ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;హనుమకొండ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో 25 అదనపు ఈవీఎంలు (కంట్రోల్ యూనిట్లు)మొదటి దశ తనిఖీ ప్రక్రియను రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో మంగళవారం నిర్వహించారు.
ఈ తనిఖీ ప్రక్రియను జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, అదనపు కలెక్టర్ మహేందర్ జీ పరిశీలించారు.
ఈ సందర్భంగా ఈసీఐఎల్ ఇంజనీర్ల ఆధ్వర్యంలో అదనపు ఈవీఎంల తనిఖీ ప్రక్రియ కొనసాగగా వాటి వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. తనిఖీ ప్రక్రియను పరిశీలించారు. తనిఖీ ప్రక్రియకు సంబంధించిన పలు రికార్డులను కలెక్టర్ పరిశీలించారు.
అదనపు ఈవీఎంల మొదటి దశ తనిఖీ ప్రక్రియ అనంతరం మాక్ పోలింగ్ ను అధికారులు నిర్వహించారు. ఈ ప్రక్రియ అనంతరం అదనపు ఈవీఎంలను పోలీస్ భద్రత మధ్య వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డులోని స్ట్రాంగ్ రూములకు తరలించారు.
ఈ సందర్భంగా కలెక్టరేట్ ఏవో కుసుమ సత్యనారాయణ, ఎన్నికల విభాగం సుపరింటెండెంట్ ఏవిఎన్వి ప్రసాదరావు, నాయబ్ తహసిల్దార్లు కొండూరి సంతోష్, జన్ను శ్యామ్, దేవులపల్లి రామకృష్ణ, ఎన్నికల సిబ్బంది అన్వేష్, రవి, తదితరులతోపాటు వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు నేహాల్, రజినీకాంత్, మణి, లక్ష్మణ్, సునీల్, జైపాల్ రెడ్డి, వెంకట్, సయ్యద్ ఫైజుల్లా పాల్గొన్నారు.
Post A Comment: