మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
రామగుండం కార్పొరేషన్ పరిధిలో 23 వ డివిజన్ కాకతీయ నగర్ కు చెందిన మదావత్ శివయ్య నాయక్ అనే నిరుపేద కుటుంబానికి మడిపెల్లి మల్లేష్ ఆధ్వర్యంలో ఫౌండేషన్ సభ్యుల సహకారంతో 25 కిలోల బియ్యం నిత్యావసర సరుకులను సేవా స్ఫూర్తి ఫౌండేషన్ సభ్యులు ఠాగూర్ నాయక్ స్థానిక కాకతీయ నగర్ లోని బాధిత కుటుంబానికి అందజేశారు అనంతరం ఠాగూర్ నాయక్ మాట్లాడుతూ మదావత్ శివయ్య నాయక్ కుటుంబ పరిస్థితిని సేవ స్ఫూర్తి ఫౌండేషన్ అధ్యక్షులు మడిపెల్లి మల్లేష్ కు తెలుపగానే వెంటనే స్పందించి మా ద్వారా బియ్యం నిత్యావసర సరుకులను పంపించడం జరిగిందని. రామగుండం నియోజకవర్గంలోని నిరుపేద కుటుంబాలకు చెందిన వారు మడిపెల్లి మల్లేష్ కు ఫోన్ చేసి వారి పరిస్థితి ని తెల్పగానే పేదవారి కంచంలో మెతుకు అవుతున్న సేవా స్ఫూర్తి ఫౌండేషన్ లో నేను కూడా ఒక సభ్యునిగా ఉండటం నాకు చాలా గర్వంగా ఉందని ఈ సేవ కార్యక్రమంలో పాల్గొనే అద్భుతమైన అవకాశాన్ని నాకు కల్పించిన ఫౌండేషన్ అధ్యక్షులు మల్లేష్ కు మరియు నా తోటి ఫౌండేషన్ సభ్యులకు మదావత్ శివయ్య నాయక్ కుటుంబం తరఫున మరియు రామగుండం ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నానని ఠాగూర్ నాయక్ అన్నారు ఈ కార్యక్రమంలో లావుడియ సురేష్ చిప్ప మల్లేష్ తదితరులు పాల్గొన్నారు
Post A Comment: