మహాదేవపూర్ మండల ప్రతినిధి/దూది శ్రీనివాస్
జయశంకర్ భూపాలపల్లి జిల్లా,మహాదేవపూర్: మండల కేంద్రంలో ఈరోజు క్రిస్మస్ పర్వదినంను పురస్కరించుకొని,బెతెస్త ప్రార్ధన చర్చిలో ఏసుక్రీస్తు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి.ఏసుప్రభువు ను కీర్తిస్తూ,ఆలపించిన కీర్తనలతో,సామూహిక ప్రార్ధనలతో క్రైస్తవుల మందిరాలు మారు మోగాయి.క్రిస్మస్ ప్రత్యేక కేక్ ను కట్ చేసి,ఒకరికి ఒక్కరూ ప్రేమతో పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.ఏసుక్రీస్తు బోధనలు విశ్వశాంతికి సందేశాలని,సాటి మనుషులను ప్రేమతో చూడడం గొప్ప గుణమని,మానవతవిలువలతో చేసిన గొప్పపని ఏదైనా ఏసుక్రీస్తు దీవెనలు పొందెలా చేస్తుందని మహాదేవపూర్ సర్పంచ్ శ్రీపతిబాపు అన్నారు.ఈ కార్యక్రమంలో జెడ్పిటిసి గుడాల అరుణ, వ్యవసాయ సహకార సంఘం ఛైర్మెన్ చల్ల తిరుపతిరెడ్డి,ఉప సర్పంచ్ సల్మాన్ ఖాన్,బిఆర్ఎస్ పార్టీ యూత్ మండల అధ్యక్షులు అలీం ఖాన్,మహిళా విభాగం మంథని నియోజకవర్గ ఇంచార్జ్ కేదారి గీత,పార్టీ టౌన్ ప్రసిడెంట్ కూరతోట రాకేష్,జిల్లా గ్రంథాలయ సంస్థ డైరెక్టర్ వెన్నంపల్లి మహేష్,మండల నాయకులు మెరుగు శేఖర్,లక్ష్మణ్,చకినారపు చందు,భానుమతి,క్రైస్తవ మత పెద్దలు,సోదర, సోదరీమణులు,యువకులు తదితరులు పాల్గొన్నారు..

Post A Comment: