ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి మాడుగుల శ్రీనివాసశర్మ 

హన్మకొండ ;

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డ్ లోని ఈవీఎం గోదాముల వద్ద ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ల మొదటి దశ తనిఖీ(ఎఫ్ఎల్సీ) ప్రక్రియ మంగళవారం రెండో రోజు కొనసాగింది.

రానున్న పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డ్ లోని  గోదాముల వద్ద రెండో రోజు కొనసాగుతున్న ఈవీఎంల ఎఫ్.ఎల్.సి ప్రక్రియను  హనుమకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, అదనపు కలెక్టర్ మహేందర్ జి, ట్రైనీ కలెక్టర్  శ్రద్ధా శుక్లా తో కలిసి పరిశీలించారు.

ఈ సందర్భంగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ల మొదటి దశ తనిఖీ ప్రక్రియలో ఈవీఎంల  బ్యాలెట్ యూనిట్లు, కంట్రోల్ యూనిట్లు, వివి ప్యాట్ల పనితీరును కలెక్టర్ పరిశీలించారు.

ఈ సందర్భంగా హనుమకొండ జిల్లా కలెక్టర్ సిక్తా నాయక్ మాట్లాడుతూ  రానున్న పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో భారత ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈవీఎంల  ఫస్ట్ లెవెల్ చెకింగ్ ప్రక్రియ ఈనెల  5 నుండి  12వ తేదీ వరకు కొనసాగనుందన్నారు. ఈవీఎంల మొదటి దశ  తనిఖీ ప్రక్రియ  వివిధ రాజకీయ పార్టీల  ప్రతినిధుల సమక్షంలో ఈసీఐఎల్ ఇంజనీర్ల ఆధ్వర్యంలో కొనసాగుతుందన్నారు. ఈవీఎంల మొదటి దశ తనిఖీ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

ఈ సందర్భంగా ఎఫ్ఎల్సిలో పాల్గొంటున్న అధికారులు, సాంకేతిక నిపుణులతో  మాట్లాడి ఇప్పటివరకు  చేపట్టిన ప్రక్రియను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా ఈవీఎంల  మొదటి దశ తనిఖీ ప్రక్రియ లో 755 బ్యాలెట్ యూనిట్లు, 628 కంట్రోల్ యూనిట్లు, 765 వివి ప్యాట్ల పనితీరును అధికారులు సాంకేతిక నిపుణులు తనిఖీ చేస్తున్నారు.

ఈ సందర్భంగా తహశీల్దార్లు బావ్ సింగ్, నాగరాజు, జ్యోతి వరలక్ష్మి దేవి, కలెక్టరేట్ ఏవో సత్యనారాయణ, నాయబ్ తహశీల్దార్లు సంతోష్, రామకృష్ణ, విఠలేశ్వర్, శ్యామ్,  ఎన్నికల విభాగం సిబ్బందితోపాటు ఈసీఐఎల్ ఇంజనీర్లు,  రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: