ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;ఎన్నికలలో వినియోగించే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ల( ఈవీఎంల) గురించి ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు.
బుధవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లో రాబోయే లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ ( ఈవీఎం )ప్రదర్శన కేంద్రం వద్ద రిబ్బన్ కట్ చేసి జిల్లా కలెక్టర్ ప్రారంభించారు.
ఈవీఎం ప్రదర్శన కేంద్రం వద్ద వినియోగిస్తున్న ఈవీఎం పనితీరు గురించి , బ్యాలెట్ యూనిట్, కంట్రోల్ యూనిట్, వివి ప్యాట్ పనితీరు గురించి ఎన్నికల విభాగం అధికారులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఓటు వేసినప్పుడు ఈవీఎం పనితీరు గురించి ఈవీఎం ప్రదర్శన కేంద్రం వద్ద పలువురికి ఎన్నికల విభాగం అధికారులు, సిబ్బంది అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో డిఆర్ఓ వై. వి.గణేష్, ట్రైనీ కలెక్టర్ శ్రద్దా శుక్లా, సామాజిక వేత్త ఇ. వి. శ్రీనివాస్ రావు, హన్మకొండ తాసిల్దార్ విజయ్ కుమార్, ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ ప్రసాదరావు, అధికారులు సురేష్ కుమార్, సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: