ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజాదివాస్ కార్యక్రమంలో భాగంగా సోమవారం, సమస్యలతో వచ్చిన 17 మంది బాధితుల నుంచి ఎస్పి జె. సురేందర్ రెడ్డి ఫిర్యాదులు స్వీకరించారు. బాధితుల సమస్యలపై స్పందించి సంబంధిత పోలీసు అధికారులతో ఫోన్లో మాట్లాడారు. ప్రజల సమస్యలపై విచారణ జరిపి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, బాధితులకు న్యాయం చేయాలని ఎస్పి ఆదేశించారు. పోలీసులు ప్రజలతో స్నేహంగా వ్యవహరిస్తూ, పోలీసు శాఖ పై నమ్మకం కలిగే విధంగా పని చేయాలన్నారు. అలాగే శాంతి భద్రతల పరిష్కారంలో ప్రజలు పోలీసులకు సహకరించాలని అన్నారు. సంఘ విద్రోహా శక్తులు, అసాంఘిక కార్యకలాపాలపై ఎప్పటికప్పుడు, సమాచారం తెలియజేయాలని ఎస్పి కోరారు
Post A Comment: