మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
ఎన్టీపీసీ చిలుకలయ్య గుడి ప్రాంగణంలో గల అయ్యప్ప దేవాలయంలో అయ్యప్ప రథోత్సవ కార్యక్రమాన్ని ఆలయ పూజారి నరహరి శర్మ సమక్షంలో ఆలయ కమిటీ చెప్పాలా రామారావు, డిప్యూటీ మేయర్ నడిపెల్లి అభిషేక రావు, ఆలయ గురుస్వామి ప్రభాకర్ స్వామి, కొబ్బరికాయ కొట్టి రథయాత్ర ప్రారంభించారు, మహిళలు సాంప్రదాయ దుస్తులు ధరించి మంగళహారతులతో స్వాగతం పలికి మహిళలు కోలాటాలు, అయ్యప్ప స్వాములు పేట తుళ్ళి తో వాయిద్యాలనడుమ అంగరంగ వైభవంగా ప్రారంభించి ఈ రథయాత్ర అన్నపూర్ణ కాలనీ మేడిపల్లి సెంటర్ మీదుగా ఎఫ్సిఐ ఎక్స్ రోడ్ నుండి తిరిగి ఆలయానికి చేరుకుంటుంది అని, అలాగే సోమవారం రోజున మండల పూజ కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఉదయం స్వామివారికి అభిషేకం గణపతి హోమం మధ్యాహ్నం మహా నైవేద్య అన్నదాన కార్యక్రమం సాయంత్రం పడిపూజ భజన కార్యక్రమం ఉంటుందని గురుస్వామి తెలియజేశారు ఈ కార్యక్రమంలో రాజు గురుస్వామి బండి తిరుపతి స్వామి యాదవ్ స్వామి అశోక్ రెడ్డి బండి అనిల్ రామగుండం గురుస్వామి రాములు గౌడ్ మరియు వారి అయ్యప్ప స్వాములు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు అన్నారు
Post A Comment: