మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 


పాలకుర్తి: పుట్నూర్ గ్రామంలో *జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మక్కన్ సింగ్ రాజ్ ఠాగూర్ ముఖ్య అతిథిగా పాల్గొని జండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు వారు మాట్లాడుతూ

 బ్రిటిష్ ప్రభుత్వ అరాచక, నియంత,నిరంకుశ,దోపిడి పరిపాలన నుండి , బ్రిటిష్ కబంధ హస్తాల నుండి భారత దేశ ప్రజల విముక్తి కోసం, స్వేచ్ఛ కోసం, స్వాతంత్రం సాధించడం కోసం ఆనాడు దేశ ప్రజలకు ఒక వేదిక ఏర్పడింది అదే అఖిల భారత కాంగ్రెస్ పార్టీ. *28-డిసెంబర్-1885 న A.O హ్యూమ్ కన్వీనర్ గా చంద్ర బెనర్జీ అధ్యక్షుడు గా 72 మంది ప్రతినిధులతో కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించి నేడు ప్రపంచ అతిపెద్ద ప్రజాస్వామ్య, లౌకిక, సామ్యవాద పార్టీగా అవతరించి 2 కోట్ల యాభై లక్షల మంది సబ్యులుగా ఉన్నారు. 75 సంవత్సరాల స్వతంత్ర భారత దేశంలో 55 సం"రాలు పరిపాలన చేసి దేశ ప్రజలలో చైతన్యం నింపి అనేక రంగాల్లో మార్పుల శ్రీకారం చుట్టింది కాంగ్రెస్. వ్యవసాయ, పారిశ్రామిక, సాంకేతిక, విద్య,వైద్య,విద్యుత్, రవాణా రంగాలలో అద్భుతమైన ప్రగతిని సంధించి అమెరికా లాంటి అగ్ర దేశ సరసన నిలబెట్టిన ఘనత కాంగ్రెస్ పార్టీది. 

 ప్రస్తుతం దేశంలో బీజేపీ రాష్ట్రంలో టి.ఆర్.ఎస్ అరాచక పరిపాలన వలన ప్రజలకు రక్షణ లేకుండా పోయింది. ప్రజల కోసం పని చేయాల్సిన ప్రభుత్వం ప్రజల సొమ్మును రాబందుల వలె, పందికొక్కులు వలె మింగుతున్నారు.ఈ దోపిడీ పోవాలి దేశ,రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు నడుము బిగించి చేయి చేయి కలిపి కదంతోక్కుతూ ఈ అరాచక ప్రభుత్వల నుండి ప్రజలను రక్షించివరకు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పోరాటం చేయాలి అని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో వేల్పుల రాజ్ కుమార్, కెశోరం సిమెంట్ ఫ్యాక్టరీ కార్మిక యూనియన్ అధ్యక్షులు సుర సమ్మన్న, తక్కల్లాపల్లి సర్పంచ్ ముక్కెర శ్రీనివాస్, ఎంపీటీసీ పాత రవీందర్, తలారి శంకర్,తోట ప్రశాంత్,వర్మని శ్రీనివాస్,కాల్వ చిన్న రాజయ్య,కాల్వ శంకర్,కాల్వ శ్రీనివాస్, వైద్య నరేష్,,మంచినీళ్ల భాస్కర్,తిరుపతి, అజయ్, కన్నయ్య,ముషనవేని తిరుపతి, సిపతి సురేష్,సతీష్, మంతెన స్వామి, పత్తిపక శంకరయ్య, నిమ్మల నారాయణ, మాదాసు రాజు, తదితరులు పాల్గొన్నారు

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: