్ ఎన్నికల్లో వరంగల్ పశ్చిమ, పరకాల పరిధిలోని పలు పోలింగ్ కేంద్రాలలో ఓటింగ్ శాతం తక్కువగా నమోదయిందని, రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఆ పోలింగ్ కేంద్రాలలో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు ఓటర్లలో చైతన్యం తీసుకురావాలని క్యాంపస్ అంబాసిడర్లకు సూచించారు. అర్హులైన యువతను ఓటర్లుగా నమోదు చేయడంలో కీలకపాత్రను పోషించాలన్నారు.
ఈ సందర్భంగా కొత్తగా ఓటర్ల నమోదు, ఓటింగ్ శాతాన్ని పెంచే వివిధ అంశాలపై మాస్టర్ ట్రైనర్లు భాస్కర్ రెడ్డి , సుధాకర్ రెడ్డి క్యాంపస్ అంబాసిడర్లకు శిక్షణ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో ట్రైనీ ఐపీఎస్ శుభం నాగరాలే, డిపిఓ, స్వీప్ నోడల్ ఆఫీసర్ లక్ష్మీ రమాకాంత్, జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ ఎం. హరి ప్రసాద్, జిల్లాలోని వివిధ కళాశాలల విద్యార్థులు( క్యాంపస్ అంబాసిడర్లు)పాల్గొన్నారు.
Post A Comment: