మహాదేవపూర్ మండల ప్రతినిధి/దూది శ్రీనివాస్



మహాదేవపూర్: కాటారం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు,మాజీ  జెడ్పిటిసి,మాజీ సర్పంచ్, పుల్లూరి రాజేశ్వరరావు కు పార్టీలకతీతంగా రాజకీయ నేతలు పాల్గొని ఘనంగా నివాళులు అర్పించారు. కాటారం మండలం గారెపల్లి లో బుధవారం ఆయన స్వగృహం నందు సందర్శించి పలువురు నేతలు రాజేశ్వరరావు పార్థివ దేహం పై పుష్పగుచ్చాలు ఉంచి నివాళులు అర్పించారు. మంగళవారం రోజు గుండెపోటు రావడంతో వరంగల్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకువెళ్లి చికిత్స అందిస్తుండగా, సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఆయన తుది శ్వాస విడిచారు. మంగళవారం సాయంత్రం ఆయన మృతదేహాన్ని గారెపల్లి చౌరస్తా మీదుగా స్వగృహం వరకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు రాజేశ్వరరావు అమర్ రహే అంటూ,జనం నినాదాలు చేస్తూ పాదయాత్రతో ఘన నివాళి అర్పించారు.బుధవారం ఉదయం మాజీమంత్రి, ఏఐసీసీ కార్యదర్శి,మంథని శాసనసభ్యులు దుద్దిళ్ళ శ్రీధర్ బాబు,రాజేశ్వరరావు పార్థివదేహాన్ని సందర్శించి, పుష్పగుచ్చాలతో ఘనంగా నివాళులు అర్పించారు. రాజేశ్వరరావు మరణం తీరని లోటు అని శ్రీధర్ బాబు అన్నారు. రాజేశ్వరరావు అంత్యక్రియలలో పాల్గొని, అంతిమయాత్రలో శ్రీధర్ బాబు పాడే మోశారు. మంథని మున్సిపల్ చైర్ పర్సన్ పుట్ట శైలజ రాజేశ్వర్రావు పార్థివదేహాన్ని సందర్శించి,నివాళులు అర్పించారు.జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అయిత ప్రకాష్ రెడ్డి పార్తివదేహంపై పుష్పగుచ్చాలు ఉంచి ఘనంగా నివాళులర్పించారు. కాటారం ప్రాథమిక వ్యవసాయ సహకార సొసైటీ చైర్మన్ చల్ల నారాయణరెడ్డి పుష్పగుచ్చాల ఉంచి, అంతిమ యాత్ర లో పాల్గొని, పాడే మోశారు.  రాజకీయాలకు అతీతంగా పలువురు నేతలు పాల్గొని రాజేశ్వరరావు పార్థివదేహానికి పుష్పగుచ్చలు ఉంచి అంతిమ యాత్రలో పాల్గొన్నారు.తెలుగుదేశం పార్టీలో చురుకైన నాయకునుగా రాజేశ్వరరావు వ్యవహరించారు.అనంతరం అప్పట్లో మంథని ఎమ్మెల్యే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభాపతి గా వ్యవహరిస్తున్న దుద్దిళ్ల శ్రీపాదరావు నాయకత్వానికి ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో చేరారు.అప్పటినుంచి తాను తన కంఠంలో ప్రాణం ఉండగా కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని అన్న మాటలకు కట్టుబడి ఉన్నట్లుగా చివరి శ్వాస విడిచేంత వరకు కాంగ్రెస్ పార్టీలోనే రాజేశ్వరరావు కొనసాగి తుది శ్వాస విడిచారు.రాజేశ్వర్ రావు పార్తీవదేహాన్ని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు అందే భాస్కరాచారి, భారతీయ జనతా పార్టీ నాయకులు బొమ్మన భాస్కర్ రెడ్డి,బండం వసంత రెడ్డి, పూసాల రాజేంద్రప్రసాద్, దోమల సమ్మయ్య ఇతర పార్టీల నాయకులు సందర్శించి నివాళులు అర్పించారు. రాజేశ్వరరావుకు ముఖ్య సన్నిహితులుగా ఈ ప్రాంతంలోని ప్రముఖ వ్యక్తులుగా రాణించిన ఊర కమల మనోహర్ రావు మెమోరియల్  ట్రస్ట్ నిర్వాహకులు ఊర నందగోపాల్ రాజేశ్వరరావు పార్థీవ దేహాన్ని సందర్శించి పుష్పగిచ్చాలతో నివాళులు అర్పించిననంతరం శవయాత్రలో పాల్గొని పాడే మోశారు.మండల కేంద్రమైన గారేపల్లిలో శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవాలయంలో అయ్యప్ప దీక్ష ధారణ స్వాములు రాజేశ్వర్ రావు మృతికి సంతాపం ప్రకటిస్తూ రెండు నిమిషాలు మౌనం పాటించారు.గారేపల్లి మండల కేంద్రంలోని వ్యాపార,వాణిజ్య,దుకాణ సముదాయాలు స్వచ్ఛందంగా బంద్ పాటించారు.కుల మతాలకు అతీతంగా చిన్న పెద్ద అనే తేడా లేకుండా పరిసర ప్రాంతాలకు చెందిన ప్రజలు, సన్నిహితులు హాజరై రాజేశ్వర్ రావు అంతిమయాత్రలో పాల్గొని  కడసారి కన్నీటి వీడ్కోల్లతో సాగనంపారు.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: