ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;నగరాభివృద్ధికి అందరూ సహకరించాలని వరంగల్ పశ్చిమ నియోజకవర్గం శాసనసభ సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు.
హనుమకొండలో నగర మేయర్ గుండు సుధారాణి, మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ, తదితరులతో కలిసి ఏర్పాటుచేసిన సమావేశంలో ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ నగరాభివృద్ధికి
ఇక ముందు ఏ నిర్ణయాలు తీసుకున్న అందరితో కలిసి కొత్త ఆలోచనలతో ముందుకు సాగాలని నిర్ణయాలు తీసుకోవడం జరిగిందని అన్నారు. అభివృద్ధికి అడ్డంకులు సృష్టించడానికి కొందరు ప్రయత్నిస్తున్నారని, వారి పద్ధతిని మార్చుకోవాలన్నారు. ఇప్పటికైనా పద్ధతి మార్చుకొని అభివృద్ధికి సహకరించాలని కోరారు. గోపాల్ పూర్, ఇతర
చెరువులు,కుంటలు, నాలాలు చాలామంది కబ్జా చేసిన విషయం తమ దృష్టికి వచ్చిందని ఎమ్మెల్యే అన్నారు.
కబ్జా చేసిన వారు వాటిని ఏమాత్రం ఆలస్యం చేయకుండా తక్షణమే ప్రభుత్వానికి స్వచ్ఛందంగా అప్పగించాలని పేర్కొన్నారు. కబ్జా చేసిన వాటిని స్వచ్ఛందంగా ప్రభుత్వానికి అప్పగిస్తే గౌరవప్రదంగా ఉంటుందని, లేకుంటే చర్యలు తప్పవని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి హెచ్చరించారు.
Post A Comment: