మహాదేవపూర్ మండల ప్రతినిధి/దూది శ్రీనివాస్
జయశంకర్ భూపాలపల్లి జిల్లా,మహాదేవపూర్/ మహా ముత్తారం గ్రామానికి చెందిన లింగమల్ల మహేష్ పోలీస్ ఈవెంట్స్ లో పాల్గొని మృతి చెందడం బాధాకరమని, మహేష్ పార్థీవ దేహానికి నివాళులర్పించి,వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేసి మహా ముత్తారం గ్రామస్తులు చేస్తున్న నిరసన కార్యక్రమానికి ఏఐసీసీ కార్యదర్శి మాజీ మంత్రి మంథని ఎమ్మెల్యే శ్రీ దుద్దిళ్ళ శ్రీధర్ బాబు మద్దతు తెలిపి, అనంతరం మాట్లాడుతూ గత 8 సంవత్సరాలుగా ఉద్యోగాలు లేక ఒకేసారి ఒక ప్రణాళిక లేకుండా ఉద్యోగాలు ప్రకటించడంతో, మానసిక శారీరక ఒత్తిడి కారణంగా మహేష్ మృతి చెందాడన్నారు.
జాబ్ క్యాలెండర్ నీ విడుదల చేయకుండా కాంగ్రెస్ పార్టీ ఎన్నిమార్లు రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించిన కూడా ఒకేసారి ఉద్యోగాలను విడుదల చేసి, నిరుద్యోగులను అయోమయానికి గురిచేస్తున్నారు.
పోలీస్ రిక్రూట్మెంట్ నిర్వహించే పోలీసు రిక్రూట్మెంట్ బోర్డ్,కనీస బాధ్యతగా శారీరక దేహారుఢ్య పరీక్షలు నిర్వహించేటప్పుడు ఒక స్పెషలిస్ట్ డాక్టర్ నీ అందుబాటులో ఉంచవలసిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది.డాక్టర్లు అందుబాటులో ఉంటే ఈరోజు మహేష్ మృతి చెందేవాడు కాదు,
రిక్రూట్మెంట్ సెంటర్ నుండి ఉస్మానియా హాస్పటల్ వరకు తీసుక వెళ్లకుండా, అందుబాటులో ఉన్న సూపర్ స్పెషాలిటీ హాస్పటల్లో అనుభవజ్ఞులైన డాక్టర్ల దగ్గరికి తీసుకపోతే మహేష్ బ్రతికే అవకాశం ఉండేది.
ఉస్మానియా హాస్పిటల్ లో వైద్యులు సరైన సమయంలో స్పందించలేదని మహేష్ సహచరులు చెపుతున్నారు.
మహేష్ మృతికి రాష్ట్ర ముఖ్యమంత్రి, హోం మంత్రి, డిజిపి సమాధానం చెప్పాలి.
ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాల వల్ల పోలీస్ శాఖ తీసుకున్న ఈవెంట్స్ కారణంగా చాలామందికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, ఇప్పటికైనా పోలీస్ శాఖ వారు ఈవెంట్స్ లో అభ్యర్థులకు ఇబ్బందులు తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, వైద్యులను వెంటనే అందుబాటులో ఉంచుకొని ప్రత్యేక వైద్య సేవలు అందించడానికి ముందు ఉండాలని,ఇలాంటి మహేష్ లాంటి వాళ్లను ఇక కోల్పోకుండా ముందస్తు చర్యలను తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.
అనేక ఆశలతో ఏకైక కొడుకును ఉన్నతమైన చదువు చదివించి ఉద్యోగం సాధిస్తే మంచి భవిష్యత్తు ఉంటుందనుకున్నా తల్లిదండ్రుల కల ప్రభుత్వ నిర్లక్ష్యంతో వృధా అయిపోయిందన్నారు.
లింగమల్ల మహేష్ మృతికి సంఘీభావంగా కాటారం సబ్ డివిజన్ ఐదు మండలాల యువకులు మహేష్ పరిచయం ఉన్నా లేకున్నా ఈ విధంగా చనిపోవడం బాధాకరమని,ప్రభుత్వం వారి కుటుంబానికి 50 లక్షల ఎక్స్గ్రేషియా,కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించాలని సంఘీభావం తెలిపారు.
మహేష్ మృతి పై ప్రభుత్వం పూర్తిస్థాయి విచారణ త్వరగా చేపట్టి,బాధ్యులపై చర్యలు తీసుకొని,పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ లో అంతకుముందు 800 మీటర్స్ ఉంటే,ఇప్పుడు దాన్ని 1600 మీటర్స్ పెంచి, లాంగ్ జంప్ ను కూడా పెంచి, ఏ రాష్ట్రంలో లేని కొలబద్దాలను పెంచి పోటీ దారులను తగ్గించాలని చూస్తున్న తీరును పునరాలోచించుకోవాలని, బాధిత కుటుంబానికి 50 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా,కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని ఏఐసీసీ కార్యదర్శి,మాజీ మంత్రి, మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ళ శ్రీధర్ బాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు..
Post A Comment: