ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
ఈ నెల 21నుండి నాలుగు రోజుల పాటు ఆత్మకూరు మండలంలోని అగ్రంపహాడ్ సమ్మక్క సారలమ్మ జాతరకు అన్ని ఏర్పాట్లను శనివారం నాటికి పూర్తి చేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు.
హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలంలోని అగ్రంపహాడ్ జాతర పనులను జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ శుక్రవారం పరిశీలించారు.
జాతర కు వచ్చే భక్తుల కోసం జరుగుతున్న స్నాన ఘట్టాలను, పబ్లిక్ టాయిలెట్స్ పనులను కలెక్టర్ పరిశీలించారు. అదేవిధంగా వెహికల్ పార్కింగ్ ప్రదేశాలను పరిశీలించి పోలీస్ శాఖ వారికి తగు ఏర్పాట్లు చేయవలసిందిగా ఆదేశించారు. జాతర సమీపిస్తున్న నేపథ్యంలో అక్కడి ఏర్పాట్లు, పనులు చేపడుతున్న వివిధ శాఖలతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఏవైనా పనులు అసంపూర్తిగా ఉన్నట్లయితే వాటిని శనివారం నాటికి పూర్తి చేయవలసిందిగా సంబంధిత శాఖల అధికారులను కలెక్టర్ ఆదేశించారు. సమీక్ష సమావేశానికి ముందు అమ్మవార్లను కలెక్టర్ దర్శించుకున్నారు.
గ్రామంలోని నర్సరీని సందర్శించి నర్సరీలో పెంచుతున్న వివిధ రకాల మొక్కలను కలెక్టర్ పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో పరకాల ఆర్డీవో శ్రీనివాస్, ఏసీపీ కిషోర్ కుమార్, ఎంపీడీవో శ్రీనివాస్ రెడ్డి తహసిల్దార్ జగన్మోహన్ రెడ్డి, ఆత్మకూరు సిఐ సంతోష్, ఈవో శేషగిరి, పంచాయతీరాజ్ డిఇ లింగారెడ్డి, ఎస్ఆర్ఎస్పి డిఈ వేణుగోపాల్, ఎలక్ట్రిసిటీ ఏఈ రవికుమార్, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ సతీష్, ఏపీవో రాజిరెడ్డి, పంచాయతీ కార్యదర్శి బుచ్చిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: