December 2022
Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ 


హన్మకొండ ;

ప్రస్తుత వరంగల్ బస్ స్టాండ్ ప్రాంతంలో స్మార్ట్ బస్ స్టేషన్ నిర్మాణ పనులు త్వరలో మొదలుపెడతామని తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్  

తెలిపారు.  కొత్త బస్ స్టేషన్ నిర్మాణంతో జిల్లా ప్రజలకు మెరుగైన సౌకర్యం అందుతుందని

నూతన బస్టాండ్ లో 32 ఫ్లాట్ ఫామ్స్ ఏర్పాటు చేస్తామన్నారు. 

అత్యంత సుందరంగా అన్ని హంగులతో నూతన బస్టాండ్ ఉండబోతుందని అన్నారు. 

అతిత్వరలో మున్సిపల్,ఐటి శాఖ మంత్రి కేటీఆర్ తో శంకుస్థాపన జరుగుతుందని ఎమ్మెల్యే తెలిపారు.

నూతన బస్ స్టేషన్ నిర్మాణానికి జీవో జారీ చేసిన సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్,రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కే.టీ.ఆర్  కు మరియు జిల్లా మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు,రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ కృతజ్ఞతలు తెలియజేశారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 

అంతర్గాం మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎనగందుల శ్రీకాంత్ ఆధ్వర్యంలో రామగుండం పట్టణంలోని తబిత ఆశ్రమంలో డిసెంబర్ 31 వేడుకలు ఘనంగా జరిగాయి*ఈ కార్యక్రమంలో హాజరైన కాంగ్రెస్ పార్టీ ఓబీసీసెల్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు పెండ్యాల మహేష్ తబిత ఆశ్రమ పిల్లలతో కలిసి కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేసి అనంతరం ఎనగందుల శ్రీకాంత్ ఆధ్వర్యంలో ఎనర్జీ డ్రింక్ పంపిణీ చేసిన అనంతరం పెండ్యాల మహేష్ మాట్లాడుతూ విదేశీ సంస్కృతికి వ్యతిరేకంగా వినూత్న రీతిలో ఆంగ్ల నూతనసంవత్సరానికి స్వాగతం పలకాలనే ఒక మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేయడం జరిగిందని ఆశ్రమంలోని పిల్లలందరికీ మేమున్నామనే భరోసాను కల్పిస్తూ రాబోయే ఆంగ్ల నూతన సంవత్సరం సందర్భంగా రామగుండం నియోజకవర్గ ప్రాంతంలోని సబ్బండ వర్గాలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసి రాబోయే సంవత్సరం అంతా కూడా ఎలక్షన్ సంవత్సరం కాబట్టి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి పెద్దపెల్లి జిల్లా పరిధిలోని మూడు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేసే విధంగా ప్రతి కార్యకర్త సన్నద్ధమై ఉండాలని పిలుపునిచ్చారు*ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు పెండ్యాల మహేష్ తో పాటు కార్యక్రమాల నిర్వాహకులు ఎనగందుల శ్రీకాంత్ కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ పెద్దపల్లి జిల్లా కన్వీనర్ మరీదు మురళీకృష్ణ గౌడ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సంఘన వేణి శేఖర్ ఊరేటి మహేష్ ఇందారపుసాయి పెండ్యాల వెంకటేష్ గుంట హనుమంతు బాలు ఆశ్రమ నిర్వాహకులు పిల్లలు తదితరులు పాల్గొన్నారు

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 

కాటారం మండలం ఒడిపలవంచ  గ్రామస్తులు సుమారు 100 మంది ఈరోజు బీజేపీ రాష్ట్ర నాయకులు చంద్రుపట్ల సునీల్ అన్న  సమక్షంలో పార్టీ లో చేరారు వీరికి సునిల్ అన్న కండువాలు వేసి పార్టీ లోకి ఆహ్వానించారు అనంతరం వారు మాట్లాడుతూ.....

ప్రధాని మోదీ  ప్రభుత్వం పేద, బడుగుల  అభ్యున్నతి కోసం పనిచేస్తుంది..గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి కేంద్రం నిధులు తోనే. గ్రామాలలో ఇంకుడు గుంతలు, రోడ్ లు, గ్రామ పంచాయతీ భవనాలు, హరితహారం, స్మశాన వాటికలు, ఎల్ యి డి లైట్స్ కేంద్రం ప్రభుత్వం ఇస్తుంది..

ప్రధాని ఆవాస్ యోజన పథకం మన రాష్ట్రలో వేస్తే ఇల్లు లేని ప్రతి పేదవానికి 3 లక్షలు వచ్చేవి కాని కెసిఆర్ అవి రాకుండా అడ్డుకున్నరు..

రానున్న రోజుల్లో బీజేపీ రాష్ట్ర లో  అధికారం లోకి వస్తుంది..దళిత బంధు పేరుచెప్పి అందరిని మోసం చేస్తుండు  అధికార పార్టీ కి చెందిన వారికి మాత్రమే ఇస్తున్నారు..

ఈకార్యక్రమంలో మండల అధ్యక్షులు బొమ్మన భాస్కర్ రెడ్డి, మహిళ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి ఉడుముల విజయ రెడ్డి, జిల్లా కోశాధికారి దుర్గం తిరుపతి, మండల ప్రధాన కార్యదర్శి గంట అంకయ్య,  ఎస్సీ మోర్చా జిల్లా కార్యదర్శి సకినారం శ్రీ హరి,మహిళ మోర్చా మండల అధ్యక్షురాలు నడిగొట్ట శ్రీవాణి, ఓబీసీ మండల అధ్యక్షులు జిల్లెల్ల శ్రీ శైలం, నాయకులు  వేముల లింగయ్య ఉడుముల వెంకట్ రెడ్డి, దోమల సమ్మయ్య,  వేముల రమేష్ తదితరులు పాల్గొన్నారు

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 


పాలకుర్తి ప్రెస్ భవన్ లొ మనతెలంగాణ 2023 నూతన సంవత్సర క్యాలండర్ ఆవీష్కరణ.

పాలకుర్తి మనతెలగాణ పాత్రీకేయులు,టీయూ డభ్ల్యూ జే (ఐజేయూ)పెద్దపల్లి జిల్లా దాడుల నిరోదక కమిటి కన్వినర్,ప్రతిష్టాత్మకమైన గోధావరిఖని ప్రెస్ క్లభ్ ఈసి మెంబర్,పాలకుర్తిప్రెస్ భవన్ గౌరవ అధ్యక్షులు సీపెల్లి రాజేశం అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలొ స్తానిక తహసీల్దార్ కటుకం వరందన్,అంతర్గాం జడ్పిటీసి ఆముల నారాయణ,పుట్నూర్ ఎంపిటీసి గంగాధరి రమేష్ గౌడ్,జీడినగర్ సర్పంచ్,కేశోరాం సిమెంటు కంపని కాంట్రాక్ట్ కార్మీకసంఘం అధ్యక్షుడు సూర సమ్మయ్య,కన్నాల మాజి సింగిల్ విండో చైర్మేన్ మల్క రామస్వామి,స్తానిక పాత్రీకేయులు,పాల్గొన్నారు

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ 



హన్మకొండ ;

వరంగల్ నగరం లోని రాధాకృష్ణ (మహేశ్వరీ) గార్డెన్స్ లో జరగనున్న త్యాగరాయ వార్షికోత్సవాల ను జయప్రదం చేయాలని పిలుపునిస్తూ స్టేషన్ రోడ్ లోని మహేశ్వరీ గార్డెన్స్ లో జరిగిన ప్రెస్ మీట్ కి ముఖ్య అతిధి గా వరంగల్ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, ప్రొఫెసర్ పాండు రంగారావు, భద్రకాళి శేషయ్య, తదితరులు హాజరై మాట్లాడారు.

ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ వరంగల్ కేంద్రం గా మొదటిసారి గా జనవరి 11,12,13 తేది లలో త్యాగరాజ సంకీర్తనలు నిర్వహించబోతున్నాం.

రిటైర్డ్ ప్రొఫెసర్ పాండురంగారావు, భద్రకాళి అమ్మవారి ప్రధాన పూజారి శేషయ్య లాంటి పెద్దల సహకారం తో విజయవంతానికి కృషి చేస్తా.

త్యాగరాజ కీర్తనలు మనిషిలో మంచిని ప్రేరేపించి సన్మార్గం లో నడిచేవిధంగా ఉపయోగపడుతాయి.

త్యాగరాజ కీర్తనలలో కవులు, కళాకారులు, మేధావులు, పెద్దలు హాజరై విజయవంతం చేయాలి.వరంగల్ ప్రజలు అధిక సంఖ్య లో వేలాది పాల్గొని జయప్రదం చేయాలి, ప్రజలు సహకరించాలి.

త్యాగరాజ సంకీర్తనల కోసం వచ్చే ప్రజలకు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తాం.

వరంగల్ లో వెంపటి కుటుంబం వారు ఏండ్ల తరబడి ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు, అటువంటి వారి ని మరింత ప్రోత్సాహించాలి, కళారంగాన్ని కాపాడుకోవాలి.

ఉర్సు గుట్ట వద్ద 1 ఎకరం లో కళాక్షేత్రం ఏర్పాటు చేసుకోబోతున్నాం. కళ లను కాపాడుకుంటాం.

గతంలో వరంగల్ కేంద్రం గా జరిగిన అనేక బహిరంగ సభలు, ప్రముఖుల రాక సందర్బంగా ఏర్పాట్లు చేసిన అనుభవాలు తో మరింత పాటిష్టంగా ఏర్పాట్లు చేస్తాం.

ఉమ్మడి రాష్ట్రం లో గత పాలకుల హయాంలో అభవృద్ధికి నోచుకోని వరంగల్, ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతుంది రాబోయే కాలం లో మరింత అభివృద్ధి చెందుతుంది, మరిన్ని వేడుకలు నిర్వహించుకోవడానికి ఆస్కారం ఉంటుంది.

కార్యక్రమం లో స్థానిక కార్పొరేటర్ గందె కల్పనా-నవీన్, వివిధ డివిజన్ ల కార్పొరేటర్లు, ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 


ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు భూషిపాక సంతోష్ మహారాజ్ ఆధ్వర్యంలో రామగుండం అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ గోదావరిఖని గిరి ప్రసాద్, ఆఫీస్ సిసి కి ,నాస్తిక సమాజం అధ్యక్షులు బైరి నరేష్ ఇతరుల మీద పిటిషన్ ఇవ్వడం జరిగింది, ఈ కార్యక్రమానికి *బిజెపి మల్కపూర్ మండలాధ్యక్షుడు మిట్టపల్లి సతీష్ కుమార్ హాజరై మాట్లాడుతూ హిందూ మతంపై. సంబంధిత వ్యక్తి మాట్లాడిన స్వరం చాలా అవమానకరంగా, దేవుళ్ళను కించపరిచేలా ఉంది,  అయ్యప్ప స్వామిని అవమానించడానికే జనం సర్ణమయ్యపా అంటూ జపిస్తున్నారు. దక్షిణ భారతదేశంలోని తెలంగాణా, ఆంధ్రప్రదేశ్, కర్నాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాలలో కోట్లాది మంది అయ్యప భక్తులు ఉన్నారు మహారాష్ట్ర ఒరిస్సాలోని కొన్ని ప్రాంతాలలో కూడా అయ్యప్పను పూజిస్తారు వారందరూ చాలా భక్తితో "శర్నమయ్యపా" అని జపిస్తారు. అని అన్నారు

*భూష్పక సంతోష్ మహారాజ్ మాట్లాడుతూ

 ఈ హిందూ దేశంలో ఉంటూ ఈ దేశ గాలి పీల్చుకుంటూ హిందూ ధర్మం పైన హిందూ సమాజం పైన హిందూ సంస్కృతి పైన, మా దేవుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ను అడ్డం పెట్టుకోని అయ్యప్ప స్వామీ కించపడటం దారుణమైన విషయం విదేశీ విదేశీ మతాల తొత్తులుగా మోచేయి మోకాళ్ళ నీళ్లు తాగుతూ, అంబేద్కర్ ముసుగులో ఆది హిందూ దళితులను అవమానపరచడం దారుణమైన విషయము, ఈ దేశానికి మూలపురుషుడు ఆది జాంబవంతుడు, ఆది జాంబవంతుడు రాజ్యం నడిచింది,దేశానికి హిందుత్వానికి ఐకాన్ మేమే, రాబోయే రోజులలో ప్రపంచ మేధావి భారత రాజ్యాంగ నిర్మాత కర్త, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ను  అడ్డం పెట్టుకొని,హిందూ ధర్మం పైన ఎవరైనా వ్యాఖ్యలు చేస్తే ఇకమీదట వదిలిపెట్టే ప్రసక్తే లేదు, భారత రాజ్యాంగం మీద మాకు నమ్మకం ఉంది, సనాతన విశ్వాసులకు బాధ  మానసిక గాయం ఏర్పడింది. శివుడు, విష్ణుమూర్తి; భగవాన్ అయ్యప్ప స్వశాంతి, సామరస్యానికి విఘాతం కలిగిస్తుంది. మతం పేరుతో వర్గాల మధ్య శత్రుత్వాన్ని పెంచి, సమాజంలో మత సామరస్యానికి విఘాతం కలిగించినందుకు భారత నాస్తిక సమాజం అధ్యక్షుడు బైరి నరేష్, ఇతరులపై అవసరమైన చర్యలు తీసుకోవాలని, ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి, పక్షాన డిమాండ్ చేస్తూన్నం ఈ కార్యక్రమంలో *ఎస్సిఆర్పిఎస్ జిల్లా ఉపాధ్యక్షులు అసంపెల్లి ఉదయ్ కిరణ్, కొత్తురి రామ్, లక్ష్మణ్, మాచర్ల అశోక్, ఎస్సీఆర్పిఎస్ జిల్లా యూత్ కార్యదర్శి మాలెం మధు ఇదునూరు శ్రీకాంత్,సుందిళ్ల రాకేష్, సాయి, ప్రేమ్ కుమార్, రమేష్, రాజేష్

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ 



హన్మకొండ ;

రాష్ట్రంలో పంచాయతీ రోడ్లు అద్దంలా ఉండాలని, వర్షాకాలంలో మొదటి వర్షం పడేటప్పటికీ ఏ ఒక్క రోడ్డు మీద గుంత కనిపించవద్దని, దెబ్బతిన్న రోడ్లన్ని బాగు కావాలని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి మరియు గ్రామీణ నీటి సరఫరాల శాఖ మంత్రి  ఎర్రబెల్లి దయాకర్ రావు అధికారులను ఆదేశించారు.

  ముఖ్యమంత్రి  కేసిఆర్  ఇటీవల రాష్ట్రంలోని రోడ్ల మీద సమీక్ష చేసి, రోడ్లపై గుంతలు ఉండకుండా, రోడ్లన్ని బాగుండేలా చర్యలు చేపట్టాలని ఆదేశించిన నేపథ్యంలో వరుసగా సమీక్షలు చేస్తున్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు  నేడు మరోసారి రంగారెడ్డి జిల్లా పరిషత్ కార్యాలయంలోని మంత్రి ఛాంబర్లో అన్ని జిల్లాల సూపరింటెండెంట్ ఇంజనీర్లతో నేడు సమావేశమయ్యారు. అనంతరం అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, జిల్లా పంచాయతీ ఆఫీసర్లు, మండల పంచాయతీ ఆఫీసర్లు, డిఆర్ఢిఓ అధికారులతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. మొదటగా అధికారులు, సిబ్బందికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రి కేసిఆర్ గారి ఆలోచనల మేరకు అధికారులు, సిబ్బంది బాగా పనిచేయడం వల్ల మన శాఖకు మంచి పేరు వచ్చిందని, జాతీయ స్థాయిలో అనేక అవార్డులు వచ్చాయని గుర్తు చేశారు. ఈ స్పూర్తిని ఇదేవిధంగా కొనసాగించాలని కోరారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం కావాలని రాష్ట్రానికి నిధులు విడుదల చేయకపోవడం వల్ల ఆర్ధికంగా కొంత ఇబ్బంది ఏర్పడిందన్నారు. మనకు కేంద్రం నుంచి 1100 కోట్ల రూపాయలు రావల్సి ఉండగా ఇవ్వడం లేదన్నారు. రైతు కల్లాల కోసం 151 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం తప్పుగా భావించి మనకు రావాల్సిన 1100 కోట్ల రూపాయలను కేంద్రం ఆపడాన్ని విమర్శించారు. ఈ విషయాన్ని అధికారులు, సర్పంచులు అర్థం చేసుకోవాలని చెప్పారు. కేంద్రం ఇస్తున్న గ్రాంట్ కు సమానంగా గ్రాంట్ ఇస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణదే అన్నారు. సర్పంచ్ లకు అన్ని విధాల అధికారాలు ఇచ్చామన్నారు.కొంతమంది సర్పంచులు కూడా ప్రభుత్వం చేస్తున్న పనులను గుర్తించకుండా అనవసరంగా బిజెపి ట్రాప్ లో పడి ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక పంచాయతీలకు గత 8 ఏళ్లలో వచ్చిన నిధులు అంతకుముందు 50 ఏళ్లలో కూడా రాలేదన్నారు. ఈ విషయంలో అధికారులు సర్పంచులకు అవగాహన కల్పించాలని సూచించారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చాక ఒక గ్రామంలో పెన్షన్లు, రైతు బంధు, రైతుబీమా, కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్, కేసిఆర్ కిట్ వంటి ముఖ్య పథకాల లబ్దిదారులు, ప్రతి నెల వచ్చే మొత్తం, తెలంగాణ వచ్చాక ఆ గ్రామానికి అందిన మొత్తం వివరాలతో ప్రతి పంచాయతీలో బోర్డులు చేసి పెట్టించాలని అధికారులను ఆదేశించారు.

గ్రామ పంచాయతీ భవానాలకు ఇటీవల మంజూరు చేసిన 3686 భవనాల నిర్మాణం వేగవంతం చేయాలని ఆదేశించారు.

ప్రతి గ్రామంలో వైకుంఠదామాలు, ప్రకృతి వనాలు, డంపింగ్ యార్డులు పూర్తి స్థాయిలో వినియోగంలోకి రావాలని చెప్పారు. ప్రతి నియోజక వర్గానికి 5 కోట్ల రూపాయలతో రోడ్ల ప్రతిపాదనలు ఇవ్వాలన్న జాబితా వెంటనే ఇవ్వాలని ఆదేశించారు. ఈ కాన్ఫరెన్సులో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి కార్యదర్శి సందీప్ సుల్తానియా, ఇంజనీర్ ఇన్ చీఫ్ సంజీవ రావు, కమిషనర్ హనుమంతరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ 

హన్మకొండ ;

అయ్యప్పస్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఓయూ విద్యార్థి, నాస్తిక సంఘం అధ్యక్షుడు భైరి నరేష్‌ను వరంగల్ లో పోలీసులు అరెస్ట్ చేశారు. ఇటీవల కొడగల్‌లో జరిగిన ఓ సభలో బహిరంగంగా అయ్యప్పస్వామిపై భైరి నరేష్ అసభ్యకర వ్యాఖ్యలు చేశాడు. బహిరంగ సభలో అందరి ముందు అయ్యప్పస్వామిని కించపరుస్తూ దారుణమైన వ్యాఖ్యలు చేశాడు. ఈ వ్యాఖ్యలపై అయ్యప్ప స్వాములు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా నరేష్‌పై 16 ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. ఈ క్రమంలో గాలింపు చర్యలు చేపట్టి పరారీలో ఉన్న భైరి నరేష్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా భైరి నరేష్‌ను ట్రేస్ చేసిన పోలీసులు కమలాపూర్‌లోని ఓ హోటల్‌లో నరేష్‌ను అదుపులోకి తీసుకున్నారు. కాసేపట్లో భైరి నరేష్‌ను కొడంగల్‌కు పోలీసులు తరలించనున్నారు. భైరి నరేష్ అరెస్ట్‌పై వికారాబాద్ ఎస్పీ కోటిరెడ్డి ప్రకటన విడుదల చేశారు. నరేష్‌పై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని, అయ్యప్పస్వాములు ఆందోళనలు విరమించాలని ఎస్పీ కోరారు. భైరి నరేష్‌ను అరెస్ట్ చేయాలని రెండు రోజులుగా అయ్యప్ప స్వాములు ఆందోళనలు చేస్తుండటంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. శుక్రవారం అయ్యప్ప స్వాములు ఆందోళనలు చేస్తున్న క్రమంలో దానిని వీడియో చిత్రీకరించడానికి వచ్చిన భైరి నరేష్‌ అనుచరుడు బాలరాజును చితకబాదారు. అయ్యప్పస్వాముల దాడిలో గాయపడిన బాలరాజును పోలీసులు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి నిలకడగా ఉందని తెలుస్తోంది.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ

 

హన్మకొండ ;

 ప్రజల రక్షణ, పోలీసుల ధ్యేయంగా జిల్లా పోలీసులు అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ  జె. సురేందర్ రెడ్డి అన్నారు. శనివారం జిల్లా పోలీసు వార్షిక నేర నివేదిక రిపోర్టును  విడుదల చేశారు. సంవత్సర కాలంగా జిల్లా పోలీసుల విజయాలు, సేవలు, నమోదైన కేసుల గణాంకాలను  ఎస్పి  తెలిపారు.  ప్రాణహిత పుష్కరాలను ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా పోలీసులు సమర్థవంతంగా విధులు నిర్వర్తించారని, అలాగే గోదావరి వరదల సమయంలో పోలీసు అధికారులు, సిబ్బంది అహర్నిశలు పనిచేశారని పేర్కొన్నారు. కమ్యూనిటీ పోలీసింగ్ లో భాగంగా పలిమెల మండలంలో గోదావరి వరద పరివాహ ప్రాంతాలకు అండగా నిలిచామని  అన్నారు. అంతేకాకుండా జిల్లాలో మావోయిస్టులు ఎలాంటి హింసాత్మక సంఘటనలకు దిగకుండా పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నట్టు ఎస్పీ  వెల్లడించారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

మహాదేవపూర్ మండల ప్రతినిధి/దూది శ్రీనివాస్ 


మహాదేవపూర్: నిబంధనలను పాటిస్తూ కొత్త సంవత్సర వేడుకలను జరుపుకోవాలని వరంగల్ పోలీస్ కమిషనర్ ప్రజలకు సూచించారు.తీపిగుర్తులతో గడిచిపోతున్న 2022 సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ,రానున్న 2023 సంవత్సరానికి ఆనందంగా స్వాగతం పలికే వేళ ప్రజలు జాగ్రత్తలు, నియమనిబంధనలు పాటించాలని,గతంలో జరిగిన సంఘటనలను దృష్టిలో ఉంచుకొని,రేపటి రోజున ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో రాత్రి 9గంటలనుండి,మరుసటి రోజు తెల్లవారుజామున మూడు గంటల వరకు ముమ్మరంగా వాహన తనీఖీలు నిర్వహించడంతో పాటు,డ్రంక్ డ్రైవ్ తనీఖీలు నిర్వహిస్తామని,ఇందుకోసం ట్రై నీటి పరిధిలో మొత్తం యాభైకి పైగా వాహన తనిఖీ పాయింట్లను ఏర్పాటు చేయడం జరిగిందని, ఇందుకోసం ప్రత్యేక పోలీస్ బృందాలను కూడా ఏర్పాటు చేయడం జరుగుతోందని, కావున ప్రజలు,యువకులు మద్యం సేవించి వాహనం నడపరాదని,మైనర్లకు ఎట్టి పరిస్థితుల్లో వాహన డ్రైవింగ్ అనుమతించకూడదని, త్రిబుల్ రైడింగ్,అతివేగంగా వాహనాలను నడపడంతో పాటు సైలెన్సర్ తొలగించి వాహనాలను నడపటం లాంటి చర్యలకు పాల్పడితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని, 

అలాగే వాణిజ్య సముదాయాలు నిర్ధేశించిన సమయానికి మూసివేయాలని,డీజేలు, ఇతర శబ్ధ కాలుష్యాన్ని ఏర్పరిచి ఇతరులకు ఇబ్బంది కలిగించే వాటికి అనుమతి లేదని కమిషనర్ తెలిపారు. కోవిడ్ కొత్త వేరియంట్ ప్రమాదం పొంచి వున్నందున పబ్లిక్ ప్రదేశాల్లో,ప్రధాన రోడ్డు మార్గాల్లో నూతన సంవత్సర వేడుకలను నిర్వహించుకోరాదని,కొవిడ్ కొత్త వేరియంట్ ముప్పు పొంచి వున్నందున వీలైనంత వరకు ప్రజలు తమ కుటుంబ సభ్యులతో కలిసి సంతోషాల నడుమ ఇండ్లల్లోనే నూతన సంవత్సర వేడుకలను నిర్వహించుకోవాలని, పోలీస్ కమిషనర్ ప్రజలకు సూచిస్తూ,వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ప్రజలందరికీ ముందుగా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలను తెలియజేసారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ 


హన్మకొండ ;

డిసెంబర్ 31 వేడుకలు జరుపుకునే వారు ప్రమాదాలకు దూరంగా ఉంటూ, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతి యుతమైన ప్రశాంత వాతావరణంలో వేడుకలు జరుపుకోవాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పి   జె. సురేందర్ రెడ్డి  శుక్రవారం  కోరారు.  జిల్లా ప్రజలందరికీ  ముందస్తుగా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలను ఎస్పి  తెలియజేశారు. 2023 సంవత్సరం లో అందరికీ శుభం కలగాలని అన్నారు. ఇతరుల  మనోభావాలు దెబ్బతినకుండా, ఆకతాయి పనులకు పాల్పడకుండా, యువత వేడుకలు జరుపుకోవాలని కోరారు. 

మద్యం దుకాణాలు, వైన్ షాప్స్, బార్స్, రెస్టారెంట్స్ ప్రభుత్వo అనుమతించిన సమయపాలన పాటించాలని,31వ తేది న స్పెషల్ డ్రంకెన్ డ్రైవ్ నిర్వహిస్తామనీ, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించ రాదని, డ్రంక్ అండ్ డ్రైవ్ చేసే వారిని అదుపులొకి  తీసుకుని  చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 

ట్రిబుల్ రైడింగ్, రాంగ్ రూట్, హెల్మెట్ లేకుండ వాహనం నడిపితే చట్ట పరమైన చర్యలు తప్పవన్నారు. ప్రజలు, యువత  రక్షణ కోసమే భద్రత చర్యలు చేపట్టడం జరుగుతుందని ఎస్పి  పేర్కొన్నారు.  మహిళలను  వేధిoపులకు గురి చేస్తూ, ఇబ్బందులను పెట్టే వారిపై ఎప్పడికప్పుడు పర్యవేక్షణ చేయడం జరుగుతుందనీ, డి.జే లను ఉపయోగించడం, మరియు నిబంధనలు అతిక్రమిస్తే చట్ట పరమైన చర్యలు తప్పవనీ,

 ముఖ్యంగా యువత పై కేసు నమాదైతే భవిషత్తులో ప్రభుత్వ ఉద్యోగాలు, విదేశాలకు వెళ్ళేటప్పుడు  ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని అన్నారు. తల్లిదండ్రులు పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు.

ప్రజలు, యువత పోలీసుల   సూచనలు పాటిస్తూ,  సహకరించాలనీ ఎస్పి  కోరారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 BIG BREAKING: 





ప్రధాని నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్ (100) ఇక లేరు. వందేళ్ల వయసున్న ఆమె అహ్మదాబాద్ నివాసంలో 2 రోజుల క్రితం అస్వస్థతకు గురయ్యారు. యూఎన్ మెహతా ఆసుపత్రికి తరలించి, చికిత్స అందించారు. వయోసంబంధ సమస్యలతో చికిత్స ఫలించకపోవడంతో కాసేపటి క్రితం తుదిశ్వాస విడిచారు. ఈ ఏడాది జూన్లోనే హీరాబెన్ 100 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఓం శాంతి..!

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 


గోదావరిఖని*స్థానికలక్ష్మీపురంలో

మోతుకు రాజేశం చనిపోగా వారి కుటుంబాన్ని పరమర్శించి అనంతరం చిత్రపటానికి పూలమాలాలు వేసి నివాళ్లు అర్పించారు ,బొడ్డుపల్లి రాయమల్లు తల్లి మరణించగా వారి నివాసానికి వెళ్లి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలపారు,

కత్తుల శ్రీనివాస్ మరణించగా వారి కుటుంబాన్ని పరామర్శించి  25 కిలోల రైస్ బాగ్ ఆర్థిక సహాయం చేశారు,

ఆయుధాల సదానందం అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలుసుకొని వారి నివాసానికి వెళ్లి పరామర్శించి ఆర్థిక సహాయం అందించారు,

*బాధిత కుటుంబాలను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపి ఆర్థిక సహాయాలు చేసిన పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ 


హన్మకొండ ;

వరంగల్ పోస్ట్ ఆఫీస్ వద్ద ఏర్పాటు చేసిన తెలంగాణ ఆటో యూనియన్ అడ్డా ను తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ప్రారంభించారు .

    ఈ సందర్బంగా ఎమ్మెల్యే నరేందర్ మాట్లాడుతూ కార్మికుల సంక్షేమమే ఎజెండాగా ముఖ్యమంత్రి కేసీఆర్ పనిచేస్తున్నారని అన్నారు. తాను కార్మికుని కొడుకునేనని వారి కష్టాలు నాకు తెలుసున్నారు. ఆటో కార్మికుల అందరికి ప్రతి కష్టం లోను అండగా ఉంటానని ఎమ్మెల్యే తెలిపారు.

ఈ కార్యక్రమం లో డివిజన్ కార్పోరేటర్ గందె కల్పన -నవీన్, కార్పోరేటర్ చింతాకుల అనిల్, కార్పోరేటర్ సురేష్ జోషి,కార్పొరేటర్ వస్కుల బాబు,సునీల్, మాజీ మార్కెట్ చైర్మన్ టి. రమేష్ బాబు, మాజీ కార్పొరేటర్ జారతి రమేష్, బీఆర్ఎస్ నాయకులు,కార్మికులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 


ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ లిస్టులో పేర్ల అవతవకలకు మరొక్క అవకాశం ఇవ్వండి.అని పెద్దపెల్లి ఆర్డీవో ను నిమ్మ రాజుల రవి కోరారు లింగాపూర్  ఎస్సి కాలిని లో  ఎమ్మార్వో అధ్యక్షతన పెద్దపల్లి ఆర్డీఓ ముఖ్య అతిధిగా పాల్గొన్న  గ్రామ సభలో  సింగరేణి ప్రభావిత ప్రాంతం ఎస్సి కాలినికి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇచ్చి పునరావాసం తొందరగా కలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో అంతర్గాం జెడ్పిటిసి ఆముల నారాయణ ఎక్కడ లింగాపూర్ మాజీ ఎంపీటీసీ ఇరికిల్ల పద్మ శంకరయ్య మరియు లింగాపూర్ గ్రామ ప్రజలు పాల్గొన్నారు

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్                


బెల్లంపల్లి నియోజకవర్గము వంద పడకల ఆసుపత్రి ప్రారంభోత్సవ కార్యక్రమానికి వచ్చిన సందర్భంగా, నిబంధ నల ప్రకారం హిందూ షెడ్యూల్డ్ కులానికి న్యాయం చేయాలని *ఎస్సీ రిజర్వేషన్ పరీరక్షణ సమితి పెద్దపెల్లి జిల్లా అధ్యక్షులు భుష్పక సంతోష్ మహారాజ్  ఆధ్వర్యంలో *తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రివర్యులు తన్నీరు హరీష్ రావు కు వినతి పత్రం అందజేశారు బుషిపాక సంతోష్ మాట్లాడుతూ భారత రాజ్యాంగం ఆర్టికల్ క్రింద షెడ్యూల్డ్ కులాలకు కొన్ని లబ్దిదారులు నిబంధనలను సూచించిందని తెలిపారు.. భారత రాజ్యాంగంలోని 14, 16(4), 17 & 341, పై నిబం ధనలకు అనుగుణంగా, భారత ప్రభుత్వం అలాగే ఆయా రాష్ట్రాల రాష్ట్ర ప్రభుత్వాలు షెడ్యూల్డ్ కులాల ప్రజల సంక్షేమం కోసం లబ్ధిదారుల శాసనసభను రూపొందిం చాయన్నారు. విద్య, ఉపాధి ఇతర జీవనోపాధికి సంబం ధించిన రంగాలు, అలాగే సమాజంలో వారి అభ్యున్నతి, తద్వారా వారిని ముందున్న కులాలతో సమానంగా చూడడానికి వీలు కల్పిస్తుందని. పైన పేర్కొన్న నిబంధ నల ప్రకారం, షెడ్యూల్డ్ కులాలకు చెందిన వ్యక్తులకు కుల ధృవీకరణ పత్రాలను నిర్ధారించడం జారీ చేయడం వ్యక్తిగతంగా ప్రత్యేకించి రెవెన్యూ డిపార్ట్మెంట్ గా అధి కారులపై విధించబడిన బాధ్యత అని నేను వినతి సమర్పిస్తు న్నామన్నారు. ఈ విషయంలో, ఒక వ్యక్తి యొక్క కులం యొక్క వాస్తవికతను నిర్ధారించడం కోసం, సంబంధిత అధికారికి ఆ వ్యక్తి హిందూ షెడ్యూల్డ్ కులమా లేదా ఆ వ్యక్తి కార్యదర్శిగా మార్చబడ్డాడా అనే సత్యాన్ని వెలికి తీయడం తప్పనిసరి అని సమర్పించడం సంబంధితంగా ఉంటుంది. హిందూ మతం కాకుండా మరే ఇతర మతం అయినా ఇస్లాం లేదా క్రైస్తవం అంటుంది. ఆర్టికల్ 341 ద్వారా నిర్దేశించబడిన 1950 ప్రెసిడెన్షియల్ (షెడ్యూల్డ్ కులాల) ఉత్తర్వు ప్రకారం, షెడ్యూల్డ్ కులాలకు చెందిన వ్యక్తి హిందూ మతం, బౌద్ధమతం లేదా సిక్కు మతం కాకుండా మరే ఇతర మతంలోకి మారితే అతన్ని BC C అభ్యర్థిగా పరిగణించాలి ( G.O.Ms.No.1793.ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, తేదీ: 23.09.1970) కానీ షెడ్యూల్డ్ కులంగా కాదు వాయిదా శాసనసభ యొక్క పై తప్పనిసరి ప్రిస్క్రిప్షన్లు మరియు దాని కార్యనిర్వాహక సూచనలకు అధికారులు వీడ్కోలు ఇచ్చారని ఇతర మతాలలోకి ముఖ్యంగా క్రైస్తవ మతంలోకి మారిన వ్యక్తులకు ఎస్సీ సర్టిఫికేట్లను జారీ చేశారని నేను సమర్పి స్తున్నాను. హిందూ మతానికి చెందిన షెడ్యూల్డ్ కులం ఉద్యోగాలు, విద్య మరియు పంచాయతీల స్థాయి నుండి పార్లమెంటు వరకు ఎన్నికలలో పోటీ వంటి అన్ని అంశాలలో మొత్తం వివక్ష, లేమి మాత్రమే ఉంది. అయితే వాస్తవాన్ని అంచనా వేయడంలో రెవెన్యూ శాఖ సరైన ధృవీకరణ లేకపోవడం వల్ల హిందూ మతానికి చెందిన షెడ్యూల్డ్ కులం లేదా వారికి అనుకూలంగా రాజ్యాంగం మరియు ఇతర చట్టాల ప్రయోజనాలను కోల్పోయింది. ఇతర మతాలలోకి మరీ ముఖ్యంగా క్రైస్తవ మతంలోకి మారిన మోసపూరిత వ్యక్తులకు కుల ధృవీక రణ పత్రాలు ఇచ్చే ముందు షెడ్యూల్డ్ కులాల వాస్తవిక తను నిర్ధారించి, ఆ సర్వేను నిర్వహించేలా రాష్ట్ర ప్రభుత్వ సాధనాలను, మరీ ముఖ్యంగా రెవెన్యూ శాఖను ఆదేశిం చవలసిందిగా అభ్యర్థిస్తున్నాను. షెడ్యూల్డ్ కులాల మూల్యాంకనం కోసం సర్వే ద్వారా మాత్రమే హిందూ సమాజానికి జారీ చేయబడిన మోసపూరిత ఎస్సీ సర్టిఫికేట్లను రద్దు చేయ డానికి అవసరమైతే, ఇతర మతానికి మారిన షెడ్యూల్డ్ కులాన్ని మినహాయించడం ద్వారా మాత్రమే హిందూ సమాజానికి చెందినది షెడ్యూల్డ్ కులాల జనాభాపై ఒక నిర్ధారణకు వస్తుంది హిందూ మతానికి మరియు భారత రాజ్యాంగంలోని నిబంధనలకు అనుగుణంగా ప్రయోజ నాలను వినతి పత్రంలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో. నాయకులు కొత్తూరు లక్ష్మణ్, మాచర్ల అశోక్, రాళ్ల బండి శేఖర్, ఏ గంట ప్రవీణ్ బెజ్జంకి శ్రీనివాస్, తదితరులు  పాల్గొన్నారు

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

మహాదేవపూర్ మండల ప్రతినిధి/దూది శ్రీనివాస్ 

మహాదేవపూర్:తెలంగాణ టెన్త్ పరీక్షలపై విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కీలక ప్రకటన చేశారు. పరీక్షల్లో వ్యాసరూప ప్రశ్నలకు మాత్రమే ఇంటర్నల్ ఛాయిస్ ఉంటుందని,సూక్ష్మరూప ప్రశ్నలకు ఛాయిస్ లేదని వెల్లడించారు.త్వరలో వెబ్సైటులో మోడల్ ప్రశ్న పత్రాలు విద్యార్థులకు అందుబాటులో ఉంటాయని తెలిపారు.పదవ తరగతి విద్యార్థులకు సెలవు రోజుల్లోనూ ప్రత్యేకంగా క్లాసులు చెప్పాలి.ఏదైనా సబ్జెక్టుల్లో వెనుకబడిన వారిని గుర్తించి ప్రత్యేకంగా బోధన చేయాలని సూచించారు. ఫిబ్రవరి,మార్చిలో ప్రీ ఫైనల్ పరీక్షలు నిర్వహించాలని అన్నారు.ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా,ఉత్తీర్ణత శాతం సాధించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 


సింగరేణి OB కాంట్రాక్ట్ కార్మికులకు మద్దతుగా కార్మికుల వేతనాల పెంపు కొరకై డ్రైవర్స్ బ్లాస్టింగ్ కార్మికులు హెల్పర్స్ సూపర్వైజర్స్ వివిధ సెక్షన్లలో పనిచేస్తున్న కార్మికులకు వేతనాలు పెంచాలని లేదంటే కార్మికుల కోసం ఎంతటి పోరాటంకైనా సిద్ధమంటున్న బిజెపి నేత కౌశిక హరి..ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు ముస్త్యాల సర్పంచ్ లావణ్య ,నాగరాజు, మహావతి రామన్న, గోగుల రవీందర్, విజయ్, ముకిరి రాజు, దిగుట్ల లింగయ్య, అడ్డూరి రాజేష్, పున్నం శశి కుమార్, శ్రీనివాస్ యాదవ్, బైరం రవి వర్మ, నిమ్మ రాజుల రవి, షాడవేణి రాజు,  నవీన్ ,మల్లిపూడి ప్రతాప్ రాజు, బబ్బెర తిరుపతి, గంగా ప్రసాద్, మేకల మల్లేష్, సిద్దేశ్వర్, సాయి, కందుకూరి రాజు, పులి శ్రీను, ప్రశాంత్, శ్రీనివాస్, అనిల్, ప్రవీణ్, మోహన్, తదితర నాయకులు కాంట్రాక్ట్ కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగినది.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 

రామగుండం కార్పొరేషన్ పరిధిలో 23 వ డివిజన్ కాకతీయ నగర్ కు చెందిన మదావత్ శివయ్య నాయక్ అనే నిరుపేద కుటుంబానికి మడిపెల్లి మల్లేష్ ఆధ్వర్యంలో ఫౌండేషన్ సభ్యుల సహకారంతో  25 కిలోల బియ్యం నిత్యావసర సరుకులను సేవా స్ఫూర్తి ఫౌండేషన్ సభ్యులు ఠాగూర్ నాయక్ స్థానిక కాకతీయ నగర్ లోని బాధిత కుటుంబానికి అందజేశారు అనంతరం ఠాగూర్ నాయక్ మాట్లాడుతూ మదావత్ శివయ్య నాయక్ కుటుంబ పరిస్థితిని సేవ స్ఫూర్తి ఫౌండేషన్ అధ్యక్షులు మడిపెల్లి మల్లేష్ కు తెలుపగానే వెంటనే స్పందించి మా ద్వారా బియ్యం నిత్యావసర సరుకులను పంపించడం జరిగిందని. రామగుండం నియోజకవర్గంలోని నిరుపేద కుటుంబాలకు చెందిన వారు మడిపెల్లి మల్లేష్  కు ఫోన్ చేసి వారి పరిస్థితి ని తెల్పగానే పేదవారి కంచంలో మెతుకు అవుతున్న సేవా స్ఫూర్తి ఫౌండేషన్ లో నేను కూడా ఒక సభ్యునిగా ఉండటం నాకు చాలా గర్వంగా ఉందని ఈ సేవ కార్యక్రమంలో పాల్గొనే అద్భుతమైన అవకాశాన్ని నాకు కల్పించిన ఫౌండేషన్ అధ్యక్షులు మల్లేష్ కు మరియు నా తోటి ఫౌండేషన్ సభ్యులకు మదావత్ శివయ్య నాయక్ కుటుంబం తరఫున మరియు రామగుండం ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నానని ఠాగూర్ నాయక్ అన్నారు ఈ కార్యక్రమంలో లావుడియ సురేష్ చిప్ప మల్లేష్ తదితరులు పాల్గొన్నారు

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 


పాలకుర్తి: పుట్నూర్ గ్రామంలో *జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మక్కన్ సింగ్ రాజ్ ఠాగూర్ ముఖ్య అతిథిగా పాల్గొని జండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు వారు మాట్లాడుతూ

 బ్రిటిష్ ప్రభుత్వ అరాచక, నియంత,నిరంకుశ,దోపిడి పరిపాలన నుండి , బ్రిటిష్ కబంధ హస్తాల నుండి భారత దేశ ప్రజల విముక్తి కోసం, స్వేచ్ఛ కోసం, స్వాతంత్రం సాధించడం కోసం ఆనాడు దేశ ప్రజలకు ఒక వేదిక ఏర్పడింది అదే అఖిల భారత కాంగ్రెస్ పార్టీ. *28-డిసెంబర్-1885 న A.O హ్యూమ్ కన్వీనర్ గా చంద్ర బెనర్జీ అధ్యక్షుడు గా 72 మంది ప్రతినిధులతో కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించి నేడు ప్రపంచ అతిపెద్ద ప్రజాస్వామ్య, లౌకిక, సామ్యవాద పార్టీగా అవతరించి 2 కోట్ల యాభై లక్షల మంది సబ్యులుగా ఉన్నారు. 75 సంవత్సరాల స్వతంత్ర భారత దేశంలో 55 సం"రాలు పరిపాలన చేసి దేశ ప్రజలలో చైతన్యం నింపి అనేక రంగాల్లో మార్పుల శ్రీకారం చుట్టింది కాంగ్రెస్. వ్యవసాయ, పారిశ్రామిక, సాంకేతిక, విద్య,వైద్య,విద్యుత్, రవాణా రంగాలలో అద్భుతమైన ప్రగతిని సంధించి అమెరికా లాంటి అగ్ర దేశ సరసన నిలబెట్టిన ఘనత కాంగ్రెస్ పార్టీది. 

 ప్రస్తుతం దేశంలో బీజేపీ రాష్ట్రంలో టి.ఆర్.ఎస్ అరాచక పరిపాలన వలన ప్రజలకు రక్షణ లేకుండా పోయింది. ప్రజల కోసం పని చేయాల్సిన ప్రభుత్వం ప్రజల సొమ్మును రాబందుల వలె, పందికొక్కులు వలె మింగుతున్నారు.ఈ దోపిడీ పోవాలి దేశ,రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు నడుము బిగించి చేయి చేయి కలిపి కదంతోక్కుతూ ఈ అరాచక ప్రభుత్వల నుండి ప్రజలను రక్షించివరకు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పోరాటం చేయాలి అని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో వేల్పుల రాజ్ కుమార్, కెశోరం సిమెంట్ ఫ్యాక్టరీ కార్మిక యూనియన్ అధ్యక్షులు సుర సమ్మన్న, తక్కల్లాపల్లి సర్పంచ్ ముక్కెర శ్రీనివాస్, ఎంపీటీసీ పాత రవీందర్, తలారి శంకర్,తోట ప్రశాంత్,వర్మని శ్రీనివాస్,కాల్వ చిన్న రాజయ్య,కాల్వ శంకర్,కాల్వ శ్రీనివాస్, వైద్య నరేష్,,మంచినీళ్ల భాస్కర్,తిరుపతి, అజయ్, కన్నయ్య,ముషనవేని తిరుపతి, సిపతి సురేష్,సతీష్, మంతెన స్వామి, పత్తిపక శంకరయ్య, నిమ్మల నారాయణ, మాదాసు రాజు, తదితరులు పాల్గొన్నారు

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతనిధి గంగారపు వెంకటేష్ 

ఎన్టిపిసి మేడిపల్లి సెంటర్ వద్ద *ఎస్సిఆర్పిఎస్ పెద్దపెల్లి జిల్లా యూత్ కార్యదర్శి మలెం మధు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమాని ముఖ్యఅతిథిగా *బిజెపి మల్కాపూర్ మండల అధ్యక్షుడు మిట్టపల్లి సతీష్ కుమార్ హాజరై (డా"బి.ఆర్ అంబేద్కర్ జాతీయ అవార్డు గ్రహీత), *ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు భూషిపాక సంతోష్ మాహరజ్  ను ఘనంగా సన్మానించి అభినందనలు తెలియజేశారు.

ఈ సందర్భంగా *బివిఎఫ్ పెద్దపల్లి జిల్లా కన్వీనర్ రాయపాక సైనిష్ వర్మ మాట్లాడుతూ అంతర్గాం మండల దళిత బిడ్డ ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు భూషిపాక సంతోష్ మహారాజ్ కు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జాతీయ అవార్డు రావడం  చాలా సంతోషకరమైన విషయం అని రానున్న రోజులలో ప్రజలకు ఇంకా సేవ చేయాలని, బడుగు బలహీన వర్గాలకు దగ్గరగా ఉంటూ, బహుజనులను ఏకం చేసి, ఎక్కడ అన్యాయం జరిగిన ముందుండి పనిచేయాలని కోరారు, ఈ కార్యక్రమంలో *బిజెపి మల్కాపూర్ మండల ప్రధాన కార్యదర్శి ఇదునురి చిరంజీవి , మాచర్ల అశోక్, టిఆర్ఎస్ నాయకులు మడ్డి అన్వేష్, ఇదినూరి ఆంజనేయులు, ఎస్సిఆర్పిఎస్ జిల్లా యూత్ అధ్యక్షులు ప్రేమ్ కుమార్, జిల్లా కార్యవర్గ సభ్యులు ఇదునూరి శ్రీమాన్ దితరులు అధిక సంఖ్యలో  పాల్గొన్నారు...

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ 



హన్మకొండ ;

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము   మధ్యాహ్నం 2.55 గంటలకు  రామప్ప వద్ద  ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు చేరుకున్నారు.

రాష్ట్ర పతి ద్రౌపది ముర్ముతోపాటు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్,  కేంద్ర మంత్రి జీ కిషన్ రెడ్డిలకు మంత్రి సత్యవతి రాథోడ్,జిల్లా  కలెక్టర్ కృష్ణ ఆదిత్య sp సంగ్రామ్ సింగ్ జి. పాటిల్, po అంకిత్,రాష్ట్ర పతి కి  హెలిపాడ్ వద్ద స్వాగతం పలికారు.

దేవాలయం లో  రాష్ట్ర పతి  బృందానికి మంత్రులు డా. V. శ్రీనివాస్ గౌడ్, ఎర్రబెల్లి దయాకరరావు , పల్లా రాజేశ్వర్ రెడ్డి  రాష్ట్ర పతి కి స్వాగతం పలికారు.

రామప్ప దేవాలయానికి చేరుకున్న ఆమెకు ఘన స్వాగతం పలికారు. రుద్రేశ్వరుడిని దర్శించుకుని రాష్ట్రపతి పూజలు చేశారు. రాష్ట్రపతికి ఆశీర్వచనం, తీర్థ ప్రసాదాలను వేద పండితులు అందించారు. మేడారం సమ్మక్క సారలమ్మ సారే ( చీర  ను మేడారం ఆదివాసీ పూజారులు రాష్ట్రపతి, గవర్నర్ లకు ఇచ్చారు.  ఆలయ విశిష్టత, నిర్మాణం, యునెస్కో గుర్తింపుకు కోసం తయారు చేసిన డోసియర్‌ వివరాలు, వరల్డ్‌ హెరిటేజ్‌ బాడి విధించిన నిబంధనలు, తదితర అంశాలను రాష్ట్రపతికి కాకతీయ హెరిటేజ్‌ ట్రస్టు కన్వీనర్‌ పాండురంగారావు వివరించారు. రామప్ప శిల్ప సంపద  ఎంతో అద్భుతం గా ఉందని  పొగిడారు.అనంతరం దేవాలయ ప్రాంగణం లో  ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదిక వద్ద 62 కోట్ల రూపాయలతో ప్రసాద్ స్కీం పథకాన్ని  ప్రారంభించారు. ఈ సందర్బంగా  ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ముఖ్య అతిథులను , వీక్షకులను ఆకట్టుకున్నాయి.  పరమశివుని పై పరంపరా బృందం చేసిన ప్రదర్శన ఆధ్యాత్మిక భావన కల్గించింది. మన సంస్కృతిని చాటే విధంగా కోమ్ముకోయ కళాకారుల బృందం సమక్క సారలమ్మ ప్రదర్శన ఆకట్టుకుంది, అనంతరం బ్రహ్మంఒక్కటే పర బ్రహ్మం ఒక్కటే అనే అన్నమాచార్య గీతం పై కళాకారులు ప్రదర్శించారు.అనంతరం జాతీయ గీతాన్ని ఆలపించి కార్యక్రమాన్ని ముగించారు.సాయంత్రం  4.23 నిముషాలకు కలెక్టర్ కృష్ణ ఆదిత్య, sp సంగ్రామ్ సింగ్ రాష్ట్ర పతి కి వీడ్కోలు పలికారు

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

మహాదేవపూర్ మండల ప్రతినిధి/దూది శ్రీనివాస్



మహాదేవపూర్: కాటారం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు,మాజీ  జెడ్పిటిసి,మాజీ సర్పంచ్, పుల్లూరి రాజేశ్వరరావు కు పార్టీలకతీతంగా రాజకీయ నేతలు పాల్గొని ఘనంగా నివాళులు అర్పించారు. కాటారం మండలం గారెపల్లి లో బుధవారం ఆయన స్వగృహం నందు సందర్శించి పలువురు నేతలు రాజేశ్వరరావు పార్థివ దేహం పై పుష్పగుచ్చాలు ఉంచి నివాళులు అర్పించారు. మంగళవారం రోజు గుండెపోటు రావడంతో వరంగల్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకువెళ్లి చికిత్స అందిస్తుండగా, సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఆయన తుది శ్వాస విడిచారు. మంగళవారం సాయంత్రం ఆయన మృతదేహాన్ని గారెపల్లి చౌరస్తా మీదుగా స్వగృహం వరకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు రాజేశ్వరరావు అమర్ రహే అంటూ,జనం నినాదాలు చేస్తూ పాదయాత్రతో ఘన నివాళి అర్పించారు.బుధవారం ఉదయం మాజీమంత్రి, ఏఐసీసీ కార్యదర్శి,మంథని శాసనసభ్యులు దుద్దిళ్ళ శ్రీధర్ బాబు,రాజేశ్వరరావు పార్థివదేహాన్ని సందర్శించి, పుష్పగుచ్చాలతో ఘనంగా నివాళులు అర్పించారు. రాజేశ్వరరావు మరణం తీరని లోటు అని శ్రీధర్ బాబు అన్నారు. రాజేశ్వరరావు అంత్యక్రియలలో పాల్గొని, అంతిమయాత్రలో శ్రీధర్ బాబు పాడే మోశారు. మంథని మున్సిపల్ చైర్ పర్సన్ పుట్ట శైలజ రాజేశ్వర్రావు పార్థివదేహాన్ని సందర్శించి,నివాళులు అర్పించారు.జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అయిత ప్రకాష్ రెడ్డి పార్తివదేహంపై పుష్పగుచ్చాలు ఉంచి ఘనంగా నివాళులర్పించారు. కాటారం ప్రాథమిక వ్యవసాయ సహకార సొసైటీ చైర్మన్ చల్ల నారాయణరెడ్డి పుష్పగుచ్చాల ఉంచి, అంతిమ యాత్ర లో పాల్గొని, పాడే మోశారు.  రాజకీయాలకు అతీతంగా పలువురు నేతలు పాల్గొని రాజేశ్వరరావు పార్థివదేహానికి పుష్పగుచ్చలు ఉంచి అంతిమ యాత్రలో పాల్గొన్నారు.తెలుగుదేశం పార్టీలో చురుకైన నాయకునుగా రాజేశ్వరరావు వ్యవహరించారు.అనంతరం అప్పట్లో మంథని ఎమ్మెల్యే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభాపతి గా వ్యవహరిస్తున్న దుద్దిళ్ల శ్రీపాదరావు నాయకత్వానికి ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో చేరారు.అప్పటినుంచి తాను తన కంఠంలో ప్రాణం ఉండగా కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని అన్న మాటలకు కట్టుబడి ఉన్నట్లుగా చివరి శ్వాస విడిచేంత వరకు కాంగ్రెస్ పార్టీలోనే రాజేశ్వరరావు కొనసాగి తుది శ్వాస విడిచారు.రాజేశ్వర్ రావు పార్తీవదేహాన్ని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు అందే భాస్కరాచారి, భారతీయ జనతా పార్టీ నాయకులు బొమ్మన భాస్కర్ రెడ్డి,బండం వసంత రెడ్డి, పూసాల రాజేంద్రప్రసాద్, దోమల సమ్మయ్య ఇతర పార్టీల నాయకులు సందర్శించి నివాళులు అర్పించారు. రాజేశ్వరరావుకు ముఖ్య సన్నిహితులుగా ఈ ప్రాంతంలోని ప్రముఖ వ్యక్తులుగా రాణించిన ఊర కమల మనోహర్ రావు మెమోరియల్  ట్రస్ట్ నిర్వాహకులు ఊర నందగోపాల్ రాజేశ్వరరావు పార్థీవ దేహాన్ని సందర్శించి పుష్పగిచ్చాలతో నివాళులు అర్పించిననంతరం శవయాత్రలో పాల్గొని పాడే మోశారు.మండల కేంద్రమైన గారేపల్లిలో శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవాలయంలో అయ్యప్ప దీక్ష ధారణ స్వాములు రాజేశ్వర్ రావు మృతికి సంతాపం ప్రకటిస్తూ రెండు నిమిషాలు మౌనం పాటించారు.గారేపల్లి మండల కేంద్రంలోని వ్యాపార,వాణిజ్య,దుకాణ సముదాయాలు స్వచ్ఛందంగా బంద్ పాటించారు.కుల మతాలకు అతీతంగా చిన్న పెద్ద అనే తేడా లేకుండా పరిసర ప్రాంతాలకు చెందిన ప్రజలు, సన్నిహితులు హాజరై రాజేశ్వర్ రావు అంతిమయాత్రలో పాల్గొని  కడసారి కన్నీటి వీడ్కోల్లతో సాగనంపారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ 



హన్మకొండ ;

దేశంలో ఎక్కడా లేనివిధంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే గ్రాంట్ కు సమానమైన గ్రాంటును అదనంగా ఇస్తూ గ్రామపంచాయతీలను తెలంగాణ ప్రభుత్వం బలోపేతం చేస్తుంటే కొత్త చట్టాలు తీసుకొచ్చి సర్పంచుల అధికారాలను, నిధులను కేంద్రం తగ్గించిందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి మరియు గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు  అన్నారు. తప్పుడు మాటలతో బిజెపి సర్పంచులను తప్పుదారి పట్టిస్తోందని, ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాల గురించి సర్పంచులకు సంపూర్ణ అవగాహన కల్పించి వారిని సరైన దారిలోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరిపై ఉందని మంత్రి అన్నారు. వరంగల్ జిల్లా జడ్పీ సర్వసభ్య సమావేశంలో  బుధవారం  మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా  మంత్రి  ఎర్రబెల్లి దయాకర్ రావు  మాట్లాడుతూ  పెద్ది సుదర్శన్ రెడ్డి నష్ట పరిహారం ఎక్కువ కావాలని అడుగుతున్నారు. కచ్చితంగా ఇచ్చే ప్రయత్నం చేస్తాం. జిల్లా పరిషత్ మీటింగ్ లో చర్చకు వచ్చిన అంశాలు సీఎం కేసీఆర్  దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. తప్పకుండా సీఎం, వ్యవసాయ శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చేసే ప్రయత్నం చేస్తాను.1800 కోట్ల రూపాయలు రోడ్ల కోసం సీఎం కేసీఆర్  ఇచ్చారు. ఇందులో  మెయింటెనెన్స్ కోసం 1000 కోట్ల రూపాయలు, దెబ్బ తిన్న రోడ్ల కోసం 800 కోట్ల రూపాయలు ఇచ్చారు. అయినా ఇవి సరిపోవు అంటే సీఎం  500 కోట్లు అదనంగా ఇచ్చారు. వీటిలో ఎక్కువగా నష్టపోయిన నర్సంపేట, భూపాలపల్లి, ఇతర ప్రాంతాల్లో ఖర్చు చేస్తాం. రైతులకు ఎవరూ చేయనంత తెలంగాణ ప్రభుత్వం చేస్తుంది. ఈ ఏడాది వరంగల్ జిల్లాలోనే రైతు బంధు కింద 2,84,000 మందికి 266.20 కోట్లు ఒక్క వానాకాలంలో రైతు బంధు కింద ఇస్తున్నాం. గ్రామం వారీగా రైతు బంధు ఎంత వస్తుంది...? లబ్ది దారుల జాబితా సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీ ,ఎమ్మెల్యేలకు ఇవ్వాలి. గత 5 ఏళ్ళల్లో ఎంత ఇచ్చాం వివరాలు ఇవ్వాలి. రైతు బీమా 5 లక్షల రూపాయలు ఒక్క తెలంగాణ రాష్ట్రం మాత్రమే ఇస్తుంది. ఎక్కడా కూడా ఈ పథకం లేదు. గ్రామాల్లో ఎంతమంది చనిపోయారు. ఎంత ఇచ్చామో చెప్పాలి. పక్క రాష్ట్రాల్లో పెన్షన్లు 500 మించి లేదు. మన రాష్ట్రంలోనే 2116 రూపాయిలు ఇస్తున్నాం. కళ్యాణ లక్ష్మి పథకం కింద 1,00116 రూపాయలు ఇస్తున్న ఏకైక రాష్ట్రం కూడా తెలంగాణ మాత్రమే. ప్రతి గ్రామ పంచాయతీ ముందు ప్రభుత్వ పథకాలు, లబ్ధిదారులు, నిధుల వివరాల బోర్డు పెట్టాలి. ఎంపిడిఓలు ఇది తయారు చేసి స్థానిక ప్రజాప్రతినిధులకు ఇవ్వాలి. వీటన్నిటినీ ప్రజల్లోకి తీసుకెళ్లాలి. పామ్ ఆయిల్ విషయంలో ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నది. 2000 ఎకరాలు వరంగల్ జిల్లాలో పామ్ ఆయిల్ పెట్టాం. మనకు 6 ఫ్యాక్టరీలు వస్తున్నాయి.ప్రతి రైతు వేసుకునే పంట ఆయిల్ పామ్. అందరినీ ప్రోత్సహించే ఏర్పాటు అధికారులు చేయాలి. హత్యకు గురైన చేర్యాల జెడ్పీటీసీ మల్లేశం నాకు దగ్గరే. ఈ హత్యకు పాల్పడ్డ వారిపై సీరియస్ యాక్షన్ తీసుకుంటాను. వారి కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటాం. సర్పంచ్ లను పక్క దోవ పట్టించే ప్రయత్నం బిజెపి చేస్తుంది. మీరు దీనిని తిప్పి కొట్టాలి. పంచాయతీలకు 15వ ఆర్థిక సంఘం మొత్తం గ్రాంట్ 1202.75 కోట్లు. గ్రామానికి ఇచ్చేవి 5 లక్షలు ఇప్పటి వరకు ఈ ఏడాది జిల్లా పరిషత్ లకు 86 కోట్లు విడుదల చేశాం. కేంద్రం గతంలో ఇచ్చే గ్రాంట్ ను తగ్గించింది. కేంద్రం ఇచ్చే గ్రాంట్ కు సమానంగా ఇస్తుంది కేవలం తెలంగాణ రాష్ట్రం. మిగిలిన రాష్ట్రాల్లో కేంద్రం ఇచ్చే గ్రాంట్ మాత్రమే ఇస్తున్నారు. గతంలో 1830 కోట్లు కేంద్రం ఇచ్చేది.ఈ ఏడాది 500 కోట్లు తగ్గించింది. ఈ ఏడాది ఒక్క రూపాయి ఇవ్వలేదు. అయినా మన రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెలా 256 కోట్ల రూపాయలు విడుదల చేస్తున్నాం. అడగంగా అడగంగా మొన్న 700 కోట్లు ఇచ్చింది. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు రాక సర్పంచ్ లు ఇబ్బందులు పడుతున్నారు. మనం ప్రతి ఏటా పంచాయతీలకు  330 కోట్లు విడుదల చేస్తే అందులో 50 శాతం రాష్ట్ర వాటా కాగా 50 శాతం కేంద్ర వాటా 50 శాతం. కేంద్రం మనకు ఇవ్వాల్సిన నిధుల్లో ఒక్క రూపాయి ఇవ్వకున్నా మనం ప్రతి నెల 256 కోట్ల రూపాయలు ఇస్తున్నాం. గ్రామ పంచాయతీలు బలోపేతం చేసింది మనమే. పాత గ్రామ పంచాయతీలు 8,684 ఉండగా, కొత్తగా 4,085 చేసుకున్నాం. మొత్తం 12769 గ్రామ పంచాయతీలు చేశాం. ఒక్కో పంచాయతీకి 5 లక్షలు, ట్రాక్టర్ ఇచ్చాం. ట్రాక్టర్ భారం కాదు. ఆదాయ మార్గం. హరిత హారానికి నీళ్ళ కోసం ప్రతి ట్రిప్ కు గతంలో 6 వేలు కిరాయి ఇచ్చేవాళ్లు. కానీ ఇప్పుడు ట్రాక్టర్ ఉండడం వల్ల అన్ని డబ్బులు మిగులుతాయి. పైగా ఆదాయం వస్తుంది. తెలివిగా చేస్తే సర్పంచ్ లకు పంచాయతీలలో మస్తు ఆదాయం వస్తుంది. పొడి చెత్త, తడి చెత్త ఎరువు తయారు చేసి 50 లక్షలు తయారు చేశారు మన వరంగల్ లోని సర్పంచ్._

తెలంగాణ ప్రభుత్వంలో గ్రామ పంచాయతీల ఆదాయం పెంచాం. మనకు విపరీతమైన అవార్డులు వచ్చాయి. దేశంలో 19 అవార్డులు ఇస్తే రాష్ట్రానికి 18 వచ్చాయి. దీన్ని ఓర్వలేక బిజెపి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. దీనిపై మీరు సరైన అవగాహన చేయాలి. గతంలో సర్పంచ్ ల వేతనం 1000 రూపాయలు ఉంటే మనం దానిని  6500కు పెంచాం. జెడ్పీటీసిలకు 2,250 ఉండగా ఇప్పుడు 13,000 ఇస్తున్నాం. వరంగల్ జిల్లా అన్ని విధాల ముందుకు వెళ్తుంది. కేంద్రం చట్టం తెచ్చి స్థానిక సంస్థను ఇబ్బంది పెట్టింది. దీనివల్ల మన అధికారాలు దెబ్బ తిన్నాయి. జెడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీ లకు ఎక్కడా ఇవ్వనన్ని డబ్బులు ఇస్తున్నాం. ఇంకా మీరు తృప్తి పొందే విధంగా ఇస్తాను. ఇద్దరు కలెక్టర్లు డైనమిక్ గా ఉన్నారు. వారితో మంచి పని తీసుకోవాలి. వారు కూడా మీకు అన్ని విధాల సహకరిస్తారు. నాకు ఈ వరంగల్ జెడ్పీతో దీనితో 35 ఏళ్ల అనుబంధం ఉంది. డీసీసీబీ చైర్మన్ గా, ఎమ్మెల్యే గా ఇక్కడ కొనసాగాను.

సమావేశానికి జిల్లా జెడ్పీ చైర్  పర్సన్ శ్రీమతి గండ్ర  జ్యోతి  అధ్యక్షత వహించగా ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి , జిల్లా కలెక్టర్ గోపి, హనుమకొండ కలెక్టర్ రాజీవ్ గాంధీ  హనుమంతు, అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ, జడ్పీటీసీలు, ఎంపీపీ , స్థానిక ప్రజాప్రతినిధులు,  అధికారులు హాజరయ్యారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ 



హన్మకొండ ;

భారత రాష్ట్రపతి  ద్రౌపది ముర్ము  రామప్ప దేవాలయం వస్తున్న నేపథ్యంలో రాష్ట్రపతి కార్యక్రమాలలో

పాల్గొనేందుకు వస్తూ ములుగు గట్టమ్మ దేవాలయంలో అమ్మవారి దర్శనం చేసుకుని, రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి మరియు గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి  ఎర్రబెల్లి దయాకర్ రావు  రైతుబంధు రాష్ట్ర అధ్యక్షులు పల్లా రాజేశ్వర్ రెడ్డి , నర్సంపేట మున్సిపల్ జెడ్పీ ఫ్లోర్ లీడర్ పెద్ది స్వప్న 

ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ

 



హన్మకొండ ;

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము   మధ్యాహ్నం 2.55 గంటలకు  రామప్ప వద్ద  ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు చేరుకున్నారు.

రాష్ట్ర పతి ద్రౌపది ముర్ముతోపాటు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్,  కేంద్ర మంత్రి జీ కిషన్ రెడ్డిలకు మంత్రి సత్యవతి రాథోడ్, జిల్లా  కలెక్టర్ కృష్ణ ఆదిత్య ఎస్పీ  సంగ్రామ్ సింగ్ జి. పాటిల్, పిఓ  అంకిత్, రాష్ట్ర పతి కి స్వాగతం పలికారు. దేవాలయం లో మంత్రులు డా. V. శ్రీనివాస్ గౌడ్, ఎర్రబెల్లి దయాకరరావు గ, పల్లా రాజేశ్వర్ రెడ్డి  రాష్ట్ర పతి కి స్వాగతం పలికారు.అనంతరం

రామప్ప దేవాలయం లో ప్రసాద్ ప్రాజెక్ట్ ను రాష్ట్ర పతి

ప్రారంభించారు. 

ములుగు జిల్లా రామప్ప పర్యటన లో పాల్గొని హెలిప్యాడ్ కి చేరుకొని హైదరాబాదుకు తిరిగి 

రాష్ట్ర పతి   ద్రౌపది ముర్ము

వెళ్ళి పోయారు. 

ములుగు జిల్లా కలెక్టర్  కృష్ణ ఆదిత్య,  ఐటిడిఏ పిఓ అంకిత్  ములుగు ఎస్పీ సంగ్రామ్ సింగ్ జి పాటిల్, ఇతర ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు తదితరులు  

వీడ్కోలు చెప్పారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 


కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను యువజన కాంగ్రెస్ కార్పొరేషన్ అధ్యక్షుడు కౌటం సతీష్  ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగినది .

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పెద్దపెల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు  *MS రాజ్ ఠాకూర్  హాజరై పతకాన్ని ఆవిష్కరించారు అనంతరం వారు మాట్లాడుతూ 

 భారత దేశం ఈరోజు అభివృద్ధి పదంలో నడుస్తుంది అంటే దానికి  కాంగ్రెస్ పార్టీ చేసిన సంస్కరణలే కారణం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే ఎన్నో ప్రాజెక్టులు నీటి డ్యాములు కట్టి ఈరోజు భారతదేశం అభివృద్ధి పథంలో నడుస్తుంది ఇందిరా గాంధీ  రాజీవ్ గాంధీ దేశం కోసం ప్రాణాలు అర్పించిన మహానీయులు అలాంటి కాంగ్రెస్ పార్టీలో మేము ఉండడం మాకు చాలా గర్వకారణం కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కులాలకు మతాలకు అతీతంగా బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి పేదలు నమ్మే ఏకైక పార్టీ ఒక కాంగ్రెస్ పార్టీ మరి సోనియా గాంధీ రాహుల్ గాంధీ  నాయకత్వన మేం పని చేస్తూ రానున్న ఎలక్షన్లలో అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయడం ఖాయమని వారు మాట్లాడినారు

ఈ కార్యక్రమం లో బ్లాక్ వన్ అధ్యక్షుడు మాదరబోయిన రవికుమార్ కార్పొరేటర్స్ మహంకాళి స్వామి ఎండి ముస్తఫా పెద్దెల్లి ప్రకాష్ తేజస్విని  నజీముద్దీన్ పంజా శ్రీనివాస్ కొప్పుల శంకర్ ఎండి యాకూబ్ దూళికట్ట సతీష్ మేకల పోశం  MD నాజిముద్దిన్ ఎంచర్ల మహేష్ , ఫజల్, కీర్తి నాగరాజు శ్రావన్, దుర్గాప్రసాద్ ఉదయరాజు గుంట సదానందం పీక అరుణ్ కుమార్ సిరిపురం మహేష్ రాపల్లి కార్తీక్ తదితరులు పాల్గొన్నారు

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

మహాదేవపూర్ మండల ప్రతినిధి/దూది శ్రీనివాస్


మహాదేవపూర్: దేశం, రాష్ట్రం ప్రమాదంలో ఉన్నాయని.. ఇలాంటి సమయంలో వ్యక్తిగత అంశాలకు ప్రాధాన్యం ఇవ్వకుండా కాంగ్రెస్‌ శ్రేణులు ప్రజల కోసం పోరాడాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌ 138వ ఆవిర్భావ దినోత్సం సందర్భంగా,గాంధీ భవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పార్టీ జెండాను రేవంత్‌ ఆవిష్కరించారు.


దేశ భూభాగాన్ని చైనా ఆక్రమించుకుంటుంటే ప్రశ్నించలేని దౌర్భాగ్య స్థితిలో మోదీ సర్కార్‌ ఉందని రేవంత్‌ రెడ్డి ఆరోపించారు.రాహుల్‌ గాంధీ హెచ్చరించినా దేశ భద్రత కేంద్రానికి పట్టడం లేదని విమర్శించారు.జనవరి 26 నుంచి ప్రారంభమయ్యే ‘హాత్‌ సే హాత్‌ జోడో యాత్ర’లో కాంగ్రెస్‌ శ్రేణులంతా పాల్గొని ప్రజల పక్షాన నిలవాలని విజ్ఞప్తి చేశారు. 


దేశాన్ని ముప్పు నుంచి కాపాడేందుకే..మహాత్ముడి స్ఫూర్తితో రాహుల్‌ పాదయాత్ర చేస్తున్నారు. రాహుల్‌ పాదయాత్ర భయంతోనే మోదీ కొవిడ్‌ రూల్స్‌ తీసుకొచ్చారు.దేశ సమగ్రతను పణంగా పెట్టి భాజపా కుట్రలు చేస్తోంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేతిలో రాష్ట్రం విధ్వంసానికి గురైంది. కుటుంబ సభ్యులకు దోచిపెట్టడానికి ఇప్పుడు దేశం మీద పడ్డారని రేవంత్‌ ఆరోపించారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 


ముఖ్యమంత్రి కెసిఆర్  నిరుపేద అనారోగ్య బాధితులకు  సిఎంఆర్ఎఫ్ ద్వారా సహాయనిధులను అందజేస్తూ.. వారికి కొండంత అండగా నిలుస్తున్నారని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌  అన్నారు. కార్పొరేషన్ పరిధిలోని 20 డివిజన్ కు చెందిన దండుగుల హరిప్రియ  అనే చిన్నారి గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతుందని వారికి సహయం అందించాలని స్థానిక కార్పోరేటర్ కన్నూరి సతీష్ కుమార్ ఎమ్మేల్యే చందర్ ను కోరడం జరిగింది. ఈ క్రమంలో   ఎమ్మెల్యే చందర్  సీఎంఆర్ఎఫ్  ద్వారా చిన్నారి వైద్యచికిత్స నిమిత్తం  రూ. 2,50,000ల ఎల్ ఓ సి ని చిన్నారి తండ్రి శ్రీనివాస్ కు  అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోరుకంటి చందర్ మాట్లాడుతూ.. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని  నిరుపేద అనారోగ్య బాధితులకు సీఎంఆర్ఎఫ్  ద్వారా కోట్లాది రూపాయలను మ‍ంజూరు చేయుంచినట్లు తెలిపారు. నిరుపేదలకు కార్పొరేట్‌ వైద్యం అందించాలనే సంకల్పంతో సీఎం కేసిఆర్‌ గారు సిఎం సహాయ నిధి ద్వారా ఆర్థిక భరోసాను కల్పిస్తున్నారన్నారు. రామగుండం నిరుపేద ప్రజానీకానికి  తాను ఎల్లప్పుడూ సహాయ  సహకారాలు అందిస్తానని  ఎమ్మెల్యే కోరుకొండ చందర్ ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు  కన్నూరి సతీష్ కుమార్, కల్వచర్ల కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

మహాదేవపూర్ మండల ప్రతినిధి/దూది శ్రీనివాస్

జయశంకర్ భూపాలపల్లి జిల్లా,మహాదేవపూర్: కరోనా వైరస్‌ మరోసారి ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తున్న తరుణంలో ప్రజలు తక్షణమే బూస్టర్‌ డోస్‌ టీకా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.దీంతో బూస్టర్‌ డోస్‌ వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని వైద్య ఆరోగ్యశాఖ చేపట్టింది. మంగళవారం నుంచి పూర్తిస్థాయిలో అన్ని జిల్లా కేంద్రాల్లో బూస్టర్‌ డోస్‌ పంపిణీ చేపడతారు. అందుకు సంబంధించి జిల్లాలకు ఆదేశాలు జారీచేశారు.మొత్తం 1,571 కేంద్రాలలో ప్రత్యేకంగా బూస్టర్‌డోసు ఇచ్చేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసినట్లు వైద్య వర్గాలు వెల్లడించాయి.రద్దీ ప్రాంతాల్లో మొబైల్‌వ్యాక్సినేషన్‌ జరగనుంది.మార్కెట్లు, షాపింగ్‌మాల్స్,ప్రభుత్వ, ప్రైవేట్‌ కార్యాల­యాలు, ఇతర కేంద్రాల వద్ద ప్రత్యేక వాహనాల్లో టీకాల పంపిణీ చేస్తారు.50 మందికి మించి, ముందస్తు విజ్ఞప్తి చేస్తే,వారికి ఆ మేరకు బూస్టర్‌ డోస్‌ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తామని చెబుతున్నారు.

ప్రస్తుతం మన రాష్ట్రంలో 1.60 కోట్ల మంది బూస్టర్‌ డోస్‌ వేసుకోవాల్సి ఉంది. అలాగే 9 లక్షల మంది రెండో డోస్‌ టీకా వేసుకోలేదు. ప్రస్తుతం రాష్ట్రంలో తొమ్మిదిన్నర లక్షల డోసులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి.ఇప్పుడిప్పుడే ప్రజలు కూడా రెండో డోసు, బూస్టర్‌ డోసు వ్యాక్సిన్‌ వేసుకునేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. పెద్దఎత్తున ప్రజలు తరలివస్తే ప్రస్తుతం ఉన్న టీకాలు సరిపోయే పరిస్థితి లేదు.ఈ నేపథ్యంలో తక్షణమే కరోనా టీకాలు సరఫరా చేయాలని ఇటీవల కేంద్రానికి,రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విన్నవించిన సంగతి తెలిసిందే... 


కొత్తగా 12 కరోనా కేసులు.. 


రాష్ట్రంలో సోమవారం నిర్వహించిన 4,367 కరోనా నిర్ధారణ పరీక్షల్లో 12 కరోనా పాజిటివ్‌ కేసులు వచ్చాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 8.41 లక్షలకు చేరుకుంది. ఒక్కరోజులో కరోనా నుంచి ఆరుగురు కోలుకోగా,ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 8.37 లక్షలకు చేరింది.ప్రస్తుతం రాష్ట్రంలో 65 యాక్టివ్‌ కేసులున్నాయి...

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 


ఓపెన్ కాస్ట్ బ్లాస్టింగ్ వల్ల గోదావరిఖని ప్రాంతంలో నివసించే ప్రజలకు వ్యాపారస్తులకు అనేక రోగాలతో అనేక సమస్యలతో ఇబ్బందికి గురి చేస్తున్న సింగరేణి ఓపెన్ కాస్ట్ కు వ్యతిరేకంగా గోదావరిఖని ప్రజలు పడే కష్టాలను తెలుసుకుంటూ జనవరి 3 వ తేదీ నాడు జరిగే ధర్నా కార్యక్రమంలో పాల్గొనాలని ఇంటి ఇంటికి తిరుగుతు ధర్నాకు రావాలని పిలుపునిస్తున్న

 *కాంగ్రెస్ పార్టీ  పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు 

రామగుండం నియోజకవర్గ ఇంచార్జి రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్*

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

మహాదేవపూర్ మండల ప్రతినిధి/దూది శ్రీనివాస్ 


మహాదేవపూర్/జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కేంద్రానికి చెందిన బుర్రా లాస్య తెలంగాణ నుంచి తొలి మహిళా క్రికెట్‌ కోచ్‌గా ఎంపికయ్యారు. ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసీసీ) అకాడమీ ప్రపంచవ్యాప్తంగా ఎంపిక పరీక్ష నిర్వహించగా... దేశంలో ఎంపికైన ముగ్గురు క్రీడాకారుల్లో లాస్య ఒకరు. బాల్యం నుంచే లాస్యకు క్రికెట్‌పై ఎంతో ఆసక్తి.అదే ఆసక్తితో క్రికెట్‌ ఆట మెలకువలపై హైదరాబాద్‌లో శిక్షణ తీసుకున్నారు. అనంతరం ఐసీసీ నిర్వహించే మొదటి శ్రేణి శిక్షణ కోర్సును పూర్తి చేసుకున్నారు.అందులో ఉత్తీర్ణత సాధించి కోచ్‌గా ఎదిగారు.శనివారం తన తండ్రి రమేష్‌తో కలిసి వచ్చిన లాస్య.. రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ను ఆయన నివాసంలో కలిశారు.ఈ సందర్భంగా మంత్రి ఆమెను అభినందించి రాష్ట్రం గర్వించేలా మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.లాస్య తల్లి సునీత జాతీయ అథ్లెట్‌. తండ్రి రమేష్‌ వాలీబాల్‌ క్రీడాకారుడు.ప్రస్తుతం లాస్య తల్లి జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా యువజన,క్రీడల అధికారిణిగా,తండ్రి జిల్లా గ్రంథాలయాల సంస్థ ఛైర్మనుగా కొనసాగుతున్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 


పాలకుర్తి మండలం జీడీ నగర్  GM పంక్షన్ హాల్ లో ఉమ్మడి కరీంనగర్ వడ్డెర సంఘం జిల్లా అధ్యక్షులు సూర రవి5వ వర్ధంతి సందర్బంగా వారి సోదరులు *సర్పంచ్, కేశోరం కాంట్రాక్టు యూనియన్ అధ్యక్షులు సూర సమ్మయ్య ఆధ్వర్యంలో పాటల పోటీలో మొదటి బహుమతి ని బుతాగడ్డల రాయమల్లు కు 5016/-, రెండవ బహుమతి చందు కు 2516/- మూడవ బహుమతి ఓర్సు కొమురమ్మ కు 1016/-  గారికి మరియు కళాకారులకు మేముంటోళ్లు  *రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ చేతుల మీదుగా అందించారు ,వృద్దులకు, వికలాంగులకు, ఒంటరి మహిళలకు దుప్పట్లు పంపిణి మరియు అన్నదానం కార్యక్రమం నిర్వహించారు,

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగ పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ షాప్ చైర్మన్ మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్  హాజరై అయి సూర రవి చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ,,, సూర రవి  వడ్డెర జాతి ముద్దు బిడ్డ అని, చిరస్మరనీయుడని, ఆప్త బంధువుడని అత్యంత దగ్గరి సన్నిహితుడని ఆయన లేకపోవడం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు అని అన్నారు...

 ఈ కార్యక్రమంలో బసంత్  నగర్ ఎంపిటిసి పాత రవీందర్, తువ్వ సతీష్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు తలారి శంకర్, తండా సర్పంచి రాజ్ నాయక్, జీడీ నగర్ ఉప సర్పంచ్ రెడ్డపాక వసంత మల్లేష్, గండికోటవెంకటేష్,వార్డు సభ్యులు ఓర్సు కొమురమ్మ, వడ్డేపల్లి తిరుపతి, చిల్లగని రాజేష్, కంకటి రవి, md షబ్బీర్, ప్రజా ప్రతినిధులు మరియు సూర రవి అభిమానులు, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ 


హన్మకొండ ;

జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజాదివాస్ కార్యక్రమంలో భాగంగా సోమవారం, సమస్యలతో వచ్చిన 17 మంది   బాధితుల నుంచి ఎస్పి   జె. సురేందర్ రెడ్డి  ఫిర్యాదులు స్వీకరించారు. బాధితుల సమస్యలపై స్పందించి సంబంధిత పోలీసు అధికారులతో ఫోన్లో మాట్లాడారు. ప్రజల సమస్యలపై విచారణ జరిపి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, బాధితులకు న్యాయం చేయాలని ఎస్పి ఆదేశించారు. పోలీసులు  ప్రజలతో స్నేహంగా వ్యవహరిస్తూ,  పోలీసు శాఖ పై నమ్మకం కలిగే విధంగా పని చేయాలన్నారు. అలాగే శాంతి భద్రతల పరిష్కారంలో ప్రజలు పోలీసులకు సహకరించాలని అన్నారు. సంఘ విద్రోహా శక్తులు, అసాంఘిక  కార్యకలాపాలపై ఎప్పటికప్పుడు, సమాచారం   తెలియజేయాలని  ఎస్పి  కోరారు

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 


డిసెంబర్ 31 వేడుకలు వద్దు ... ఆ డబ్బులతో నిరుపేదలకు సహాయం చేయమని యువతకు చిన్నారుల ఛాలెంజ్                                                                                                                                                            పెద్దపల్లి మండలం తుర్కల మద్దికుంట గ్రామంలో  అంగవైకల్యంతో నడవడానికి ఇబ్బంది పడుతున్న విజేయ్ కుమార్ గురించి తెలుసుకున్న చిన్నారులు చలించిపోయారు.  సుల్తానాబాద్ మండల కేంద్రం ద్వారాకనగర్ లో నివాసముంటున్న  ఏగోలపు సదయ్య గౌడ్ కూతురు జ్యోషిక వయస్సు 15, కౌశిక్ వయసు 14  చిన్నారులు ఈ రోజు *పెద్దపల్లి మండలం తుర్కల మద్దికుంట గ్రామంలో నివాసముంటున్న నిరుపేద కుటుంబానికి చెందిన ఈదునూరి  దుర్గయ్య - సంతోషి  కుమారుడు విజేయ్ కుమార్ అంగవైకల్యంతో నడవడానికి కష్టంగా ఉన్నట్లు తెలుసుకున్న చిన్నారులు వెంటనే స్పందించి వీరు దాచుకున్న డబ్బులు మరియు దాత అల్లం సత్యనారాయణ దంపతుల సహాయంతొ  6800/-రూపాయల విలువ గల వీల్ చైర్ అందించారు. చిన్నారులు

 జ్యోషిక ,కౌశిక్ లు విజేయ్ కుమార్ గురించి అల్లం సత్యనారాయణ దంపతులకు చెప్పి విరాళాలు అడిగారు. వీరు వెంటనే స్పందించి  గత మూడు సంవత్సరాల లాగే ఈ సంవత్సరం కూడా ఛాలెంజ్ ప్రోగ్రాం చేయమని అల్లం సత్యనారాయణ దంపతులు 5000/- రూపాయలు విరాళంగా ఇచ్చి ప్రోత్సహించారు. *చిన్నారులు జ్యోషిక, కౌశిక్ లు మాట్లాడుతూ యువతి యువకులకు మరియు పెద్దవాళ్ళుకు ఛాలెంజ్ చేస్తున్నాము  డిసెంబర్ 31 వేడుకలు దావతులు వద్దు .డిసెంబర్ 31 వల్ల మన తలరాతలు మారవని క్యాలెండర్లో తేదీ మాత్రమే మారుతుందని ఇది మన  సంసృతి సాంప్రదాయం కాదనిఇది విదేశీ సంస్ర్కుతి అని మన పండుగ ఉగాదని చెప్పారు. మీరు 31న దావతులకు ఖర్చు పెట్టె డబ్బులు నిరుపేద కుటుంబాలకు సహాయం చేయాలని వేడుకున్నారు 2020 లాక్ డౌన్లో వీరుదాచుకున్న డబ్బులు మరియు దాతల సహాయం తో 207 మంది నిరుపేద కుటుంబాలకు, సెప్టెంబర్ నెలలో టీచర్స్ డే సందర్భంగా 200మంది ప్రయివేటు ఉపాద్యాయులకు మొత్తం 407 మందికి ఒక్కొక్కరికి 500 రూపాయల విలువ గల నిత్యావసర సరుకులను అందించారు.2021 రెండవ లాక్ డౌన్లో కరోనతో బాధపడుతున్న 156 మంది కరోన పేసేంట్లకు ఒక్కొక్కరికి 350 రూపాయల విలువ గల హెల్త్ ఫుడ్ ఫ్రూట్స్, ఎగ్స్ అందించారు.   ఇట్టి కార్యక్రమంలో ఏగోలపు సదయ్య గౌడ్ ,అల్లం సత్యనారాయణ ,ఏగోలపు రాజేశం గౌడ్,బుర్ర రాజమల్లు గౌడ్,శంకర్ గౌడ్,శ్రీనివాస్ గౌడ్, వెలిశాల తిరుపతి గౌడ్,బాలాజీ గౌడ్,బొషెల్లీ మహేష్, ఇదునూరి సాల్ మోహన్, బుర్ర నారాయణ గౌడ్, శ్రీనివాస్ గౌడ్,మొగిలి గౌడ్,నరేష్ గౌడ్, వడ్లూరి ప్రభాకర్, ఇదునూరి రవి  తదితరులు పాల్గొన్నారు

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 


ఎన్టీపీసీ చిలుకలయ్య గుడి ప్రాంగణంలో గల అయ్యప్ప దేవాలయంలో అయ్యప్ప రథోత్సవ కార్యక్రమాన్ని ఆలయ పూజారి నరహరి శర్మ సమక్షంలో ఆలయ కమిటీ చెప్పాలా రామారావు, డిప్యూటీ మేయర్ నడిపెల్లి అభిషేక రావు, ఆలయ గురుస్వామి ప్రభాకర్ స్వామి, కొబ్బరికాయ కొట్టి రథయాత్ర ప్రారంభించారు, మహిళలు సాంప్రదాయ దుస్తులు ధరించి మంగళహారతులతో స్వాగతం పలికి మహిళలు కోలాటాలు, అయ్యప్ప స్వాములు పేట తుళ్ళి తో వాయిద్యాలనడుమ అంగరంగ వైభవంగా ప్రారంభించి ఈ రథయాత్ర అన్నపూర్ణ కాలనీ మేడిపల్లి సెంటర్ మీదుగా ఎఫ్సిఐ ఎక్స్ రోడ్ నుండి తిరిగి ఆలయానికి చేరుకుంటుంది అని, అలాగే సోమవారం రోజున మండల పూజ కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఉదయం స్వామివారికి అభిషేకం గణపతి హోమం మధ్యాహ్నం మహా నైవేద్య అన్నదాన కార్యక్రమం సాయంత్రం పడిపూజ భజన కార్యక్రమం ఉంటుందని గురుస్వామి తెలియజేశారు ఈ కార్యక్రమంలో రాజు గురుస్వామి బండి తిరుపతి స్వామి యాదవ్ స్వామి అశోక్ రెడ్డి బండి అనిల్ రామగుండం గురుస్వామి రాములు గౌడ్ మరియు వారి అయ్యప్ప స్వాములు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు అన్నారు

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

మహాదేవపూర్ మండల ప్రతినిధి/దూది శ్రీనివాస్ 


జయశంకర్ భూపాలపల్లి జిల్లా,మహాదేవపూర్: మండల కేంద్రంలో ఈరోజు క్రిస్మస్ పర్వదినంను పురస్కరించుకొని,బెతెస్త  ప్రార్ధన చర్చిలో ఏసుక్రీస్తు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి.ఏసుప్రభువు ను కీర్తిస్తూ,ఆలపించిన కీర్తనలతో,సామూహిక ప్రార్ధనలతో క్రైస్తవుల మందిరాలు మారు మోగాయి.క్రిస్మస్ ప్రత్యేక కేక్ ను కట్ చేసి,ఒకరికి ఒక్కరూ ప్రేమతో పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.ఏసుక్రీస్తు బోధనలు విశ్వశాంతికి సందేశాలని,సాటి మనుషులను ప్రేమతో చూడడం గొప్ప గుణమని,మానవతవిలువలతో చేసిన గొప్పపని ఏదైనా ఏసుక్రీస్తు దీవెనలు పొందెలా చేస్తుందని మహాదేవపూర్ సర్పంచ్ శ్రీపతిబాపు అన్నారు.ఈ కార్యక్రమంలో జెడ్పిటిసి గుడాల అరుణ, వ్యవసాయ సహకార సంఘం ఛైర్మెన్ చల్ల తిరుపతిరెడ్డి,ఉప సర్పంచ్ సల్మాన్ ఖాన్,బిఆర్ఎస్ పార్టీ యూత్ మండల అధ్యక్షులు అలీం ఖాన్,మహిళా విభాగం మంథని నియోజకవర్గ ఇంచార్జ్ కేదారి గీత,పార్టీ టౌన్ ప్రసిడెంట్ కూరతోట రాకేష్,జిల్లా గ్రంథాలయ సంస్థ డైరెక్టర్ వెన్నంపల్లి మహేష్,మండల నాయకులు మెరుగు శేఖర్,లక్ష్మణ్,చకినారపు చందు,భానుమతి,క్రైస్తవ మత పెద్దలు,సోదర, సోదరీమణులు,యువకులు తదితరులు పాల్గొన్నారు..

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

మహాదేవపూర్ మండల ప్రతినిధి/దూది శ్రీనివాస్ 



జయశంకర్ భూపాలపల్లి జిల్లా,మహాదేవపూర్/ మహా ముత్తారం గ్రామానికి  చెందిన  లింగమల్ల మహేష్ పోలీస్ ఈవెంట్స్ లో పాల్గొని మృతి చెందడం బాధాకరమని, మహేష్ పార్థీవ దేహానికి నివాళులర్పించి,వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేసి  మహా ముత్తారం గ్రామస్తులు చేస్తున్న నిరసన కార్యక్రమానికి ఏఐసీసీ కార్యదర్శి మాజీ మంత్రి మంథని ఎమ్మెల్యే శ్రీ దుద్దిళ్ళ శ్రీధర్ బాబు మద్దతు తెలిపి, అనంతరం మాట్లాడుతూ గత 8 సంవత్సరాలుగా ఉద్యోగాలు లేక ఒకేసారి ఒక ప్రణాళిక లేకుండా ఉద్యోగాలు ప్రకటించడంతో, మానసిక శారీరక ఒత్తిడి కారణంగా మహేష్ మృతి చెందాడన్నారు.

జాబ్ క్యాలెండర్ నీ విడుదల చేయకుండా కాంగ్రెస్ పార్టీ ఎన్నిమార్లు రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించిన కూడా ఒకేసారి ఉద్యోగాలను విడుదల చేసి, నిరుద్యోగులను అయోమయానికి గురిచేస్తున్నారు.

పోలీస్ రిక్రూట్మెంట్ నిర్వహించే పోలీసు రిక్రూట్మెంట్ బోర్డ్,కనీస బాధ్యతగా శారీరక దేహారుఢ్య పరీక్షలు నిర్వహించేటప్పుడు ఒక స్పెషలిస్ట్ డాక్టర్ నీ అందుబాటులో ఉంచవలసిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది.డాక్టర్లు అందుబాటులో ఉంటే ఈరోజు మహేష్ మృతి చెందేవాడు కాదు, 

రిక్రూట్మెంట్ సెంటర్ నుండి ఉస్మానియా హాస్పటల్ వరకు తీసుక వెళ్లకుండా, అందుబాటులో ఉన్న సూపర్ స్పెషాలిటీ హాస్పటల్లో అనుభవజ్ఞులైన డాక్టర్ల దగ్గరికి తీసుకపోతే మహేష్ బ్రతికే అవకాశం ఉండేది.

ఉస్మానియా హాస్పిటల్ లో వైద్యులు సరైన సమయంలో స్పందించలేదని మహేష్ సహచరులు చెపుతున్నారు.

మహేష్ మృతికి రాష్ట్ర ముఖ్యమంత్రి, హోం మంత్రి, డిజిపి సమాధానం చెప్పాలి.

ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాల వల్ల  పోలీస్ శాఖ తీసుకున్న ఈవెంట్స్ కారణంగా చాలామందికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, ఇప్పటికైనా పోలీస్ శాఖ వారు ఈవెంట్స్ లో అభ్యర్థులకు ఇబ్బందులు తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, వైద్యులను వెంటనే అందుబాటులో ఉంచుకొని ప్రత్యేక వైద్య సేవలు అందించడానికి ముందు ఉండాలని,ఇలాంటి మహేష్ లాంటి వాళ్లను ఇక కోల్పోకుండా ముందస్తు చర్యలను తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.

అనేక ఆశలతో ఏకైక కొడుకును ఉన్నతమైన చదువు చదివించి ఉద్యోగం సాధిస్తే మంచి భవిష్యత్తు ఉంటుందనుకున్నా తల్లిదండ్రుల కల ప్రభుత్వ నిర్లక్ష్యంతో వృధా అయిపోయిందన్నారు.

లింగమల్ల మహేష్ మృతికి సంఘీభావంగా కాటారం సబ్ డివిజన్ ఐదు మండలాల యువకులు మహేష్ పరిచయం ఉన్నా లేకున్నా ఈ విధంగా చనిపోవడం బాధాకరమని,ప్రభుత్వం వారి కుటుంబానికి 50 లక్షల ఎక్స్గ్రేషియా,కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించాలని సంఘీభావం తెలిపారు.

మహేష్ మృతి పై ప్రభుత్వం పూర్తిస్థాయి విచారణ త్వరగా చేపట్టి,బాధ్యులపై చర్యలు తీసుకొని,పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ లో అంతకుముందు 800 మీటర్స్ ఉంటే,ఇప్పుడు దాన్ని 1600 మీటర్స్ పెంచి, లాంగ్ జంప్ ను కూడా పెంచి, ఏ రాష్ట్రంలో లేని కొలబద్దాలను పెంచి పోటీ దారులను తగ్గించాలని చూస్తున్న తీరును పునరాలోచించుకోవాలని, బాధిత కుటుంబానికి 50 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా,కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని ఏఐసీసీ కార్యదర్శి,మాజీ మంత్రి, మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ళ శ్రీధర్ బాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు..

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 


అంతర్గాంమండలంబ్రాహ్మణపల్లి స్థానిక మర్రిపల్లి చర్చిలో పాస్టర్ అబ్రహం & సంఘం ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకల్లో *సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ సంతోష్ కుమార్ , పాల్గొని బట్టలు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలోఎక్స్ సర్పంచ్  మడ్డి వెంకటేష్, కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ గాదె సుధాకర్, బైర్ కిరణ్ గౌడ్ పాల్గొని కేక్ కట్ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపి బట్టల పంపిణీ చేయడం జరిగింది

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 


అంతర్గాంమండలంబ్రాహ్మణపల్లి స్థానిక మర్రిపల్లి చర్చిలో పాస్టర్ అబ్రహం & సంఘం ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకల్లో *సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ సంతోష్ కుమార్ , పాల్గొని బట్టలు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలోఎక్స్ సర్పంచ్  మడ్డి వెంకటేష్, కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ గాదె సుధాకర్, బైర్ కిరణ్ గౌడ్ పాల్గొని కేక్ కట్ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపి బట్టల పంపిణీ చేయడం జరిగింది

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 

రామగుండం కార్పొరేషన్ పద్నాలుగు వ డివిజన్ పరిధి ఎల్కలపెల్లి గెట్ లో హోటల్ నడిపిస్తు బ్రతుకు ఎల్లదిస్తున్న శ్రీనివాస్ అనారోగ్యంతో ఆదివారం మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు అంతిమ యాత్ర కు సంబంధించిన పాడే సామాన్లు కావాలని ఎల్కలపెల్లీ గెట్ కు చెందిన స్థానికులు 

సేవా స్పూర్తి ఫౌండేషన్ అధ్యక్షులు మడిపెల్లి మల్లేష్ కు ఫోన్ చేసి చనిపోయిన కతుల శ్రీనివాస్ కుటుంబ పరిస్థితిని తెలిపి సహాయం కోరగా వెంటనే స్పందించిన.మడిపెల్లి మల్లేష్.

 మరణించిన కతుల శ్రీనివాస్

అంతిమ యాత్రకు కావలసిన  పాడే సమాన్లు 

అన్ని రకాల వస్తువులను ఫౌండేషన్ సభ్యుల  సహకారంతో మరణించిన కత్తుల శ్రీనివాస్  ఇంటి దగ్గరకు పంపించరని స్థానికులు తెలిపారు సహాయం అడగగానే స్పందించిన సేవా స్ఫూర్తి ఫౌండేషన్ అధ్యక్షులు మడిపెల్లి మల్లేష్ కు మరియు సేవా స్పూర్తి ఫౌండేషన్ సభ్యులకు స్థానికులు కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో కన్నూరి శంకర్.రవీందర్. షెరీఫ్. తదితరులు పాల్గొన్నారు