మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతనిధి గంగారపు వెంకటేష్
ఎన్టిపిసి మేడిపల్లి సెంటర్ వద్ద *ఎస్సిఆర్పిఎస్ పెద్దపెల్లి జిల్లా యూత్ కార్యదర్శి మలెం మధు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమాని ముఖ్యఅతిథిగా *బిజెపి మల్కాపూర్ మండల అధ్యక్షుడు మిట్టపల్లి సతీష్ కుమార్ హాజరై (డా"బి.ఆర్ అంబేద్కర్ జాతీయ అవార్డు గ్రహీత), *ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు భూషిపాక సంతోష్ మాహరజ్ ను ఘనంగా సన్మానించి అభినందనలు తెలియజేశారు.
ఈ సందర్భంగా *బివిఎఫ్ పెద్దపల్లి జిల్లా కన్వీనర్ రాయపాక సైనిష్ వర్మ మాట్లాడుతూ అంతర్గాం మండల దళిత బిడ్డ ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు భూషిపాక సంతోష్ మహారాజ్ కు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జాతీయ అవార్డు రావడం చాలా సంతోషకరమైన విషయం అని రానున్న రోజులలో ప్రజలకు ఇంకా సేవ చేయాలని, బడుగు బలహీన వర్గాలకు దగ్గరగా ఉంటూ, బహుజనులను ఏకం చేసి, ఎక్కడ అన్యాయం జరిగిన ముందుండి పనిచేయాలని కోరారు, ఈ కార్యక్రమంలో *బిజెపి మల్కాపూర్ మండల ప్రధాన కార్యదర్శి ఇదునురి చిరంజీవి , మాచర్ల అశోక్, టిఆర్ఎస్ నాయకులు మడ్డి అన్వేష్, ఇదినూరి ఆంజనేయులు, ఎస్సిఆర్పిఎస్ జిల్లా యూత్ అధ్యక్షులు ప్రేమ్ కుమార్, జిల్లా కార్యవర్గ సభ్యులు ఇదునూరి శ్రీమాన్ దితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు...
Post A Comment: