ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ లో రానున్న పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలోని వివిధ శాఖల అధికారులతో నోడల్ కమిటీని ఏర్పాటు చేయగా మంగళవారం సాయంత్రం సన్నాహక సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ జిల్లాలో ఎన్నికలలో పాల్గొనే సిబ్బంది వివరాల ఆన్లైన్లో నమోదు, ఎన్నికల సిబ్బందికి ట్రైనింగ్, ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు స్విప్ ఆధ్వర్యంలో చేపట్టే కార్యక్రమాలు, ఎన్నికలకు సంబంధించిన ఫిర్యాదుల కోసం సెంటర్ ఏర్పాటు, ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు , ఎన్నికల పరిశీలకులు, ఎన్నికలకు సంబంధించిన తదితర అంశాలపై ఈ సందర్భంగా అధికారులతో చర్చించారు.
ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మహేందర్ జీ మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లపై జిల్లాలో పదహారు మంది నోడల్ అధికారులను నియమించినట్లు తెలిపారు.
ఈ సమావేశంలో డీఆర్వో వై. వి. గణేష్, వరంగల్ సెంట్రల్ జోన్ డీసీపీ ఎం.ఎ. భారీ, జడ్పీ సిఈఓ విద్యా లత, డిప్యూటీ సీఈవో రవి, డీటీసీ శ్రీనివాస్, ఆర్ అండ్ బి డీఈఈ సురేష్ బాబు, సిపివో సత్యనారాయణ రెడ్డి, అగ్రికల్చర్ జెడి రవీందర్ సింగ్, మైనింగ్ ఎడీ నర్సిరెడ్డి, స్వీప్ నోడల్ ఆఫీసర్ హరిప్రసాద్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Post A Comment: