మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
డిసెంబర్ 31 వేడుకలు వద్దు ... ఆ డబ్బులతో నిరుపేదలకు సహాయం చేయమని యువతకు చిన్నారుల ఛాలెంజ్ పెద్దపల్లి మండలం తుర్కల మద్దికుంట గ్రామంలో అంగవైకల్యంతో నడవడానికి ఇబ్బంది పడుతున్న విజేయ్ కుమార్ గురించి తెలుసుకున్న చిన్నారులు చలించిపోయారు. సుల్తానాబాద్ మండల కేంద్రం ద్వారాకనగర్ లో నివాసముంటున్న ఏగోలపు సదయ్య గౌడ్ కూతురు జ్యోషిక వయస్సు 15, కౌశిక్ వయసు 14 చిన్నారులు ఈ రోజు *పెద్దపల్లి మండలం తుర్కల మద్దికుంట గ్రామంలో నివాసముంటున్న నిరుపేద కుటుంబానికి చెందిన ఈదునూరి దుర్గయ్య - సంతోషి కుమారుడు విజేయ్ కుమార్ అంగవైకల్యంతో నడవడానికి కష్టంగా ఉన్నట్లు తెలుసుకున్న చిన్నారులు వెంటనే స్పందించి వీరు దాచుకున్న డబ్బులు మరియు దాత అల్లం సత్యనారాయణ దంపతుల సహాయంతొ 6800/-రూపాయల విలువ గల వీల్ చైర్ అందించారు. చిన్నారులు
జ్యోషిక ,కౌశిక్ లు విజేయ్ కుమార్ గురించి అల్లం సత్యనారాయణ దంపతులకు చెప్పి విరాళాలు అడిగారు. వీరు వెంటనే స్పందించి గత మూడు సంవత్సరాల లాగే ఈ సంవత్సరం కూడా ఛాలెంజ్ ప్రోగ్రాం చేయమని అల్లం సత్యనారాయణ దంపతులు 5000/- రూపాయలు విరాళంగా ఇచ్చి ప్రోత్సహించారు. *చిన్నారులు జ్యోషిక, కౌశిక్ లు మాట్లాడుతూ యువతి యువకులకు మరియు పెద్దవాళ్ళుకు ఛాలెంజ్ చేస్తున్నాము డిసెంబర్ 31 వేడుకలు దావతులు వద్దు .డిసెంబర్ 31 వల్ల మన తలరాతలు మారవని క్యాలెండర్లో తేదీ మాత్రమే మారుతుందని ఇది మన సంసృతి సాంప్రదాయం కాదనిఇది విదేశీ సంస్ర్కుతి అని మన పండుగ ఉగాదని చెప్పారు. మీరు 31న దావతులకు ఖర్చు పెట్టె డబ్బులు నిరుపేద కుటుంబాలకు సహాయం చేయాలని వేడుకున్నారు 2020 లాక్ డౌన్లో వీరుదాచుకున్న డబ్బులు మరియు దాతల సహాయం తో 207 మంది నిరుపేద కుటుంబాలకు, సెప్టెంబర్ నెలలో టీచర్స్ డే సందర్భంగా 200మంది ప్రయివేటు ఉపాద్యాయులకు మొత్తం 407 మందికి ఒక్కొక్కరికి 500 రూపాయల విలువ గల నిత్యావసర సరుకులను అందించారు.2021 రెండవ లాక్ డౌన్లో కరోనతో బాధపడుతున్న 156 మంది కరోన పేసేంట్లకు ఒక్కొక్కరికి 350 రూపాయల విలువ గల హెల్త్ ఫుడ్ ఫ్రూట్స్, ఎగ్స్ అందించారు. ఇట్టి కార్యక్రమంలో ఏగోలపు సదయ్య గౌడ్ ,అల్లం సత్యనారాయణ ,ఏగోలపు రాజేశం గౌడ్,బుర్ర రాజమల్లు గౌడ్,శంకర్ గౌడ్,శ్రీనివాస్ గౌడ్, వెలిశాల తిరుపతి గౌడ్,బాలాజీ గౌడ్,బొషెల్లీ మహేష్, ఇదునూరి సాల్ మోహన్, బుర్ర నారాయణ గౌడ్, శ్రీనివాస్ గౌడ్,మొగిలి గౌడ్,నరేష్ గౌడ్, వడ్లూరి ప్రభాకర్, ఇదునూరి రవి తదితరులు పాల్గొన్నారు
Post A Comment: