ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని పోలీస్ స్టేషన్ అవరణలో నూతనంగా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ను బుధవారం ఎస్పీ కిరణ్ ఖరే, కలెక్టర్ భవేష్ మిశ్రా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ప్రారంభించారు. ఈ సందర్బంగా ఎస్పి కిరణ్ ఖరే IPS మాట్లాడుతూ భూపాలపల్లి పట్టణం గతంతో పోల్చుకుంటే ట్రాఫిక్ బాగా పెరిగిందని, పెరిగిన రద్దీ దృష్ట్యా, జరుగుతున్న ప్రమాదాలను దృష్టిలో ఉంచుకొని ట్రాఫిక్ పిఎస్ ను ఏర్పాటు చేసినట్లు ఎస్పీ తెలిపారు. జిల్లాలో సింగరేణి జేన్ కో, ఇసుక క్వారీలు ఉన్నాయని, దీంతో కొంత వాహన రద్దీ పెరిగిందని, ప్రమాదాల నివారణ కోసం ట్రాఫిక్ అవగాహనతో పాటు ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంటు నిర్వహిస్తున్నామని, నెంబర్ ప్లేట్ లేకుండా వాహనాలు నడపొద్దని, ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటిస్తూ ప్రమాదాల బారిన పడకుండా జాగ్రత్త వహించాలని అన్నారు. జిల్లాలో నూతనంగా ఏర్పాటు చేసిన ట్రాఫిక్ పిఎస్ లో ఒక ఎస్సై తో పాటు 18 మంది సిబ్బంది పని చేయనున్నారని ఎస్పి తెలిపారు. అలాగే ట్రాఫిక్ నియంత్రణ కోసం కొన్ని యంత్రాలు కొనుగోలు చేశామని రోడ్డు ప్రమాదంలో మరణాలు పెరుగుతున్నాయని ట్రాఫిక్ నియమ నిబంధనలు తప్పక పాటించాలని కోరారు. ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ అనేది జిల్లా ప్రజల కోసం ఏర్పాటు చేశామని ఎస్పీ పేర్కొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా కేంద్రం లో జనాభా గణనీయంగా పెరిగిందని, రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రజలు ట్రాఫిక్ రూల్స్ పాటించాలన్నారు. ట్రాఫిక్ పిఎస్ కోసం తమ వంతు సహకారం అందిస్తామని, పోలిసు శాఖతో సమన్వయంతో పనిచేస్తామని అన్నారు. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఎస్పి చొరవతో ఏర్పాటు చేయడం అభినందనీయమని, త్వరలోనే ప్రభుత్వం నుంచి అన్ని రకాల వనరులు సమకూరుస్తామని అన్నారు. జాతీయ రహదారులపై ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని, ప్రజలు ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పి ఏ. నరేష్ కుమార్, ఏఆర్ అడిషనల్ ఎస్పీ శ్రీనివాస్, భూపాలపల్లి డిఎస్పి రాములు, భూపాలపల్లి సిఐ నరేష్ కుమార్, ట్రాఫిక్ ఎస్ఐ శ్రీనివాస్, ఇతర అధికారులు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
Post A Comment: