ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మధ్యాహ్నం 2.55 గంటలకు రామప్ప వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు చేరుకున్నారు.
రాష్ట్ర పతి ద్రౌపది ముర్ముతోపాటు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్, కేంద్ర మంత్రి జీ కిషన్ రెడ్డిలకు మంత్రి సత్యవతి రాథోడ్,జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య sp సంగ్రామ్ సింగ్ జి. పాటిల్, po అంకిత్,రాష్ట్ర పతి కి హెలిపాడ్ వద్ద స్వాగతం పలికారు.
దేవాలయం లో రాష్ట్ర పతి బృందానికి మంత్రులు డా. V. శ్రీనివాస్ గౌడ్, ఎర్రబెల్లి దయాకరరావు , పల్లా రాజేశ్వర్ రెడ్డి రాష్ట్ర పతి కి స్వాగతం పలికారు.
రామప్ప దేవాలయానికి చేరుకున్న ఆమెకు ఘన స్వాగతం పలికారు. రుద్రేశ్వరుడిని దర్శించుకుని రాష్ట్రపతి పూజలు చేశారు. రాష్ట్రపతికి ఆశీర్వచనం, తీర్థ ప్రసాదాలను వేద పండితులు అందించారు. మేడారం సమ్మక్క సారలమ్మ సారే ( చీర ను మేడారం ఆదివాసీ పూజారులు రాష్ట్రపతి, గవర్నర్ లకు ఇచ్చారు. ఆలయ విశిష్టత, నిర్మాణం, యునెస్కో గుర్తింపుకు కోసం తయారు చేసిన డోసియర్ వివరాలు, వరల్డ్ హెరిటేజ్ బాడి విధించిన నిబంధనలు, తదితర అంశాలను రాష్ట్రపతికి కాకతీయ హెరిటేజ్ ట్రస్టు కన్వీనర్ పాండురంగారావు వివరించారు. రామప్ప శిల్ప సంపద ఎంతో అద్భుతం గా ఉందని పొగిడారు.అనంతరం దేవాలయ ప్రాంగణం లో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదిక వద్ద 62 కోట్ల రూపాయలతో ప్రసాద్ స్కీం పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ముఖ్య అతిథులను , వీక్షకులను ఆకట్టుకున్నాయి. పరమశివుని పై పరంపరా బృందం చేసిన ప్రదర్శన ఆధ్యాత్మిక భావన కల్గించింది. మన సంస్కృతిని చాటే విధంగా కోమ్ముకోయ కళాకారుల బృందం సమక్క సారలమ్మ ప్రదర్శన ఆకట్టుకుంది, అనంతరం బ్రహ్మంఒక్కటే పర బ్రహ్మం ఒక్కటే అనే అన్నమాచార్య గీతం పై కళాకారులు ప్రదర్శించారు.అనంతరం జాతీయ గీతాన్ని ఆలపించి కార్యక్రమాన్ని ముగించారు.సాయంత్రం 4.23 నిముషాలకు కలెక్టర్ కృష్ణ ఆదిత్య, sp సంగ్రామ్ సింగ్ రాష్ట్ర పతి కి వీడ్కోలు పలికారు
Post A Comment: